E-Paper
Advertisement

Second Hand Bike Check List: సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఈ చెక్ లిస్ట్ ఫాలో అవ్వండి

Second Hand Bike Check List: సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?.. ఈ చెక్ లిస్ట్ ఫాలో అవ్వండి
Advertisement

Second Hand Bike Check List: తక్కువ బడ్జెట్ లో బైక్ కొనాలనుకుంటే.. సెకండ్ హ్యాండ్ బేక్ బెటర్ ఆప్షన్. బైక్ కొనే ముందు ఏ అవసరానికి కొంటున్నారో నిర్ణయించుకోండి. రోజువారీ ప్రయాణాల కోసమా, దూర ప్రయాణాల కోసమా, లేదా ఆఫ్ రోడ్ కోసమా అనేది డిసైడ్ అవ్వండి. మీ అవసరాలకు సూట్ అయ్యే బైక్ కోసం ఆన్‌లైన్ రివ్యూస్ పరిశీలించండి. మోడళ్లు, వాటి ధరలను పోల్చి చూడండి.

ఇవి చెక్ చేయండి?

సెకండ్ హ్యాండ్ బైక్‌ తీసుకునే ముందు..దానిపై గీతలు, లీకేజీలు, టైర్ అరుగుదల చెక్ చేయండి. అక్కడక్కడ చిన్న గీతలు ఉంటే పర్వాలేదు, కానీ డ్యామేజ్ ఎక్కువగా ఉంటే కాస్త ఆలోచించాల్సిందే. చాలా పాత బైక్‌లకు డ్రమ్ బ్రేకులు ఉంటాయి కాబట్టి, బ్రేకులను చెక్ చేయండి. వాటిని సర్వీసింగ్ లేదా ఛేంజ్ చేయాలో? చూడండి. అలాగే, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, టెయిల్‌లైట్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయండి.

Advertisement

బైక్‌ను ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ చేయించారో తెలుసుకోవడానికి సర్వీస్ రికార్డును అడిగి తీసుకోండి. బైక్ పత్రాలు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో? లేదో? తనిఖీ చేయండి. ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఒరిజినల్ ఇన్‌వాయిస్, వారంటీ ఇలా ముఖ్యమైన పత్రాలను చెక్ చేయండి. స్పీడ్, మైలేజీ, కంఫర్ట్ ను చెక్ చేయడానికి టెస్ట్ రైడ్ కు వెళ్లండి. వీలైతే, మీకు తెలిసిన మెకానిక్‌కు ఒకసారి బైక్ ను చూపించండి.

ఓనర్ షిప్ బదిలీ ఎలా?

సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేస్తే.. ఓనర్ షిప్ ను మీ పేరుపై ట్రాన్స్ ఫర్ చేయించుకోవాలి. అందుకు ఆర్టీఓలో దరఖాస్తు చేసుకోవాలి. బైక్ ఫస్ట్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారో? ఆ ఆర్టీఓలో బైక్ ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ కోసం అప్లై చేయాలి. రవాణా శాఖ అధికారులు అడిగిన పత్రాలను అందించండి. రిజిస్ట్రేషన్ అధికారులు అన్ని తనిఖీ చేసి 14 రోజుల్లో బైక్ ఓనర్ షిప్ ను అధికారికంగా మీ పేరిట ట్రాన్స్ ఫర్ చేస్తారు.

అవసరమయ్యే డాక్యుమెంట్స్

Advertisement

ఫారం 29, ఫారం 30, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పాలసీ, PUC సర్టిఫికేట్, పన్ను రసీదు, అడ్రస్ ఫ్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ కోసం ఆర్టీవోలో సబ్మిట్ చేయాలి.

Also Read:  రివోల్ట్ To ఓలా రోడ్‌ స్టర్.. బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!

ఇన్సూరెన్స్‌ను ట్రాన్స్ ఫర్

బైక్ ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ అయిన 15 రోజులలోపు ఇన్సూరెన్స్ సంస్థకు అప్లై చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే బీమా సంస్థ వాటిని వెరిఫై చేసి కొత్త యజమాని పేరుతో పాలసీని అప్డేట్ చేస్తుంది.

 

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×