E-Paper
Advertisement

World Longest Range EV: ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,000 కి.మీ ప్రయాణం, కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!

World Longest Range EV: ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,000 కి.మీ ప్రయాణం, కళ్లు చెదిరే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!
Advertisement

BYD’s Denza Z9 GT:  ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే కార్లు విడుదల అవుతున్నాయి. త్వరలో ఈవీ మార్కెట్ ను అబ్బుర పరిచే సరికొత్త ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వస్తుంది. ఈ కారు ఏకంగా ఒకే ఛార్జ్ తో 1000 కిలో మీటర్లకు పైగా రేంజ్ ను అందించబోతోంది. ఇంతకీ ఆ కారు ఏది? దాని కథ ఏంటంటే?

BYD అద్భుతమైన సృష్టి

చైనా EV రేంజ్ ర్యాంకింగ్స్ లో BYD అగ్రస్థానంలో కొనసాగుతోంది.  BYD లేటెస్ట్ డెంజా Z9 BEV ఒకే ఛార్జ్ తో ఏకంగా 1,036 కి.మీ ప్రయాణాన్ని అందించబోతోంది. ఈ మోడల్‌ ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. అప్ డేటెడ్ డెంజా Z9 GT కారు BEV, PHEV వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. BEV RWD, AWD లలో అందించబడుతుంది.  రెండు బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటుంది. అందులో ఒకటి 102.33 kWh కాగా, మరొకటి  122.496 kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు 5 రేంజ్ లలో అందుబాటులో ఉంటుంది. 820 కి.మీ, 860 కి.మీ, 880 కి.మీ, 1,002 కి.మీ, 1,036 కి.మీ పరిధిని అందించనున్నాయి.

గంటకు 270 కి.మీ గరిష్ట వేగం

Advertisement

ఇక కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన RWD 370 kW ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి 240 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. AWD 230 Kw  ముందు ఎలక్ట్రిక్ మోటార్, రెండు 310 kW వెనుక మోటార్లను కలిగి ఉంది. ఇవి కలిపి 850 kW విద్యుత్ ఉత్పత్తిని అందిస్తాయి. ఈ కారు గరిష్ట వేగం గంటకు 270 కి.మీ ఉంటుంది.

ఈ కారు PHEV 63.82 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ కారు ప్రస్తుత మోడల్ కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది. ప్రస్తుత కారు 400 కి.మీ రేంజ్ ను అందిస్తుంది. దీని పవర్‌ ట్రెయిన్‌ లో 2.0T ఇంజిన్, మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇంజిన్ గరిష్టంగా 152 Kw పవర్ అవుట్‌ పుట్‌ ను కలిగి ఉంటుంది. మూడు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి 640 kW  అవుట్‌ పుట్‌ ను కలిగి ఉంటాయి. దీని గరిష్ట వేగం గంటకు 230 కి.మీ.

Advertisement

ఇక  డైమెన్షనల్‌ గా, అప్ డేట్ చేయబడిన డెంజా Z9 GT కారు..  పొడవు 5180 mm, వెడల్పు 1990 mm, ఎత్తు 1480  mm, వీల్‌ బేస్ 3125 mm ఉంటుంది. క్యాబిన్ పక్కన, కాక్‌ పిట్ 17.3 అంగుళాల సెంట్రల్ కంట్రోల్ స్క్రీన్, డ్యూయల్ 13.2అంగుళాల 2.5K స్క్రీన్‌ లతో సిమెట్రిక్ లే అవుట్‌ ను కలిగి ఉంటుంది. పది స్క్రీన్ లింకేజ్, వాయిస్ రికగ్నిషన్‌ కు సపోర్టు చేస్తుంది. ఇది 4nm DiLink స్మార్ట్ కాక్‌ పిట్ చిప్ ద్వారా పవర్ ను పొందుతుంది. ధర సహా పూర్తి వివరాలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది.

Read Also: రేంజ్ రోవర్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ కారు, లాంచింగ్ ఎప్పుడు అంటే?

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×