E-Paper
Advertisement

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!
Advertisement

Touchscreen Laptops 2026: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ల్యాప్‌టాప్‌ల వినియోగ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పటిలా కీబోర్డ్ ఆపరేషన్స్ కే పరిమితం కాకుండా ప్రస్తుతం టాబ్లెట్ తరహా సౌలభ్యం అందించే టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌లు పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్లే వాటికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2026 జులై నాటికి టెక్ ప్రపంచంలో అద్భుతమైన ఫీచర్లు, ఏఐ సామర్థ్యం, పవర్ ఫుల్ ప్రాసెసర్లతో వచ్చిన టాప్-5 టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డెల్ ఎక్స్‌పీఎస్ 14 (2026)

డెల్ నుంచి సరికొత్తగా వచ్చిన XPS 14 (2026).. అల్ట్రాపోర్టబుల్ కేటగిరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. 14 అంగుళాల క్రిస్ప్ ఓలెడ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, వై-ఫై 7 కనెక్టివిటీ, సరికొత్త ఇంటెల్ ఆల్ట్రా ప్రాసెసర్ల సపోర్ట్‌తో ఇది పనిచేస్తుంది. అద్భుతమైన బ్యాటరీ లైఫ్, మెటాలిక్ ఫినిషింగ్ వల్ల కంటెంట్ క్రియేటర్లు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.

ఆసస్ జెన్‌బుక్ 14

Advertisement

ఆసస్ జెన్ బుక్ 14.. అత్యంత స్పష్టమైన వైబ్రెంట్ కలర్స్ అందించే OLED టచ్‌స్క్రీన్ తో వచ్చింది. స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన ఈ ల్యాప్ టాప్.. మల్టీటాస్కింగ్ ఎంతో ఈజీగా ఉంటుంది. అలాగే బరువు తక్కువగా ఉండటం ఎక్కడికైనా తేలిగ్గా దీనిని క్యారీ చేయవచ్చు.

ఆసస్ ఎక్స్‌పర్ట్‌బుక్ ఆల్ట్రా

వ్యాపారవేత్తలను దృష్టిలో ఉంచుకొని ఈ ల్యాప్ టాప్ ను తీసుకొచ్చారు. ఇది కేవలం 0.99 కేజీల బరువుతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. 3K టాన్డెమ్ ఓలెడ్ టచ్‌స్క్రీన్, AI ఫీచర్లు, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో రూపొందిన ఈ ల్యాప్‌టాప్.. ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి పర్ఫెక్ట్ ఛాయిస్.

హెచ్‌పీ ఆమ్నీబుక్ X ఫ్లిప్

Advertisement

హెచ్‌పీ నుంచి వచ్చిన ఆమ్నీబుక్ X ఫ్లిప్.. 2-ఇన్-1 డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. 14-అంగుళాల 3K OLED టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను 360 డిగ్రీలు తిప్పి సులభంగా టాబ్లెట్‌లా వాడుకోవచ్చు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో పాటు Copilot+ AI ప్రాసెసింగ్ ఫీచర్లు అందించారు.

Also Read: బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

లెనోవో యోగా 7

ఈ ల్యాప్ టాప్ స్టైలస్ (Digital Pen) సపోర్ట్‌తో వచ్చింది. నోట్స్ రాసుకోవడానికి, డ్రాయింగ్ చేయడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. అధిక బ్యాటరీ లైఫ్, డ్యూయల్ స్పీకర్లు, ఫ్లెక్సిబుల్ బాడీతో వచ్చి ఈ ల్యాప్ టాప్.. యూజర్ల నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకుంటోంది.

Also Read: Insurance: కేంద్రం ఓకే.. కానీ రాష్ట్రానికే ఏమైంది?.. పెండింగ్‌లో 5 లక్షల బీమా..!

Related News

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

Big Stories

Advertisement
×