E-Paper
Advertisement

High Speed EV Car: గంటకు 500 కిలో మీటర్లు.. రికార్డులు బద్దలు కొట్టిన ఎలక్ట్రిక్ కారు!

High Speed EV Car: గంటకు 500 కిలో మీటర్లు.. రికార్డులు బద్దలు కొట్టిన ఎలక్ట్రిక్ కారు!
Advertisement

ప్రపంచ ఈవీ రంగం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ రేంజ్ మీద ఫోకస్ పెట్టిన ఆటో మోబైల్ కంపెనీలు, ఇప్పుడు అత్యంత వేగం మీద ఫోకస్ పెట్టాయి. తాజాగా యాంగ్వాంగ్ U9 ఎక్స్‌ ట్రీమ్ పరీక్షలో 308.4 మైళ్లు(సుమారు 500 కి.మీ)వేగంతో ప్రయాణించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటి వరకు బుగట్టి చిరోన్ సూపర్ స్పోర్ట్ కారు గంటకు 304 మైళ్ల వేగంతో దూసుకెళ్లగా, ఇప్పడు దాని రికార్డు బద్దలైంది.  యాంగ్వాంగ్ U9 ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించ కారుగా గుర్తింపు తెచ్చుకుంది. పూర్తిగా విద్యుత్తుతో నడిచే చైనీస్ హైపర్‌ కారు అయిన యాంగ్వాంగ్ U9 ఎక్స్‌ ట్రీమ్ జర్మనీలో జరిగిన టెస్ట్ లో వరల్డ్ రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈవీగానే కాకుండా అత్యంత వేగంగా ప్రయాణించే కారుగానూ గుర్తింపు తెచ్చుకుంది.

జర్మనీ టెస్టింగ్ లో సరికొత్త రికార్డు

యాంగ్వాంగ్ U9 ఈవీ ఈ సంవత్సరం ప్రారంభంలో కోయినిగ్‌ సెగ్ అగెరా RS, రిమాక్ నెవెరా, ఆస్పార్క్ ఔల్ లాంటి హైస్పీడ్ కార్లను అధిగమించి 293.5 మైళ్ల వేగంతో ప్రయాణించింది. తాజాగా ఇదే కారు జర్మనీలోని ATP ఆటోమోటివ్ టెస్టింగ్ పపెన్‌బర్గ్‌ లో పూర్తయింది. కొన్ని నెలల క్రితం, ఈ కారును U9 ట్రాక్ ఎడిషన్ అని పిలిచేవాళ్లు. కానీ కొత్త స్పీడ్ రికార్డ్‌ తో యాంగ్వాంగ్ U9 ఎక్స్‌ ట్రీమ్ లేదంటే U9Xగా పిలవాలని నిర్ణయించారు.  “యాంగ్వాంగ్ అనేది అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. రానున్న రోజుల్లో U9X సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది” అని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్టెల్లా లీ వెల్లడించారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కారు, తాము తయారు చేసిన ఎలక్ట్రిక్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

U9X  డ్రైవర్ గా మార్క్ బాసెంగ్  

Advertisement

U9X డ్రైవర్ మార్క్ బాసెంగ్ ఈ సంవత్సరం అద్భుతమైన డ్రైవింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. U9X నాలుగు ఎలక్ట్రిక్ మోటార్ల నుంచి 3,000 హార్స్‌ పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. టైర్లు సెమీ స్లిక్‌గా  ఉంటాయి. ఈ స్పీడ్ రన్ కోసం సస్పెన్షన్ కూడా ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. ఈ కారు నడపడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు బాసెంగ్. ఈ కారు చాలా నిశ్శబ్దంగా అద్భుతాన్ని సృష్టించిందన్నారు. సౌండ్ లేకపోడవం వల్ల ట్రాక్ మీద మరింత ఫోకస్ పెట్టేందుకు ఈజీ అయ్యిందన్నాడు. మొత్తంగా U9X కారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తనకు వ్యక్తిగతంగా మంచి పేరు తీసుకొచ్చిందని బ్రాసెంగ్ సంతోషం వ్యక్తం చేశాడు.

కస్టమర్ వెర్షన్ లో అందుబాటులో U9X కార్లు 

U9X కస్టమర్ వెర్షన్‌ కార్లు ఇప్పుడు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. అయితే, ఈవీ కార్లను కేవలం 30 యూనిట్లు తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. యాంగ్వాంగ్ అనేది చైనీస్ ఆటో మోబైల్ కంపెనీ BYD యూనిట్. ఇది చైనీస్ ఈవీ తయారీదారు.  అంతేకాదు, ఇది అక్కడ అత్యధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. BYD ప్రపంచ వ్యాప్తంగా కూడా తమ ఈవీ కార్లను విస్తరిస్తోంది. యూరప్‌ లోనూ సత్తా చాటుతోంది.

Advertisement

Read Also:  గ్రాండ్ విటారా To ఇన్నోవా హైక్రాస్.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్లు ఇవే!

Related News

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

హ్యుందాయ్ కొత్త SUV ఇంటీరియర్ లీక్.. క్రెటాకు పోటీ తప్పదా?

మాన్యువల్ కార్ల కంటే ఆటోమేటిక్ కార్లే ఫాస్టా? ఇదీ అసలు కథ!

ఏంటీ.. మారుతీ, హుందాయ్‌లో 5 స్టార్ సేఫ్టీ కార్లు ఉన్నాయా? ఇదిగో లిస్టు!

యమహా R2 వచ్చేసింది.. ఈ బైక్‌ లో అదిరిపోయే 5 హైలైట్స్ ఇవే!

సింపుల్ ఫ్లిప్ అప్ కాదు.. ఈ హెల్మెట్ 180 డిగ్రీలు తిరుగుతుంది!

Big Stories

Advertisement
×