E-Paper
Advertisement

Best SUV Under Rs 15 Lakh: క్రెటా, కియా, సెల్టోస్.. రూ.15 లక్షల లోపు బెస్ట్ SUV ఏదంటే?

Best SUV Under Rs 15 Lakh: క్రెటా, కియా, సెల్టోస్.. రూ.15 లక్షల లోపు బెస్ట్ SUV ఏదంటే?
Advertisement

చాలా మందికి కారు కొనాలని ఉంటుంది. ఎంత ధరలో ఏ కారు కొంటే బాగుంటుంది? అనే విషయంలో సరైన ఐడియా ఉండదు. ఒకవేళ మీ దగ్గర రూ. 15 లక్షలు ఉండి వోక్స్‌ వాగన్ విర్టస్, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ లో ఏ కారు కొనాలో తెలియక అయోమయంలో ఉన్నారా? ఇవన్నీ మంచి ఆప్షన్స్. విర్టస్ సెడాన్ కాగా, మిగతావి కాంపాక్ట్ SUVలు. 2026లో లేటెస్ట్ ధరలు, ఫీచర్లు, అనుకూల, ప్రతికూల అంశాల ఆధారంగా ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హ్యుండాయ్ క్రెటా

ఇది SUVగా మార్కెట్లోకి అడుగు పెట్టింది. ధర రూ.10.73 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.  పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 1.5L NA, 115PS పవర్, 144Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 17-18 మైలేజ్ ఇస్తుంది. 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కలిగి ఉంటుంది.  వైర్‌లెస్ ఛార్జింగ్, టచ్‌స్క్రీన్, విశాలమైన బూట్ స్పేస్, మంచి సర్వీస్ నెట్‌ వర్క్, మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. తక్కువ టార్క్, సాధారణ డ్రైవింగ్ ఫీల్, సేఫ్టీ రేటింగ్ తక్కువ ఉండటం మైనస్ గా చెప్పుకోవచ్చు.

⦿ కియా సెల్టోస్

Advertisement

ఇది కూడా బెస్ట్ SUVలలో ఒకటిగా ఉంది. ధర రూ. 10.99 లక్షలుగా ఉంది. 1.5L NA పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 115PS పవర్, 144Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజ్ 17 కిలో మీటర్లు ఇస్తుంది.  స్టైలిష్ డిజైన్, వాల్యూ ఫర్ మనీ, క్రూజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం ఫీల్ ఉంటుంది. క్రెటాతో సమానమైన ఇంజిన్ అయినా, సర్వీస్ సెంటర్లు తక్కువగా ఉంటాయి.

⦿ స్కోడా కుషాక్

ఇది కూడా SUV సెగ్మెంట్ లో అందుబాటులో ఉంది. ధర రూ. 10.66 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 1.0L టర్బో ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 115PS పవర్, 178Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 18-19 కి.మీ మైలేజ్ ఇస్తుంది. 5 స్టార్ రేటింగ్ ను కలిగి ఉంటుంది. ఫన్ టు డ్రైవ్, ప్రీమియం బిల్డ్, ఫిట్ ఫినిష్, మంచి మైలేజ్, సేఫ్టీ టాప్ తో ఆకట్టుకుంటుంది. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్,  చిన్న బూట్ స్పేస్, తక్కువ సర్వీస్ నెట్‌ వర్క్, ట్రాఫిక్‌లో మైలేజ్ తగ్గుతుంది.

⦿ వోక్స్‌ వాగన్ విర్టస్

Advertisement

ఇది సెడాన్. ధర రూ. 10.50 లక్షలుగా ఉంటుంది. 1.0L టర్బో ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 115PS పవర్, 178Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 20 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. విశాలమైన బూట్ స్పేస్,  మంచి హ్యాండ్లింగ్, ప్రీమియం ఇంటీరియర్ తో ఆకట్టుకుంటుంది. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, సర్వీస్ కాస్ట్ ఎక్కువ, ఫీచర్లు తక్కువ లాంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి.

ఏది బెస్ట్ కారంటే?

ఒకవేళ మీకు SUV కావాలంటే కియా సెల్టోస్ బెస్ట్. లుక్, వ్యాల్యూ పరంగా ఒకే. స్కోడా కుషాక్ సేఫ్టీ, డ్రైవ్ పవరంగా బెస్ట్. క్రెటా సేఫ్ సెలెక్షన్.  ఒకవేళ సెడాన్ కావాలనుకుంటే  విర్టస్ తీసుకుంటే మంచింది. మంచి మైలేజ్,   స్పేస్ ను కలిగి ఉంటుంది.

Read Also:  జస్ట్ రూ. 3.5 లక్షలకే 1200 కి.మీ రేంజ్, మార్కెట్లోకి సూపర్ ఎలక్ట్రిక్ కారు!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×