E-Paper
Advertisement

Bugatti Hyper RV: లగ్జరీ హోమ్ ఆన్ వీల్స్.. బుగట్టి హైపర్ RV లోపల చూస్తే పరేషాన్ కావాల్సిందే భయ్యా!

Bugatti Hyper RV: లగ్జరీ హోమ్ ఆన్ వీల్స్.. బుగట్టి హైపర్ RV లోపల చూస్తే పరేషాన్ కావాల్సిందే భయ్యా!
Advertisement

Bugatti Hyper RV 2026 Launch: లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బుగట్టి సరికొత్త మోటార్ హోమ్ ను లాంచ్ చేసింది. హైపర్ RV 2026ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైపర్‌ కార్ పని తీరును ఎలైట్ మోటార్‌ హోమ్ సౌకర్యంతో మిక్స్ చేసి, ద్వారా లగ్జరీ ప్రయాణాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించింది. హైపర్ RV, పూర్తిగా కొత్త విభాగంలో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. బుగట్టి తన ఇంజనీరింగ్కు దర్పం పట్టేలా దీనిని తయారు చేసింది.

ఫ్యూచరిస్టిక్, ఏరోడైనమిక్ ఎక్స్ టీరియర్ డిజైన్   

బుగట్టి హైపర్ RV 2026 ఎక్స్ టీరియర్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. హైపర్‌ కార్ల నుంచి ఇన్ స్పైర్ అయి రూపొందించింది. బ్యూటీఫుల్ లుక్,  ఏరోడైనమిక్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. అద్భుతంగా చెకబడిన బాడీ ప్యానెల్‌లు, సిగ్నేచర్ లైటింగ్ ఎలిమెంట్స్, ప్రీమియం ఫినిషింగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సాంప్రదాయ RV కంటే కదిలే లగ్జరీ హోమ్ గా కనిపిస్తుంది.

అల్ట్రా-లగ్జరీ ఇంటీరియర్ లివింగ్ ఎక్స్‌ పీరియన్స్

Advertisement

ఈ వెహికిల్ లోపల, బుగట్టి హైపర్ RV 2026 అత్యుత్తమ మెటీరియెట్స్ తో తయారు చేయబడింది. ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, బెస్పోక్ ఫినిషింగ్స్, సొగసైన డిజైన్ ఇంటీరియర్ ఇట్టే ఆకట్టుకుంటుంది. విశాలమైన లాంజ్ ఏరియాలు, ప్రైవేట్ స్లీపింగ్ క్వార్టర్ట్స్, చక్కటి డైనింగ్ సెటప్ ఒరిజినల్ ఫైవ్ స్టార్ హోటల్ లగ్జరీ అనుభవాన్ని అందిస్తాయి.

అధునాతన సాంకేతికత, స్మార్ట్ కంట్రోల్స్

హైపర్ RV కన్వినియన్స్, కంఫర్ట్ అందించేలా అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడింది. స్మార్ట్ కంట్రోల్ సిస్టమ్స్ లైటింగ్, క్లైమేట్, ఎంటర్ టైన్ మెంట్, ఆన్‌ బోర్డ్ ఫంక్షన్స్ చక్కగా కంట్రోల్ చేస్తాయి. పెద్ద డిజిటల్ డిస్‌ ప్లేలు, నేచురల్ ఇంటర్‌ ఫేస్‌లు క్యాబిన్ అంతటా ఈజీ నియంత్రణను అందిస్తుంది.

ఎలైట్ ట్రావెల్ కోసం ప్రత్యేక సౌకర్యాలు

Advertisement

ఎలైట్ ప్రయాణికుల కోసం తయారు చేసిన బుగట్టి హైపర్ RV 2026లో లగ్జరీ కిచెన్, హై ఎండ్ బాత్రూమ్ సౌకర్యాలు, విశాలమైన స్టోరేజ్ ప్లేజ్, అధునాతన క్లైమేట్ కంట్రోల్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి. మంచి సౌండ్ ఇన్సులేషన్, యాంబియంట్ లైటింగ్ ఎక్కువ సేపు ఉండటానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి.

Read Also:  హ్యుందాయ్ ఫస్ట్, టాటా నెక్ట్స్.. వామ్మో.. ఒక్క నెలలో ఇన్ని కార్లు అమ్మాయా?

సేఫ్టీ, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్

హైపర్ RV 2026 సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. సురక్షితమైన డ్రైవింగ్‌ కోసం అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీని ఉపయోగించారు. స్టెబిలిటీ సిస్టమ్స్, బ్రేకింగ్ సపోర్ట్, మెరుగైన విజిబిలిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ వెహికిల్ లగ్జరీ మొబిలిటీలో కొత్త బెంచ్‌ మార్క్ ను సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే మాస్ అప్పీల్ కోసం కాకుండా, లగ్జరీ ప్రయాణం కోరుకునే వనియోగదారులే లక్ష్యంగా లైఫ్ స్టైల్, ఇన్నోవేషన్,ప్రెస్టేజ్ న సూచించేలా రూపొందించడబడింది. మొత్తంగా బుగట్టి హైపర్ RV 2026 అల్ట్రా లగ్జరీ మోటార్‌ హోమ్ డిజైన్‌ లో కొత్త బెంచ్‌మార్క్‌ ను సెట్ చేస్తుంది.

Read Also:  బీఎండబ్ల్యూ లవర్స్‌కు క్రేజీ న్యూస్, కొత్త లోగో వచ్చేస్తోంది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×