E-Paper
Advertisement

లక్షా 20 వేల కి.మీ తిరిగాక కారులో రీప్లేస్ చేయాల్సిన కీ పార్ట్స్ ఇవే, పట్టించుకోపోతే బూడిదే!

లక్షా 20 వేల కి.మీ తిరిగాక కారులో రీప్లేస్ చేయాల్సిన కీ పార్ట్స్ ఇవే, పట్టించుకోపోతే బూడిదే!
Advertisement

Car Reaches 120,000 KM: మీరు కారు ఉపయోగిస్తున్నారా? ఇప్పటికే 1.20 లక్షల కిలోమీటర్లు తిరిగిందా? అయితే, మీరు జాగ్రత్త పడకతప్పదు. ఈ సమయంలో సాధారణ సర్వీసింగ్ మాత్రమే కాకుండా, కొన్ని ముఖ్యమైన భాగాలను పరిశీలించి అవసరమైతే మార్చడం చాలా అవసరం. ఎందుకంటే ఇంతకాలం వినియోగంలో ఉన్న భాగాలు క్రమంగా అరిగిపోతాయి. వాటి పనితీరు తగ్గుతుంది. ఇంతకీ చెక్ చేయాల్సిన పార్ట్స్ ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఇంజిన్  

ఫస్ట్ ఇంజిన్‌ మీద ఫోకస్ పెట్టాలి. ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్లను తప్పనిసరిగా మార్చాలి. ఇవి క్లీన్‌గా లేకపోతే ఇంజిన్ పనితీరు దెబ్బతింటుంది. అలాగే టైమింగ్ బెల్ట్, ఫ్యాన్ బెల్ట్‌ లను కూడా పరిశీలించాలి. ఇవి పాడైతే, తెగిపోతే ఇంజిన్‌కు పెద్ద ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందుకే, వీటిని ముందుగానే మార్చడం మంచిది.

⦿ బ్రేక్ సిస్టమ్

Advertisement

బ్రేక్ సిస్టమ్ కూడా ఈ దశలో కచ్చితంగా చెక్ చేయాలి. బ్రేక్ ప్యాడ్స్, డిస్క్‌ లు ఎక్కువగా వాడటంతో అరిగిపోతాయి. బ్రేకింగ్ పనితీరు తగ్గి ప్రమాదాలకు  కారణం అవుతుంది. కాబట్టి వాటిని తనిఖీ చేసి అవసరమైతే కొత్తవిగా మార్చాలి. అలాగే క్లచ్ ప్లేట్ పరిస్థితిని కూడా చూసుకోవాలి. క్లచ్ స్లిప్ అవుతుంటే వెంటనే దాన్ని మార్చడం అవసరం.

⦿ స్పార్క్ ప్లగ్‌లు

పెట్రోల్ కార్ల విషయంలో స్పార్క్ ప్లగ్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి పాడైతే పికప్ తగ్గిపోవడంతో పాటు, మైలేజ్ పడిపోతుంది. వీటిని మార్చడం ద్వారా కారు పనితీరు మెరుగుపడుతుంది.

⦿ సస్పెన్షన్ వ్యవస్థ

Advertisement

ఇక సస్పెన్షన్ సిస్టమ్ ను కూడా చెక్ చేసుకోవాలి. ఎక్కువ మైలేజీ తర్వాత షాక్ అబ్జార్బర్‌లు, బుషింగ్‌లు బలహీనం అవుతాయి. వెహికల్ కుదుపులకు గురవుతుంది. ప్రయాణం అసౌకర్యంగా మారుతుంది. ఈ సమస్యను నివారించేందుకు సస్పెన్షన్ భాగాలను మార్చడం మంచిది.

⦿ టైర్లు, బ్యాటరీ

టైర్లను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ట్రెడ్ లోతు తగ్గినా, టైర్లు పాడైనా వెంటనే కొత్తవి వేయించాలి. మంచి టైర్లు రోడ్డు గ్రిప్‌ను మెరుగుపరుస్తాయి. ప్రమాదాలను తగ్గిస్తాయి. అదే విధంగా బ్యాటరీ పరిస్థితిని చెక్ చేయాలి. పాత బ్యాటరీ సరైన పనితీరు ఇవ్వకపోతే, దాన్ని మార్చాలి.

Read Also: హైవే సైన్‌ బోర్డులు గ్రీన్ కలర్‌ లో ఉంటాయి.. ఎందుకో తెలుసా?

⦿ కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్

ఇక చివరగా, కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్, ట్రాన్స్‌మిషన్ ఆయిల్ ను మార్చడం చాలా అవసరం. ఇవి కారు భాగాలను సజావుగా పనిచేయడానికి సహాయపడతాయి. మొత్తంగా 1.20 లక్షల కిలోమీటర్ల తర్వాత కారు హెల్త్ ను చక్కగా మెయింటెయిన్ చేయాలంటే వీటిని చెక్ చేసుకోవాలి. సమయానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే కారు పనితీరు మెరుగుపడటంతో పాటు, భద్రత కూడా పెరుగుతుంది.

Read Also: సీఎన్జీ వాడితే నిజంగా మనీ సేవ్ అవుతుందా? ఇదీ అసలు కథ!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×