Car Sales Report February 2026: ఆటోమేకర్లు ఫిబ్రవరి 2026కు సంబంధించిన అమ్మకాల నివేదికలను విడుదల చేస్తున్నాయి. అన్ని బ్రాండ్లు గత ఏడాదితో పోల్చితే అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించాయి. టయోటా గత నెలలో 30,000 వాహనాలను అమ్మగా, హ్యుందాయ్ ఫిబ్రవరి 2026 నెలలో అత్యుత్తమ అమ్మకాలను నివేదించింది. మారుతి సుజుకి అమ్మకాలు 174840 య
మారుతి సుజుకి ఫిబ్రవరి 2026లో అమ్మకాల్లో టాప్ లో నిలిచింది. మొత్తం అమ్మకాలు 2,13,995 యూనిట్లుగా ఉన్నాయి. 7.31 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. గత సంవత్సరం ఇదే నెలలో, ఎగుమతులతో సహా మొత్తం 1,99,400 యూనిట్లను అమ్మింది. ఈ కంపెనీ ఫిబ్రవరి 2026లో 39,155 వాహనాలను ఎగుమతి చేసింది, గత ఏడాది ఇదే నెలలో 25,021 వాహనాలు ఎగుమతి చేసింది. దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరిలో 1,61,000 యూనిట్లుగా ఉండగా, LCV అమ్మకాలు 3,130 యూనిట్లుగా నమోదయ్యాయి. మినీ, కాంపాక్ట్ విభాగంలో మారుతి 76,624 వాహనాలను అమ్మింది. యుటిలిటీ వెహికల్ విభాగంలో బ్రాండ్ మొత్తం 72,756 వాహనాలను విక్రయించింది.
టాటా మోటార్స్ ఫిబ్రవరి 2026లో మొత్తం అమ్మకాలు 63331 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 46811 యూనిట్లు అమ్ముడయ్యాయి. అమ్మకాల వృద్ధి 35 శాతంగా నమోదయ్యింది. కంపెనీ గత నెలలో డీలర్‌షిప్‌లకు 62329 వాహనాలను పంపింది. ఫిబ్రవరి 2025లో 46435 యూనిట్లు మాత్రమే పంపింది. దేశీయ వార్షిక అమ్మకాలు 34 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 376 యూనిట్లతో పోలిస్తే కంపెనీ ఫిబ్రవరి 2026లో 1002 వాహనాలను ఎగుమతి చేసింది. టాటా మోటార్స్ ఫిబ్రవరి 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో 8385 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాన్ని విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 5343 వాహనాలు విక్రయించింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఫిబ్రవరి 2026లో మొత్తం 66,134 యూనిట్లను అమ్మింది. అమ్మకాల వృద్ధి 12.6 శాతంగా ఉంది. కంపెనీ దేశీయ అమ్మకాలు 52,407 యూనిట్లు కాగా, హ్యుందాయ్ 13,727 వాహనాలను ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు కంపెనీ ఎప్పుడూ లేనంత స్థాయిలో అమ్మకాలను కొనసాగించినట్లు కంపెనీ తెలిపింది.
టయోటా ఫిబ్రవరి 2026లో మొత్తం 34,034 వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో 28,414 యూనిట్లు అమ్మింది. 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో, కంపెనీ గత నెలలో 30,737 యూనిట్లను విక్రయించింది. ఫిబ్రవరి 2025లో 26,414 వాహనాలు మాత్రమే విక్రయించింది. ఫిబ్రవరి 2025లో 2000 యూనిట్లతో పోలిస్తే, కంపెనీ గత నెలలో 3,297 యూనిట్లను ఎగుమతి చేసింది.
కియా ఇండియా ఫిబ్రవరిలో ఇప్పటి వరకు అత్యధికంగా 27,610 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 10.3 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో కియా 25,026 వాహనాలను విక్రయించింది. సోనెట్ కాంపాక్ట్ SUV విభాగంలో బాగా అమ్మకాలు జరిగాయి. సెల్టోస్ కూడా మంచి అమ్మకాలు జరపుకుంటుంది.