E-Paper
Advertisement

ఈ డ్యాష్ కామ్ ఉంటే.. యాక్సిడెంట్లే జరగవ్, రికార్డింగే కాదు అలర్ట్ కూడా చేస్తుంది!

ఈ డ్యాష్ కామ్ ఉంటే.. యాక్సిడెంట్లే జరగవ్, రికార్డింగే కాదు అలర్ట్ కూడా చేస్తుంది!
Advertisement

boAt Hive Dashcam F1 2026 Launched: ఎలక్ట్రానిక్ దిగ్గజం బోట్ కంపెనీ తాజాగా హైవ్ డాష్‌ క్యామ్ F1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక డ్రైవింగ్ అవసరాలకు సరిపోయే విధంగా రూపొందించబడిన స్మార్ట్ గాడ్జెట్‌ గా విడుదల అయ్యింది. ఈ డాష్‌ క్యామ్‌ లో ఫీచర్లు చూస్తే, సాధారణ రికార్డింగ్ డివైస్ మాత్రమే కాకుండా డ్రైవర్‌ కు అసిస్టెంట్ గా పని చేస్తుంది.

ఆకట్టుకుంటున్న ADAS సిస్టమ్

ఈ డివైస్‌ లో ADAS అనే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇది రోడ్డు పరిస్థితులను గమనిస్తూ, డ్రైవర్‌ కు అవసరమైన సమయంలో వాయిస్ అలర్ట్‌ లను ఇస్తుంది. లేన్ నుంచి వెహికల్ బయటకు వెళ్తే వార్నింగ్ ఇస్తుంది. ముందున్న వాహనానికి చాలా దగ్గరగా వెళ్లినప్పుడు అలర్ట్ చేస్తుంది. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండేందుకు బాగా సహాయపడుతుంది.

Advertisement

ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే, ముందుభాగంలో 4K అల్ట్రా HD క్వాలిటీతో వీడియో తీసే కెమెరా ఉండగా, వెనుక భాగంలో ఫుల్ HD కెమెరా ఉంది. దీంతో ముందూ వెనుకా జరిగే ప్రతి క్షణాన్ని క్లియర్‌ గా రికార్డ్ చేస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, సుదూర ప్రయాణాల్లో ఈ డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది. లో లైటింగ్ లో కూడా మంచి ఫుటేజ్ అందించేందుకు సోనీ స్టార్విస్ IMX335 సెన్సార్‌ ఉంటుంది. రాత్రిపూట డ్రైవ్‌ లు, టన్నెల్స్ లాంటి చీకటి ప్రదేశాల్లో కూడా వీడియో క్లారిటీ తగ్గకుండా ఉంటుంది. భద్రత పరంగా చాలా ఉపయోకరంగా ఉంటుంది.

2.4 అంగుళాల చిన్న డిస్‌ ప్లే  

ఈ డాష్‌ క్యామ్‌ లో 2.4 అంగుళాల చిన్న డిస్‌ప్లే కూడా ఉంది. దీనివల్ల మొబైల్ ఫోన్ అవసరం లేకుండానే వీడియోలను చూడవచ్చు. సెట్టింగ్‌ లను మార్చుకోవచ్చు. అంతేకాకుండా, వాయిస్ కమాండ్ సపోర్ట్ కూడా ఉండటం వల్ల డ్రైవింగ్ సమయంలో చేతులు ఉపయోగించకుండా  అలర్ట్ కావచ్చు. GPS ఫీచర్ ద్వారా వాహనం ప్రయాణించిన మార్గం, వేగం లాంటి వివరాలను రికార్డ్ చేయవచ్చు. అలాగే Wi-Fi 6 సపోర్ట్ తో రికార్డ్ చేసిన వీడియోలను చాలా వేగంగా ఫోన్‌ కు ట్రాన్స్‌ ఫర్ చేసుకోవచ్చు. ఇది ఇంటర్నెట్ లేకపోయినా పని చేయడం మరో ప్లస్ పాయింట్.

Advertisement

150 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ కారణంగా ఒకేసారి పెద్ద పరిధిని క్యాప్చర్ చేస్తుంది. ఇది ముఖ్యంగా హైవేలు, బిజీ రోడ్లలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. దేశంలోని  భిన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఈ డివైస్‌ను -20°C నుంచి 70°C వరకు పని చేసేలా రూపొందించారు. ఇందులో 512GB వరకు మెమరీ కార్డ్ సపోర్ట్ ఉండటంతో పాటు, లూప్ రికార్డింగ్ ఫీచర్ ద్వారా పాత వీడియోలు ఆటోమేటిక్‌ గా డిలీట్ అవుతూ కొత్తవి సేవ్ అవుతాయి. G-సెన్సార్ సహాయంతో ప్రమాద సమయంలో వీడియోలు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి. అంతేకాకుండా 24 గంటల పార్కింగ్ మానిటర్ కూడా అందుబాటులో ఉంది. మొత్తంగా హైవ్ డాష్‌క్యామ్ F1 స్మార్ట్, సేఫ్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించే మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: బుల్లి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్‌గా షికారు చేయడానికి భలే ఉంటుంది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×