E-Paper
Advertisement

Upcoming Maruti SUVs: 6 ఏళ్లలో 7 కొత్త SUVలు, మారుతి సుజుకి ప్లాన్ మామూలుగా లేదుగా!

Upcoming Maruti SUVs: 6  ఏళ్లలో 7 కొత్త SUVలు, మారుతి సుజుకి ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

7 New Maruti Suzuki SUVs Coming By 2032: భారత్ లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కొనసాగుతోంది మారుతి సుజుకి. పలు సెగ్మెంట్లో బోలెడు మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో SUV మెయిన్ రోల్ ప్లే చేస్తోంది. ఈ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని.. మారుతి సుజుకి రాబోయే 6 సంవత్సరాలలో మార్కెట్లోకి ఏకంగా 7 కొత్త SUVలను విడుదల చేయాలని భావిస్తోంది.

భారత్ లో ప్రస్తుతం 19 కారు మోడళ్లు

మారుతి సుజుకి ప్రస్తుతం భారత మార్కెట్లో పలు విభాగాలలో 19 కార్ మోడళ్లను అందిస్తోంది. వీటిలో మారుతి ఆల్టో కె10 నుంచి మొదలుకొని మారుతి ఇన్విక్టో వరకు ఉన్నాయి. అదే సమయంలో SUV విభాగాన్ని విస్తరించడం ద్వారా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తాజా డేటా ప్రకారం, భారత మార్కెట్లో SUVల వాటా 2019లో 26.5% ఉండగా, 2024 నాటికి 54.7%కి పెరిగింది. ప్రస్తుతం, మారుతి లైనప్‌ లో బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీ, విక్టోరిస్‌ ను SUV విభాగంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వచ్చే 6 ఏళ్లలో మారుతి విడుదల చేయబోయే SUV మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

⦿ ఫ్రాంక్స్ హైబ్రిడ్

Advertisement

కంపెనీ రానున్నమోడళ్లలో అందించబోయే సరసమైన హైబ్రిడ్ టెక్నాలజీపై పని చేస్తున్నట్లు మారుతి సుజుకి గత ఏడాది వెల్లడించింది. మారుతి లైనప్‌ లో ఈ టెక్నాలజీని పొందిన మొదటి మోడల్ ఫ్రాంక్స్ కానుంది. ఇదో సిరీస్ హైబ్రిడ్. మారుతి మోడళ్లలో లభించే సాధారణ స్ట్రాంగ్ హైబ్రిడ్‌కు భిన్నంగా ఉంటుంది.  ఈ సిరీస్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కోసం మారుతి సుజుకి 1.2-లీటర్ Z12E త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించనుంది. ఈ సిస్టమ్‌లో ఇంజిన్ ఒక జనరేటర్‌గా పనిచేస్తూ బ్యాటరీని నిరంతరం రీఛార్జ్ చేస్తుంది. ఫ్రాంక్స్‌ కు సరికొత్త రూపాన్ని ఇవ్వడానికి మారుతి కొన్ని చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులు చేసే అవకాశం ఉంది.

⦿ గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి 2022లో గ్రాండ్ విటారాను మార్కెట్లో విడుదల చేసింది. ఈ SVU మార్కెట్లో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ కారుకు సంబంధించి మారుతి  అప్‌ డేట్‌ ను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ SVUలో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేకుండా, చిన్నపాటి కాస్మెటిక్ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.

⦿ బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

Advertisement

మారుతి సుజుకి కొంతకాలంగా బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్‌ ను టెస్ట్ చేస్తోంది. టెస్ట్ మ్యూల్స్ ఇప్పటికే చాలాసార్లు కనిపించాయి. బ్రెజ్జాకు బయట చిన్నపాటి అప్‌ డేట్‌ లు రానున్నాయి.  ప్రస్తుత ఇంజన్‌ తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ ను జత చేసే అవకాశం ఉంది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.

⦿ Y43

4 మీటర్ల లోపు SUV సెగ్మెంట్ ప్రజాదరణ వస్తున్న నేపథ్యంలో మైక్రో SUV సెగ్మెంట్ కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. మారుతి Y43 అనే కోడ్‌ నేమ్‌ తో ఒక మైక్రో SUVపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మారుతి ఎంట్రీ-లెవల్ SUV అవుతుంది. టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ తో పోటీపడనుంది.

⦿ YK9

మారుతి భారత మార్కెట్‌లోకి తీసుకురానున్న మరో చిన్న SUV ఇది. ఇది అంతర్జాతీయంగా అమ్ముడవుతున్న సుజుకి హస్లర్ ఆధారంగా తయారు చేసే అవకాశం ఉంది.

⦿ మరో రెండు SUVలు

పైన చెప్పిన SUVలతో పాటు మరో రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని మారుతి సుజుకి భావిస్తుంది. వాటిలో ఒకటి 7-సీటర్. ఇది మహీంద్రా ఎక్స్‌ యూవీ 7ఎక్స్‌ ఓ లాంటి కార్లతో పోటీ పడుతుంది. మారుతి విక్టోరిస్ SUV  సీబీజీ కంప్రెస్డ్ బయో గ్యాస్) వెర్షన్‌ ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

Read Also: మారుతి నుంచి చౌకైన SUV.. జస్ట్ రూ.5.50 లక్షలకే కొత్త మోడల్!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×