E-Paper
Advertisement

TATA Hyundai Sales: హ్యుందాయ్ ఫస్ట్, టాటా నెక్ట్స్.. వామ్మో.. ఒక్క నెలలో ఇన్ని కార్లు అమ్మాయా?

TATA Hyundai Sales: హ్యుందాయ్ ఫస్ట్, టాటా నెక్ట్స్.. వామ్మో.. ఒక్క నెలలో ఇన్ని కార్లు అమ్మాయా?
Advertisement

Auto Sales Jan 2026:  జనవరిలో కార్ల తయారీ కంపెనీలు సేల్స్ లో దుమ్మురేపాయి. టాటా, మహీంద్రా, హ్యుందాయ్ సేల్స్ లో దూసుకెళ్లాయి. హ్యుందాయ్ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా, టాటా మోటార్స్ 2వ స్థానంలో నిలిచింది. నెక్సాన్, పంచ్ అమ్మకాలు జోరందుకోవడంతో టాటా జనవరి 2026లో 70,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో సత్తా చాటింది. మహీంద్రా 63,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో మూడవ స్థానంలో నిలిచింది.

ఏ సంస్థ ఎన్ని కార్లు అమ్మిందంటే?

⦿ టాటా మోటార్స్: జనవరి 2026లో దేశీయంగా 70,222 యూనిట్లను అమ్మింది.  దేశీయ మార్కెట్లో గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే జనవరి 2026లో 46 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది. ఈ నెలలో దేశీయ అమ్మకాలు 70,222 యూనిట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే నెలలో 48,076 యూనిట్లు, డిసెంబర్ 2025లో 50,046 యూనిట్లను అమ్మింది.

Advertisement

⦿మహీంద్రా & మహీంద్రా: ఈ సంస్థ జనవరి 2026లో 63,510 దేశీయ అమ్మకాలు సాధించింది.  జనవరి 2025తో పోలిస్తే 25 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. ఈ నెలలో దేశీయ అమ్మకాలు 63,510 యూనిట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం 50,659 యూనిట్లు, డిసెంబర్ 2025లో 50,946 యూనిట్లు అమ్ముడయ్యాయి. మహీంద్రా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి 19 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.

⦿ హ్యుందాయ్:  హ్యుందాయ్ ఇండియా 2026లో అత్యధిక అమ్మకాలను కనబరిచింది. భారతీయ మార్కెట్లో 59,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఇది జనవరి 2025 కంటే 9.5 శాతం ఎక్కువ. డిసెంబర్ 2025 కంటే 39 శాతం ఎక్కువ. జనవరి 2026లో మొత్తం అమ్మకాలు 73,137 యూనిట్లుగా నమోదయ్యాయి. వీటిలో ఎగుమతులు 14,030 యూనిట్లుగా ఉన్నాయి.  ఈ నెలలో వెన్యూ సబ్‌ కాంపాక్ట్ SUV, ఆరా సబ్‌కాంపాక్ట్ సెడాన్‌ల కోసం హ్యుందాయ్ అత్యుత్తమ అమ్మకాలను కనబరిచింది.

Advertisement

⦿ టయోటా:  జనవరి 2026లో టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయ అమ్మకాలు 30,630 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2025లో అమ్ముడైన 26,178 యూనిట్లతో పోల్చితే 17 శాతం పెరిగాయి. ఎగుమతులు 3,250 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా 2 శాతం లాభం పొందింది.

⦿ కియా: కియా ఇండియా జనవరి 2026లో మొత్తం అమ్మకాలు 27,603 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2025తో పోలిస్తే 10.3 శాతం వృద్ధి సాధించింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ SUV, కారెన్స్ క్లావిస్, క్లావిస్ EV MPVల వంటి మోడళ్లకు మంచి డిమాండ్ రావడంతో ఈ అమ్మకాలు సాధించింది.

⦿ JSW MG మోటార్: JSW MG మోటార్ ఇండియా 2026ను మంచి అమ్మకాలతో ప్రారంభించింది.  ఇది సంవత్సరానికి 9 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. దేశీయ హోల్‌ సేల్ అమ్మకాలు 4,843 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే,  డిసెంబర్ 2025లో అమ్ముడైన 6,500 యూనిట్లతో పోల్చితే తగ్గింది.

Read Also: టాప్ లేపిన టాటా నెక్సాన్, కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డులు!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×