E-Paper
Advertisement

Bestune Xiaoma EV: జస్ట్ రూ. 3.5 లక్షలకే 1200 కి.మీ రేంజ్, మార్కెట్లోకి సూపర్ ఎలక్ట్రిక్ కారు!

Bestune Xiaoma EV: జస్ట్ రూ. 3.5 లక్షలకే 1200 కి.మీ రేంజ్, మార్కెట్లోకి సూపర్ ఎలక్ట్రిక్ కారు!

Bestune Xiaoma Mini EV 2026: ఎలక్ట్రిక్ కార్లు ఆటో మోబైల్ మార్కెట్ ను ఏలబోతున్నాయి. తక్కువ ధరలో అదిరిపోయే రేంజ్ అందించే ఈవీలు అందుబాటులోకి వస్తున్నాయి. రీసెంట్ గా చైనాకు చెందిన బెస్ట్యూన్ సంస్థ సామాన్యులకు ఉపయోగపడేలా అద్భుతమైన కారును పరిచయం చేసింది. షాఓమా ఈవీ పేరుతో ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. తక్కువ ధరలో, ఊహించని రేంజ్ తో ఈ కారు రిలీజ్ చేసింది. ఇది క్యూట్ డిజైన్‌ తో, అర్బన్ యూజ్‌ ఉపయోగపడేలా రూపొందించింది. ప్రస్తుతం చైనా మార్కెట్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు.

బెస్ట్యూన్ షాఓమా ఈవీ ధర

ప్రస్తుతం ఈ కారు చైనా మార్కెట్ లో అందుబాటులో ఉంది. అక్కడ ఈ కారు ధర 29,900 – 40,900 యువాన్లుగా ఉంది. భారత కరెన్సీ ప్రకారం ఈ ధర రూ.3.5 లక్షలు నుంచి రూ.4.8 లక్షలు ఉంటుంది.

బెస్ట్యూన్ షాఓమా ఈవీ ఫీచర్లు  

తక్కువ ధర అయినప్పటికీ బెస్ట్యూన్ షాఓమా ఈవీ మంచి ఫీచర్లను కలిగి ఉంది. 7 ఇంచ్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ టోన్ డ్యాష్‌ బోర్డ్, రోటరీ కంట్రోల్ డయల్స్, స్మూత్ ఫినిష్, LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, లెదరెట్ సీట్లు ఉన్నాయి. బాక్సీ డిజైన్, డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, లార్జ్ స్క్వేర్ హెడ్‌ ల్యాంప్స్, ఏరోడైనమిక్ వీల్స్, మ్యాచింగ్ టెయిల్ ల్యాంప్స్,  బంపర్, ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్తో 3 డోర్ హ్యాచ్‌ బ్యాక్ గా రూపొందింది. ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఎయిర్‌ బ్యాగ్, ఫ్రంట్ కెమెరా, బిల్ట్ ఇన్ వీడియో రికార్డర్, రియర్ వ్యూ కెమెరా, ఆప్షనల్ వీల్ కవర్స్,  ఎక్స్‌ టీరియర్ స్టైలింగ్ ప్యాకేజీని కలిగి ఉంది. ప్రస్తుతం హార్డ్‌ టాప్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. కన్వర్టిబుల్ వెర్షన్ మరికొద్ది నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బెస్ట్యూన్ షాఓమా ఈవీ రేంజ్

బెస్ట్యూన్ షియావోమా మోడల్‌ ను బట్టి రేంజ్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లు సుమారు 122-170 కి.మీ పరిధిని అందిస్తాయి. స్పెషల్ రేంజ్ ఎక్స్‌ టెండెడ్, అంతకంటే పెద్ద బ్యాటరీ వెర్షన్‌లు ఒకే ఛార్జ్‌ పై 800 కి.మీ లేదంటే 1200 కి.మీ వరకు రేంజ్ అందిస్తాయి. ప్యూర్ ఎలక్ట్రిక్ మోడల్స్ 122-170 కిలో మీటర్ల రేంజ్, రేంజ్ ఎక్స్‌ టెండర్ మోడల్స్ 800 కి.మీ నుంచి 1200 కి.మీ రేంజ్ ను అందిస్తాయి. ఈ మోడల్స్ అల్ట్రా లాంగ్ ట్రిప్‌ లకు గ్యాసోలిన్ సహాయాన్ని అందిస్తాయి. ఇంకా చెప్పాలంటే, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెర్షన్లు తక్కువ రేంజ్ ను అందిస్తాయి. కానీ, బ్యాటరీకి అనుబంధంగా చిన్న గ్యాసోలిన్ ఇంజిన్‌ను ఉపయోగించే రేంజ్ ఎక్స్‌ టెండెడ్ మోడల్‌ను ఎంచుకుంటే చాలా ఎక్కువ రేంజ్ అంటే సుమారు 800-1200 కి.మీ అందిస్తాయి.

బెస్ట్యూన్ షాఓమా ఈవీ స్పెసిఫికేషన్లు

బెస్ట్యూన్ షాఓమా ఈవీలో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. 18.1 kWh కెపాసిటీని కలిగి ఉంటుంది. 30 Kw పవర్ ను కలిగి ఉంటుంది. 90 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 100 కిలో మీటర్లు ఉంటుంది. ఛార్జింగ్ 30-80%  వరకు 1.1 గంటల్లో అవుతుంది. ఈ ఈవీలో4 సీట్లు ఉంటాయి.

ఇండియాలో లాంచింగ్ ఎప్పుడు?

చైనాలో ఈ కారు 2025 జూలైలో రిలీజ్ అయింది. మినీ EV సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది.  నవంబర్ 2025లో 12,905 యూనిట్లు సేల్ అయ్యాయి. త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ కన్ఫార్మ్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అదుర్స్!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×