E-Paper
Advertisement

Fuel Filling Tips: ఆ టైమ్ లో పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Fuel Filling Tips: ఆ టైమ్ లో పెట్రోల్ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!
Advertisement

Best Time to Fill Petrol: వాహనాల్లో పెట్రోల్ ఎప్పుడు కొట్టించుకుంటే మంచిదనే ప్రశ్న చాలా మందికి తరచుగా ఎదురవుతుంది.  ఎప్పుడు కొట్టించుకున్నా లీటర్ లీటరే కదా.. అని చాలా మంది లైట్ తీసుకుంటారు. పెద్దగా పట్టించుకోరు. కానీ, సరైన సమయంలో పెట్రోల్ నింపించడం ద్వారా కొంత లాభం కలుగుతుందంటున్నారు నిపుణులు. సాధారణంగా ఉదయం వేళ లేదంటే రాత్రి సమయంలో పెట్రోల్ కొట్టించుకోవడం మంచిదంటున్నారు. ఉష్ణోగ్రతలో తేడా కారణంగా ఎక్కువ ఫ్యూయెల్ పొందే అవకాశం ఉందంటున్నారు.

ఎక్కువ పెట్రోల్ ఎలా వస్తుంది?

ఉదయం, రాత్రి సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సమయంలో పెట్రోల్ సాంద్రత  కొంచెం ఎక్కువగా ఉంటుంది. సాదారణంగా చెప్పాలంటే, చల్లని పరిస్థితుల్లో ఇంధనం కొద్దిగా కుదించబడిన స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో పెట్రోల్ పోయించుకోవడం వల్ల మీరు చెల్లించే అదే మొత్తానికి కాస్త ఎక్కువ ఫ్యూయెల్ లభించే అవకాశం ఉంటుంది. మరీ పెద్ద మొత్తం కాకపోయినా, తరచుగా ఇలా చేయడం వల్ల కొంతమేర సేవింగ్ అవుతుందంటున్నారు.

మధ్యాహ్నం పెట్రోల్ పోయిస్తే ఏమవుతుంది?

Advertisement

ఒకవేళ మధ్యాహ్నం లేదంటే ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో పెట్రోల్ కొట్టించుకుంటే, అధిక ఉష్ణోగ్రత వల్ల ఫ్యూయెల్ విస్తరిస్తుంది. విస్తరించిన ఇంధనం పరిమాణంలో కొంచెం పెరిగినట్లు కనిపిస్తుంది. అంటే, కొంత తక్కువ మొత్తంలో లభిస్తుందట. అంటే, లీటర్ కొలతలో పెద్ద తేడా కనిపించకపోయినా, సూక్ష్మంగా కొద్దిగా నష్టం జరుగుతుంది. అందుకే చాలా మంది నిపుణులు చల్లని సమయాల్లో ఫ్యూయల్ నింపించుకోవాలని సూచిస్తారు.

టైమ్ తో పాటు జాగ్రత్తలూ ముఖ్యమే!

పెట్రోల్ కొట్టించుకునే విషయంలో కేవలం సమయం మాత్రమే కాదు, మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం . పెట్రోల్ బంక్ దగ్గర ట్యాంకర్ ద్వారా కొత్తగా ఇంధనం నింపుతున్నప్పుడు వెంటనే పెట్రోల్ కొట్టించకపోవడం మంచిది. ఆ సమయంలో అండర్ గ్రౌండ్ లోని ట్యాంక్‌ లో ఉన్న మట్టి, దుమ్ము లాంటి మలినాలు పైకి వచ్చి ఇంధనంలో కలిసే అవకాశం ఉంటుంది. అలాంటి ఇంధనం వాహనంలోకి వెళ్లితే ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏటంటే.. ఎప్పుడూ పెట్రోల్ కొట్టించుకునే ముందు మీటర్  జీరోలో ఉందో లేదో చూసుకోవాలి. ఇది చిన్న విషయం అనిపించినా, మోసాలకు గురి కాకుండా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఎప్పుడూ ఒకే బంక్ లో పెట్రోల్ పోయించుకోవడం మంచిది.

Advertisement

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటే.. వాహనంలో ఫ్యూయెల్ లెవెల్. చాలా మంది ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు పెట్రోల్ కొట్టించుకోరు. ఇది సరైన పద్ధతి కాదు. కనీసం 1/4 ట్యాంక్ ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయితే ఇంధన పంప్ వేడెక్కే ప్రమాదం ఉంటుంది, దీని వల్ల దీర్ఘకాలంలో సమస్యలు రావచ్చు. మొత్తానికి, ఉదయం లేదంటే రాత్రి చల్లని సమయాల్లో పెట్రోల్ కొట్టించుకోవడం ద్వారా కొంత ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ విధానాన్ని పాటించి ఫలితం ఎలా ఉందో గమనించండి.

Read Also: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 7 కార్లు, వీటి ప్రత్యేకత ఏంటంటే?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×