E-Paper
Advertisement

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!
Advertisement

Used Car Buying Tips 2026: భారత్ లో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, చాలా మంది కారు కొనేటప్పుడు వెహికల్ కండీషన్, యాక్సిడెంట్స్ హిస్టరీ, డాక్యుమెంట్స్ విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. కానీ,  ఇప్పుడు నేరుగా కార్ల కంపెనీలు, నమ్మకమైన టెక్ ప్లాట్‌ ఫారమ్‌ లు కన్ఫార్మ్ చేసిన ప్రీ ఓన్డ్ కార్లను అధికారికంగా అమ్ముతున్నాయి. అన్ని చెకింగ్స్ చేయడంతో పాటు వారంటీ, చట్టపరమైన సాయం లాంటి బెనిఫిట్స్ తో వస్తాయి. సో, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

కంపెనీల అఫీషియల్ ప్రీ ఓన్డ్ షోరూమ్‌లు

పాపులర్ కార్ల తయారీ సంస్థలు సొంత ప్రీ ఓన్డ్ నెట్‌ వర్క్‌ లను కలిగి ఉన్నాయి. ఇక్కడ అమ్మే ప్రతి కారును ముందుగానే పూర్తిగా చెక్ చేసి, అవసరమైన రిపేర్లు చేసిన తర్వాతే అమ్మకానికి ఉంచుతారు. మారుతి సుజుకి ట్రూ వాల్యూలో వెహికల్ ను పూర్తిగా పరిశీలించి క్వాలిటీని నిర్ధారిస్తారు. కొన్ని మోడళ్లపై అధికారిక వారంటీ, సర్వీస్ బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. ఇక హ్యుందాయ్ ప్రామిస్ ద్వారా విక్రయించే కార్లకు కూడా తనిఖీల తర్వాత వారంటీ అందిస్తారు. అలాగే మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ పలు బ్రాండ్ల కార్లను ఒకే చోట అందించే నమ్మకమైన నెట్‌ వర్క్‌ గా గుర్తింపు పొందింది. టాటా మోటార్స్ అష్యూర్డ్, టయోటా యూ ట్రస్ట్ లాంటి సంస్థలు కూడా అన్ని క్వాలిటీ చెకింగ్స్ చేసిన తర్వాత మాత్రమే కార్లను విక్రయిస్తాయి. కొనుగోలుదారులకు భద్రత మీద భరోసాను అందిస్తాయి.

మల్టీ బ్రాండ్ ప్లాట్‌ఫారమ్‌లు

Advertisement

ఒకేసారి పలు కంపెనీల కార్లను పోల్చి చూడాలనుకునేవారికి కార్ 24, స్పిన్నీ లాంటి ప్లాట్‌ ఫారమ్‌లు మంచి ఆప్షన్ గా ఉన్నాయి. కార్24లో ప్రతి వాహనాన్ని అన్ని టెక్నికల్ అంశాల ఆధారంగా పరీక్షిస్తారు. ఆన్‌లైన్ ఫైనాన్స్, ఇంటి దగ్గరే టెస్ట్ డ్రైవ్, ట్రయల్ పీరియడ్ లాంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. స్పిన్నీలో ప్రతి కారుకు పూర్తి చెకింగ్స్ తో పాటు పాటు ధర, వారంటీ, మనీ బ్యాక్ గ్యారెంటీ లాంటి ప్రయోజనాలు ఉంటాయి. దీంతో కొనుగోలుదారులకు పారదర్శకమైన సర్వీసు లభిస్తుంది.

ఎలా కొనుగోలు చేయాలంటే?  

ముందుగా అధికారిక వెబ్‌సైట్ లేదంటే యాప్‌ లోకి వెళ్లి బడ్జెట్, సిటీ, ఫ్యూయల్ టైప్, మోడల్ ఆధారంగా కార్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి కారుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు, చెక్ రిపోర్టును కూడా చూసే అవకాశం ఉటంఉంది. నచ్చిన కారుకు టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు ఇంటి దగ్గరే వాహనాన్ని తీసుకొచ్చి టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం కల్పిస్తాయి. కారు నచ్చితే నేరుగా డబ్బులు చెల్లించవచ్చు. లేదంటే బ్యాంక్ లోనూ కూడా తీసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలులో చాలామందికి ఆర్‌సీ ట్రాన్స్ ఫర్, ఇతర డాక్యుమెంట్స్ విషయంలో ఆందోళన ఉంటుంది. కానీ, అధికారిక సంస్థల నుంచి కొనుగోలు చేస్తే ఈ వ్యవహారాన్ని కంపెనీయే పూర్తి చేస్తుంది. రిజిస్ట్రేషన్ ట్రాన్స్ ఫర్ పూర్తయిన తర్వాత కారును మీకు అందజేస్తుంది. కొన్ని కంపెనీలు ఇంటి దగ్గరికి డెలివరీ కూడా చేస్తాయి.

Advertisement

Read Also: హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×