E-Paper
Advertisement

Best Mileage Cars Hybrid: గ్రాండ్ విటారా To ఇన్నోవా హైక్రాస్.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్లు ఇవే!

Best Mileage Cars Hybrid: గ్రాండ్ విటారా To ఇన్నోవా హైక్రాస్.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కార్లు ఇవే!
Advertisement

పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు హైబ్రిడ్ కార్లు కూడా మంచి మైలేజ్ అందిస్తున్నాయి.  మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్, హోండా సిటీ, టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి ఇన్విక్టో హైబ్రిడ్ కార్లు అద్భుతమైన మైలేజ్ ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. జనవరి 2026లో అందుబాటులో ఉన్న బెస్ట్ మైలేజ్ హైబ్రిడ్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్

మారుతి సుజుకి గ్రాండ్ విటారా,  టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ రెండూ ఒకే మెకానికల్ సెటప్‌ను కలిగి ఉన్నాయి. 48V మోటార్ యూనిట్‌తో కలిపి 1.5-లీటర్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఈ రెండు కార్లు 27.97 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తున్నాయి. ఇవి హైబ్రిడ్ విభాగంలో అత్యుత్తమ మైలేజ్ కార్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ ఇంజన్లు e-CVT ట్రాన్స్‌ మిషన్‌ ను కలిగి ఉన్నాయి. సిటీ చుట్టూ డ్రైవింగ్ కు అనుగుణంగా రూపొందించారు. ఈ కార్లు SUVలుగా మంచి లుక్ తో పాటు తగినంత గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన పనితీరు, అధునాతన సాంకేతిక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ రెండు కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఫ్యూయెల్ టైప్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్, పెట్రోల్ వెర్షన్ లో అందుబాటులో ఉన్నాయి. 5 సీట్ల కెపాసిటీ ఉంటుంది

⦿ హోండా సిటీ హైబ్రిడ్

Advertisement

హోండా సిటీ పవర్ ఫుల్ ఇంజిన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చింది. అదే సమయంలో ఈ హైబ్రిడ్ కారును బెస్ట్ మైలేజ్ కార్లలో ఒకటిగా కొనసాగుతోంది. మంచి డిజైన్, లుక్, ఫీచర్ రిచ్, ప్లష్ క్యాబిన్,  మంచి వెనుక సీటు సౌకర్యం, మృదువైన ఇంజిన్‌ను కలిగి ఉంది.  కొద్ది సంవత్సరాల క్రితం హైబ్రిడ్ వేరియంట్ ప్రవేశపెట్టడంతో, ఇప్పటికే ఆకట్టుకునే ఇంజిన్ ఇప్పుడు మరింత నిశ్శబ్దంగా, మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ కారు 27.13 కిలో మీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారు 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. e-CVT ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ప్యూయెల్ టైప్ ఎలక్ట్రిక్, పెట్రోల్ తో వస్తుంది. 5 సీట్లతో వస్తుంది.

⦿ ఇన్నోవా హైక్రాస్, మారుతి ఇన్విక్టో హైబ్రిడ్

టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టో కూడా మంచి మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు డిజైన్, ఫీచర్లలో తేడా ఉంటాయి. యాంత్రికంగా ఒకేలా ఉంటాయి. ఇవి ఏకంగా 23.24 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తాయి. ఈ కార్లు 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, e-CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ తో వస్తాయి. టయోటా లైనప్‌లోని ఇన్నోవా క్రిస్టా, మారుతి లైనప్‌లోని ఎర్టిగా పై లెవెల్ గా అందుబాటులోకి వచ్చాయి. రెండు కార్లు లెవల్ 2 ADAS తో  మంచి సౌకర్య, భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 7 ఎయిర్ బ్యాగ్ లు ఉంటాయి. ఫ్యూయెల్ టైప్ పెట్రోల్. సీటింగ్ సామర్థ్యం కూడా 7 సీట్లు ఉంటాయి.

Advertisement

Read Also:  హ్యుందాయ్ జనవరి డిస్కౌంట్లు.. ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×