Royal Enfield Classic 650 Buying: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350. భారత్ లో మంచి ప్రజాదరణ పొందిన బైక్. ఈ బ్రాండ్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్స్ ఒకటి. మంచి ప్రజాదరణ కారణంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ పేరుతో 650 cc ఇంజిన్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ఆధునిక రెట్రో మోటార్ సైకిల్‌గా పరిచయం అయ్యింది. ఇది క్లాసిక్ 350 ఐకానిక్ స్టైలింగ్ ను కలిగి ఉండి, పవర్ ఫుల్ 650 cc ప్యారలల్ ట్విన్ ప్లాట్ ఫామ్‌పై నిర్మించబడింది.
చిన్న క్లాసిక్ శ్రేణికి మరింత శక్తివంతమైన, ప్రీమియం ప్రత్యామ్నాయంగా నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650, ఇంటర్ సెప్టర్ 650, షాట్ గన్ 650 బైక్స్ లోని అదే ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది మరింత సౌకర్యవంతమైన క్రూజింగ్ పై దృష్టి పెట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ధర అనేది, కలర్ వేరియంట్లను బట్టి రూ. 364,856 నుంచి రూ. 379,252 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ లో 648 సిసి, ఎయిర్/ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 47 bhp పవర్, 52.3 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 650ను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు చేతిలో డబ్బులు లేకపోయినా ఇంటికి తెచ్చుకోవచ్చు. నెలవారీ EMI చొప్పున కొనుగోలు చెయ్యొచ్చు. అయితే, ఈ బైక్ ధర ఎంత ఉంటుంది? నెలకు ఎంత చెల్లించాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మోడల్ హైఎండ్ ధర రూ. 379,252 (ఎక్స్-షోరూమ్). లోన్‌ను ఎక్స్ షోరూమ్ ధరలో 100%గా పరిగణించగా, వడ్డీ రేటు 9.5% ఉంటుంది. EMIచెల్లించే కాలపరిమితి 12 నెలలు, 24 నెలలు, 36 నెలలుగా ఉంటాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650కి 12 నెలల EMI పెట్టుకుంటే, నెలకు రూ. 33,254 చెల్లించాల్సి ఉంటుంది. అదే, 24 నెలల పీరియడ్ తీసుకుంటే, నెలకు 17,413 చెల్లించాల్సి ఉంటుంది. అదే 36 నెలల సమయం పెట్టుకుంటే, నెలకు రూ. 12,149కి తగ్గుతుంది. సో, మీక్కూడా ఈ క్రేజీ బైక్ కొనుగోలు చేయాలంటే, సింఫుల్ గా EMI ఆప్షన్ ను ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకొవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే రాయల్ ఎన్‌ఫీల్డ్ షో రూమ్ కు వెళ్లిండి. మీ డ్రీమ్ బైక్ EMIలో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చేసుకోండి.
Read Also: 6 ఏళ్లలో 7 కొత్త SUVలు, మారుతి సుజుకి ప్లాన్ మామూలుగా లేదుగా!