E-Paper
Advertisement

Budget Electric Bikes: రివోల్ట్ To ఓలా రోడ్‌ స్టర్.. బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!

Budget Electric Bikes: రివోల్ట్ To ఓలా రోడ్‌ స్టర్.. బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!
Advertisement

Top 5 Budget Electric Bikes: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి.  తక్కువ ధరలో మంచి రేంజ్ అందించే మోటార్ సైకిల్స్ విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధరకే మంచి పనితీరును, శ్రేణిని అందించే అనేక కమ్యూటర్ ఫ్రెండ్లీ మోటార్‌ సైకిళ్లను అందిస్తుంది. ఈ బైక్‌లు తక్కువ రన్నింగ్ ఖర్చులు, స్మార్ట్ ఫీచర్లతో పెట్రో బైక్స్ కు ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి.

1.5 లక్షల లోపు 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్‌లు

  

⦿ రివోల్ట్ RV400: ధర రూ.1.40- రూ.1.43 లక్షలు

ఈ ఎలక్ట్రిక్ బైక్ పట్టణ ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. ఒకే ఛార్జ్‌ కి 150 కి.మీ పరిధిని అందిస్తుంది. 85 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, రైడింగ్ ను మానిటర్ చేసేందుకు AIతో కూడిన ఫీచర్లు ఉంటాయి.

⦿ ఓలా రోడ్‌ స్టర్: ధర రూ.1.05- రూ.1.40 లక్షలు

Advertisement

ఈ ఎలక్ట్రిక్ బైక్ పలు బ్యాటరీ ప్యాక్స్ లో అందుబాటులో ఉంటుంది. ప్రీమియం స్టైల్ ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ గా గుర్తింపు తెచ్చుకుంది. హై ఎండ్ రేంజ్ బైక్స్ 248 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. గరిష్ట వేగం 126 కి.మీ వరకు ఇస్తుంది. ఇది విస్తృతమైన స్మార్ట్ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది.

⦿ ఒబెన్ రోర్, ఒబెన్ రోర్ EZ: ధర రూ.1.16- రూ.1.50 లక్షలు

ఈ నేకెడ్ బైక్ ఒకే ఛార్జ్ తో 187 కిలో మీటర్ల రేంజ్ ను అందిస్తుంది. గంటకు 100 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. 2 గంట్లోనే పూర్తి ఛార్జింగ్, మంచి బిల్డ్ క్వాలిటీ కారణంగా బాగా పాపులర్ అయ్యింది.

⦿ కోమాకి రేంజర్: ధర రూ.1.30 లక్షలు

Advertisement

ఈ బైక్ ఒకే ఛార్జ్ తో 160 కి.మీ నుంచి 250 కి.మీ వరకు రేంజ్ ను అందిస్తుంది. ఈ క్రూయిజర్ స్టైల్ ఎలక్ట్రిక్ బైక్, 3 గంటల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గంటకు 80 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది.

Read Also: టాటా అదిరిపోయే డిస్కౌంట్స్.. ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా 3.8 లక్షల తగ్గింపు!

⦿ రివోట్ RV BlazeX: ధర రూ. 1.20 లక్షలు

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది రివోల్ట్ లో ఎంట్రీ లెవల్ వేరియంట్, ఒకే ఛార్జ్ తో 150 కి.మీ పరిధిని అందిస్తుంది. గంటకు 85 కి.మీ గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. మంచి ఫీచర్లు, ఫర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుంది.

ఇక బడ్జెట్ ధరలో ఇతర ఎలక్ట్రిక్స్ బైక్స్ ను చూస్తే, ప్యూర్ EV ఎకోడ్రైఫ్ట్ (రూ.1.19 లక్షలు), హాప్ ఆక్సో (రూ.1.28 లక్షలు), వన్ ఎలక్ట్రిక్ క్రిడ్న్ (రూ.1.35 లక్షలు) కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also: టీవీఎస్ ఆర్బిటర్ కొత్త వేరియంట్లు, ఒక్కోదాని రేంజ్ ఎంతో తెలుసా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×