E-Paper
Advertisement

తారక్ విశ్వరూపం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యతో శత్రుసంహారం! బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ మారణహోమం ఖాయమా?

తారక్ విశ్వరూపం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యతో శత్రుసంహారం! బాక్సాఫీస్ వద్ద ప్రశాంత్ నీల్ మారణహోమం ఖాయమా?
Advertisement

Jr NTR Dragon movie: ప్రశాంత్ నీల్ .. ఇండియన్ సినిమా పై kgf సిరీస్, సలార్ అంటూ తనవైన సినిమాలతో సరికొత్త సంతకం చేసిన ఈ కమర్షియల్ ఫిలిమ్ మేకర్ తారక్ తో సినిమా ఫిక్స్ అనగానే మురిసిపోయింది బాక్సాఫీస్. ఇక మా హీరో ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమా పక్కా అని కాలర్ ఎగరేశారు నందమూరి ఫ్యాన్స్. ఇక RRR తర్వాత వచ్చిన వార్ 2 సినిమా డిసప్పాయింట్ చేయడంతో డ్రాగన్ పై ఆశలన్నీ పెట్టుకున్న పరిస్థితి.

ఒక పవర్‌ఫుల్ వారియర్‌లా కనిపించబోతున్న తారక్

Advertisement

అయితే ఆ మధ్య సినిమా ఆగిందని, నీల్ టేకింగ్ నచ్చక తారక్ సినిమాని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేశాడని ఇలా సినిమాపై ఇబ్బడి ముబ్బడిగా రూమర్స్ వచ్చాయ్ కూడా. ఏది ఏమైనా గత కొంతకాలంగా సినిమా జోరుగా షూట్ జరుపుకుంటుండటంతో సినిమా నుండి క్రేజీ అప్ డేట్ వచ్చేది ఎప్పుడా అంటూ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారంతా.ఈ క్రమంలో సినిమా నుండి వచ్చిన తాజా అప్ డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అవును..ఈ సినిమా కోసం తారక్ దాదాపు 15 కిలోల బరువు తగ్గి తన లుక్ ని మార్చేసి మునుపెన్నడూ చూడని విధంగా చాలా స్లిమ్‌గా, షార్ప్‌గా కనిపిస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన కొత్త లుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు.మొత్తానికి ఒక రగ్గడ్ లుక్, థిక్ బియర్డ్ (గడ్డం) తో తారక్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ వారియర్‌లా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

3000 ఏళ్ల చరిత్ర కలిగిన ‘కలరిపయట్టు’లో కఠినమైన శిక్షణ

Advertisement

ఇక ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో యాక్షన్ సీన్లను ఎంత ‘రా అండ్ రస్టిక్’గా చూపిస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఈసారి డ్రాగన్ లో అంతకు మించిన ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్స్ ని నీల్ ప్లాన్ చేశాడట. అందులో భాగంగా కేరళకు చెందిన 3000 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత ప్రాచీన యుద్ధ కళ ‘కలరిపయట్టు’ లో తారక్ ప్రస్తుతం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది .ఇందులో కర్రలు, కత్తులతో చేసే ఫైట్స్ కోసం ఆయన పర్ఫెక్షన్ సాధిస్తున్నారు.అయితే నీల్ సినిమాల్లో ఉండే గన్ ఫైట్స్ లాంటివి
కాకుండా, ఇందులో ఒంటి చేత్తో చేసే విన్యాసాలు, బాడీ ఫ్లెక్సిబిలిటీ హైలైట్‌గా ఉండబోతున్నాయని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఆఫ్రికాలోని లొకేషన్లను ఫైనలైజ్

ఇక డ్రాగన్ కోసం నీల్ ఏకంగా ఒక భారీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడట. ఇప్పటికే జోర్డాన్‌లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల షూటింగ్ కంప్లీట్ చేసిన నీల్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం
ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లను ఫైనలైజ్ చేశారని తెలుస్తుంది .ఇక సినిమా టోన్ విషయానికి వస్తే ఇప్పటివరకు నీల్ సినిమాలంటే ‘డార్క్ థీమ్’ (నలుపు, బూడిద రంగులు) మాతమే అన్న స్టాంప్ ఉండేది. అందుకు భిన్నంగా ‘డ్రాగన్’లో తన రూట్ మార్చి, చాలా కలర్‌ఫుల్ అండ్ వైబ్రెంట్ విజువల్స్ చూపించబోతుండటం విశేషం.

బాలీవుడ్ క్రేజీ స్టార్ గోవిందా ఇందులో తారక్‌కు మెంటర్‌గా

ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమాలో క్యాస్టింగ్ మరొక ఎత్తు. ఇప్పటికే సినిమాలో హీరోయిన్ గా సప్త సాగరాలు దాటితో యూత్ ఫేవరెట్ అయిన రుక్మిణి వసంత్ ఎంట్రీ ఇవ్వగా బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపిస్తుండటం విశేషం. వీళ్ళే కాకుండా బాలీవుడ్ క్రేజీ స్టార్ గోవిందా ఇందులో తారక్‌కు మెంటర్‌గా లేదా ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం.

సినిమా ఈజీగా 2000 కోట్ల క్లబ్‌లోకి ఖాయం

అయితే మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని మొదట జూన్ 2026లో అనుకున్నా లేటెస్ట్ ట్రెండ్ చూస్తుంటే సినిమా రిలీజ్ మరింత ముందుకు పోయేలా కనిపిస్తుంది. చూడాలి త్వరలో అయినా రిలీజ్ డేట్ పై సాలిడ్ అప్ డేట్ వదులుతారేమో.ఏది ఏమైనా యాక్షన్ కి కేరాఫ్ అయిన తారక్, కింగ్ ఆఫ్ కమర్షియల్ అయిన నీల్ కలిస్తే సినిమా ఈజీగా 2000 కోట్ల క్లబ్‌లోకి ఖాయం. చూడాలి మరి అంచనాలు స్కై లెవెల్ లో పెట్టేస్తున్న సినిమా ఎన్ని రికార్డులని రీ రైట్ చేస్తుందో !

also read:బాక్సాఫీస్ దగ్గర ‘బైకర్’ పంక్చర్.. ‘రాకాస’ అరాచకం! శర్వా, సంగీత్ కష్టాలు మామూలుగా లేవుగా!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×