E-Paper
Advertisement

స్మార్ట్‌ఫోన్ హ్యాంగింగ్ ప్రాబ్లమ్‌కు శాశ్వత పరిష్కారం.. నిమిషాల్లో ఫోన్ సూపర్ ఫాస్ట్!

స్మార్ట్‌ఫోన్ హ్యాంగింగ్ ప్రాబ్లమ్‌కు శాశ్వత పరిష్కారం.. నిమిషాల్లో ఫోన్ సూపర్ ఫాస్ట్!
Advertisement

How to stop phone hanging: కొత్తగా కొన్నప్పుడు రాకెట్‌లా దూసుకెళ్లిన స్మార్ట్‌ఫోన్.. కొద్ది రోజులు వాడగానే నత్తనడకన నడుస్తోందా? ఏదైనా అర్జెంట్ యాప్ ఓపెన్ చేద్దామంటే.. స్క్రీన్ అలానే స్ట్రక్ అయిపోయి నిమిషాల తరబడి టైమ్ తీసుకుంటోందా? ప్రస్తుతం చాలామంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం ఇది. ఫోన్ పదే పదే హ్యాంగ్ అవ్వడానికి, ల్యాగ్ అవ్వడానికి వెనక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుని, ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు.. పాత ఫోన్ కూడా కొత్త దానిలా సూపర్ ఫాస్ట్‌గా మారుతుంది. ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్మార్ట్‌ఫోన్ హ్యాంగింగ్ ప్రాబ్లమ్‌కు శాశ్వత పరిష్కారాలు:

Advertisement

1. క్యాచీ డేటాను క్లియర్ చేయండి:
మనం రోజూ ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, క్రోమ్ వంటి యాప్స్ వాడుతున్నప్పుడు.. అవి ఫోన్ మెమరీలో కొంత టెంపరరీ డేటాను సేవ్ చేసుకుంటాయి. దీన్నే ‘క్యాచీ డేటా’ అంటారు. ఇది ఎక్కువైపోయే కొద్దీ యాప్స్ ఓపెన్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది.

ఏం చేయాలి? మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘Apps’ లేదా ‘App Management’ సెలెక్ట్ చేయండి. మీరు ఎక్కువగా వాడే యాప్స్ (ఉదాహరణకు Instagram) పై క్లిక్ చేసి, ‘Storage’ ఆప్షన్‌లోకి వెళ్లి ‘Clear Cache’ క్లిక్ చేయండి. (మర్చిపోయి Clear Data నొక్కకండి, అలా క్లిక్ చేస్తే.. యాప్ మళ్లీ మొదటి నుంచి లాగిన్ అవ్వాల్సి వస్తుంది).

Advertisement

2. ర్యామ్ , స్టోరేజ్‌ని ఫ్రీ చేయండి:
ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎప్పుడైనా 80 శాతానికి పైగా నిండిపోతే ఫోన్ ఆటోమేటిక్‌గా హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్రాసెసర్‌కు ఫ్రీగా రన్ అవ్వడానికి స్పేస్ లేకపోవడమే దీనికి కారణం. ఫోన్ లో అవసరం లేని పాత వీడియోలు, ఫొటోలను డిలీట్ చేయండి లేదా గూగుల్ డ్రైవ్‌లోకి మార్చండి. అలాగే మీరు ఎప్పుడో డౌన్‌లోడ్ చేసి, ప్రస్తుతం వాడకుండా వదిలేసిన ‘Bloatware’ (అనవసరమైన యాప్స్) ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

3. ‘లైట్’ వెర్షన్ యాప్స్ వాడండి:
మీరు బడ్జెట్ ఫోన్ లేదా తక్కువ ర్యామ్ (3GB / 4GB RAM) ఉన్న ఫోన్ వాడుతుంటే.. ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఒరిజినల్ యాప్స్ వల్ల ఫోన్ స్లో అవుతుంది.

స్మార్ట్ ఐడియా: ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి యాప్స్‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో ‘Lite’ వెర్షన్స్ లభిస్తాయి (ఉదాహరణకు Facebook Lite, Instagram Lite). ఇవి చాలా తక్కువ సైజ్ ఉండి, ఫోన్ ర్యామ్‌పై అస్సలు భారం పడనీయవు. ఫలితంగా యాప్స్ చకచకా ఓపెన్ అవుతాయి.

4. సాఫ్ట్‌వేర్ , యాప్స్ అప్‌డేట్ :
చాలా మంది ఫోన్ లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నోటిఫికేషన్ వచ్చినా నిర్లక్ష్యం చేస్తారు. పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లలో ఉండే ‘బగ్స్ వల్ల కూడా ఫోన్ పదే పదే ల్యాగ్ అవుతుంటుంది.

ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోండి. అలాగే ప్లే స్టోర్‌లోకి వెళ్లి యాప్స్‌ను కూడా అప్‌డేట్ చేయడం వల్ల అవి కొత్త సాఫ్ట్‌వేర్‌కు సింక్ అయి వేగంగా పని చేస్తాయి.

Also Read: చేత్తో ఉతికినట్లే క్లీన్! తక్కువ ధరలోనే.. ఐఎఫ్బీ వాషింగ్ మెషీన్

5. యానిమేషన్ స్పీడ్ మార్చండి – క్రేజీ ట్రిక్:
ఫోన్ లో యాప్స్ ఓపెన్ అయ్యేటప్పుడు, క్లోజ్ అయ్యేటప్పుడు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. వీటిని తగ్గించడం ద్వారా ఫోన్ స్పీడ్‌ను విపరీతంగా పెంచవచ్చు.

సీక్రెట్ సెట్టింగ్: ఫోన్ సెట్టింగ్స్ > About Phone లోని ‘Build Number’ పై 7 సార్లు క్లిక్ చేస్తే ‘Developer Options’ ఆన్ అవుతుంది. ఇప్పుడు డెవలపర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి.. Window Animation Scale, Transition Animation Scale, Animator Duration Scale అనే మూడు ఆప్షన్లను 0.5x లో పెట్టండి. దీని వల్ల మీ ఫోన్ టచ్ రెస్పాన్స్, యాప్స్ ఓపెనింగ్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి మెయిన్ రీజన్ దానికి ఓవర్‌లోడ్ అవ్వడమే. వారానికి కనీసం ఒక్కసారైనా ఫోన్‌ను ‘రీస్టార్ట్’చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ అంతా క్లియర్ అయి ఫోన్ రిఫ్రెష్ అవుతుంది. పైన చెప్పుకున్న టిప్స్ అన్నీ పాటించిన తర్వాత కూడా మీ ఫోన్ స్లోగానే ఉంటే.. ఒకసారి ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని ‘Factory Reset’ చేయడం మంచిది. దీనివల్ల ఫోన్ కొన్న మొదటి రోజు ఎలా ఉందో, అంత ఫాస్ట్‌గా మారుతుంది.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×