E-Paper
Advertisement

పెళ్లి పేరుతో భారీ మోసం.. రూ.9.35 కోట్లు స్వాహా.. అషురెడ్డిపై కేస్ ఫైల్!

పెళ్లి పేరుతో భారీ మోసం.. రూ.9.35 కోట్లు స్వాహా.. అషురెడ్డిపై కేస్ ఫైల్!
Advertisement

Ashu Reddy: రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన జూనియర్ సమంత అలియాస్ అషు రెడ్డి (Ashu Reddy)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గ్లామర్ క్వీన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ పోస్టులతో ఆకట్టుకుంటూనే మరొకవైపు బుల్లితెర షోలలో సందడి చేస్తోంది. అలాంటి ఈమె తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఆమె క్రేజ్ కారణంగా కాదు ఒకరిని మోసం చేసిన కారణంగా ప్రేమ, పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసింది అంటూ ఈమెపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS ) పోలీసులు కేసు నమోదు చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అషు రెడ్డిపై కేస్ ఫైల్..

బాధితులు చేసిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న వై.వి ధర్మేంద్రకి 2018లో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇండియాకి వచ్చిన సమయంలో ఈ పరిచయం మొదలైందని.. తాను అమెరికాలో చదువు పూర్తిచేసుకుని సినిమాల అవకాశాల కోసం హైదరాబాద్ కి వచ్చానని చెప్పి అతనితో సన్నిహితంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందని, అది పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ధర్మేంద్రను పూర్తిగా మోసం చేసిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఈమెపై ఇప్పుడు కేసు ఫైల్ చేశారు.

ప్రేమ పేరుతో భారీ మోసం..

Advertisement

ప్రేమ పేరుతో దగ్గరైన తర్వాత ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని చెప్పి, పలుమార్లు డబ్బులు తీసుకున్నట్లు కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇకపోతే ధర్మేంద్ర నుంచి తీసుకున్న డబ్బుతో ఖరీదైన కారు, బంగారం, ఫ్లాట్లు ఇతర ఆస్తులు కొనుగోలు చేసి వాటిని తన పేరు మీదే రిజిస్టర్ చేయించుకున్నట్లు కూడా బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అషు రెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లి ఖరారు చేసుకుంటున్నామని చెప్పి.. పూజలు కూడా నిర్వహించి వెళ్ళిపోయారు. మళ్ళీ పెళ్లి మాట ఎత్తితే తప్పించుకు తిరుగుతున్నారు అంటూ ఆరోపించారు.

రూ.9.35 కోట్లు స్వాహా..

ఇకపోతే ఇదే విషయంపై బాధితుడి తండ్రి యెనుముల సత్యనారాయణ తన ఫిర్యాదులో 2018 నుండి 2025 సంవత్సరం వరకు ఐదు కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు, నగదు రూపంలో మొత్తం రూ.9.35 కోట్ల ఆస్తులు, డబ్బులు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదనంగా ఆమె సోదరీ కూడా రూ.50 లక్షలు తీసుకున్నారని బాధితుడి తండ్రి ఆరోపించారు.

ఆరోపణలు నిజమైతే అరెస్ట్ తప్పదా?

Advertisement

ఇక ఈ ఆరోపణల ఆధారంగానే ఇప్పుడు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రికార్డులు ఆస్తుల కొనుగోలు వివరాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇక నిజమని తేలితే మాత్రం అషు రెడ్డి అరెస్టు కాక తప్పదు అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయం తెలిసి నెటిజన్లు అషు రెడ్డి పై పలు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం ఉందో తెలియదు కానీ అసలు నిజం తెలిసే వరకు వీటిని ఆరోపణలు గానే పరిగణించవచ్చు.

ALSO READ:నక్కతోక తొక్కిన శ్రీవిష్ణు.. క్రేజీ డైరెక్టర్స్ తో 4 ప్రాజెక్టులు.. ఫ్లాప్ హీరోకి ఎందుకింత డిమాండ్?

Related News

నందన అరెస్ట్.. ఏం పీ*క*లే*రు అంటూ అన్వేష్ వీడియో రిలీజ్!

Illu Illaalu Pillalu Srivalli : హమ్మయ్య.. సీరియల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

అనసూయ ఓపెన్ ఛాలెంజ్.. మరో వీడియోతో హల్చల్!

ఈ వారం సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇది అస్సలు ఊహించలేదు మావా…

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Big Stories

Advertisement
×