E-Paper
Advertisement

Adhire Abhi: ఫస్ట్ సినిమా యముడిపై.. రెండో సినిమా అమ్మవారిపై.. వివరాలివే!

Adhire Abhi: ఫస్ట్ సినిమా యముడిపై.. రెండో సినిమా అమ్మవారిపై.. వివరాలివే!
Advertisement

Adhire Abhi: అదిరే అభి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. కమెడియన్‌గా బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా పేరొందిన అభి (Adhire Abhi), నటుడిగానూ వెండితెరపై మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నుంచి ఇప్పటికే ‘చిరంజీవా’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ వివరాల్లోకి వెళితే.. సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ చిత్రం ‘కామాఖ్య’ (Kaamakhya). మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోగా, శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ (Kaamakhya Teaser)ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Ram Charan: బాబాయ్ సినిమా వదిలేసి, బాలీవుడ్ సినిమాపై ప్రశంసలు.. ఇదేం బాలేదు చరణ్!

Advertisement

‘కామాఖ్య’ అమ్మవారి నేపథ్యంలో

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ‘కామాఖ్య’ నేను దర్శకత్వం వహించిన రెండో సినిమా. మొదటి చిత్రం ‘చిరంజీవా’. ఆ చిత్రంలో యమధర్మరాజుకి ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పడం జరిగింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ‘కామాఖ్య’ అమ్మవారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఒక ఉత్కంఠభరితంగా ప్రజెంట్ చేస్తూ.. మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సముద్రఖని, అభిరామి, సమైరా.. ఇలా అద్భుతమైన నటీనటులందరూ కూడా వాళ్ల కోసమే ఈ పాత్రలు సృష్టించామా అన్నంత సహజంగా వారి వారి పాత్రల్లో నటించారు. నా స్నేహితుడు రిశాంక్ అలాగే ‘బాహుబలి’కి పనిచేస్తున్నప్పుడు సెంథిల్ దగ్గర పరిచయమైన రమేష్.. మేము ముగ్గురం కలిసి ఈ కథను రెడీ చేసుకున్నాం.

Advertisement

Also Read- Psychological Thriller OTT: కోటీశ్వరుడి మాయలో అందాల పనిమనిషి… ఉక్కిరి బిక్కిరి చేసే భార్య బాగోతం… సిడ్నీ స్వీనీ హిట్ మూవీ తెలుగులో

‘దృశ్యం’ సినిమా తరహాలో

అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని తీయగలిగినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకు మా టీమ్ అంతా ఎంతగానో సపోర్ట్ చేసింది. టీజర్ అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆసక్తిని ముందు ముందు వచ్చే కంటెంట్‌లో కూడా కొనసాగిస్తాము. ‘దృశ్యం’ సినిమా తరహాలో ఉండే మంచి థ్రిల్లర్ చిత్రమిది. త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. ఒక నటుడిగా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.. అలాగే ఇప్పుడు దర్శకుడిగా కూడా ఆశీర్వదించి, సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా, అందరూ చెప్పినట్టే ఉంటుంది కానీ.. ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుందని మాత్రం చెప్పగలను..’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Divi Vadthya: పుష్ప 2 విషయంలో చెప్పిందొక్కటి.. చేసిందొక్కటి.. మొత్తం లేపేశారన్న దివి !

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×