E-Paper
Advertisement

1200 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఫీచర్లు.. BYD హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయ్!

1200 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఫీచర్లు.. BYD హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Upcoming BYD PHEV SUVs: చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ BYD భారత మార్కెట్లో ఇప్పటికే తన ఎలక్ట్రిక్ కార్లతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ఇండియన్ మార్కెట్ లోకి హైబ్రిడ్ కార్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ లో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు  తెలుస్తోంది.

ఇప్పటికే భారతీయ రోడ్లపై టెస్టింగ్

ప్రస్తుతం BYD భారతీయ రోడ్లపై సీలయన్ 6 PHEVను టెస్టింగ్ చేస్తోంది. దానితో పాటు లియోపార్డ్ 8 అనే పెద్ద SUV పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ రెండు కార్లు టెక్నాలజీ, పవర్, ఫీచర్ల పరంగా ప్రీమియం సెగ్మెంట్‌ ను టార్గెట్ చేస్తున్నాయి.

BYD సీలయన్ 6 PHEV గురించి..

Advertisement

సీలయన్ 6 PHEV భారత మార్కెట్లోకి రానున్న BYD తొలి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVగా నిలవనుంది. కొన్ని దేశాల్లో దీనిని సీల్ U, సాంగ్ ప్లస్ DM-i పేర్లతో అమ్ముతున్నారు. ఈ SUVలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. BYD డెవలప్ చేసిన సూపర్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. ఈ SUVలో 18.3kWh బ్యాటరీ ప్యాక్ ఇవ్వనున్నారు. ఎలక్ట్రిక్ మోటార్ 300Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 217 PS కంటే ఎక్కువ పవర్‌ ను అందిస్తుంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌ లో సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

అత్యాధునిక ఫీచర్లతో వచ్చే AWD వేరియంట్‌ లో మరింత పవర్‌ ఫుల్ సెటప్ ఉంటుంది. ఇందులో 323 PS వరకు పవర్ లభిస్తుంది. పూర్తిగా బ్యాటరీ, ఫుల్ ట్యాంక్‌ తో కలిపి ఈ SUV 1000 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో పెద్ద 15.6 అంగుళాల రొటేటింగ్ టచ్‌ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, ప్రీమియం సౌండ్ సిస్టమ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.

ప్రీమియం ఆఫ్ రోడ్ SUVగా BYD లియోపార్ట్ 8

Advertisement

ఇక BYD లెపర్డ్ 8 పూర్తిగా ప్రీమియం ఆఫ్ రోడ్ SUVగా రానుంది. దీని డిజైన్, సైజు చూస్తే ల్యాండ్ రోవర్ డిఫెండర్ లాంటి కార్లకు పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ SUV 6 సీటర్, 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.  6-సీటర్ వెర్షన్‌ లో కెప్టెన్ సీట్లు కూడా ఉంటాయి. క్యాబిన్‌ లో మూడు భారీ స్క్రీన్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. డ్రైవర్ డిస్‌ ప్లే, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, ముందు ప్రయాణికుడి కోసం ప్రత్యేక ఎంటర్‌ టైన్‌ మెంట్ స్క్రీన్ ఇవ్వనున్నారు.

లియోపార్డ్ 8లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు డ్యూయల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఈ SUV మొత్తం 748hp పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.8 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌ లో సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఫుల్ ట్యాంక్‌తో కలిపి మొత్తం 1200 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉంది.

Read Also: టాటా ఆల్ట్రోజ్ To హోండా అమేజ్.. గుంతల రోడ్లపైనా సూపర్ కంఫర్ట్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×