E-Paper
Advertisement

USB Safety Tips: కారులో స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? బ్యాటరీ జీవితకాలాన్ని చేతులారా దెబ్బతీసినట్టే!

USB Safety Tips: కారులో స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతున్నారా? బ్యాటరీ జీవితకాలాన్ని చేతులారా దెబ్బతీసినట్టే!
Advertisement

USB Safety Tips: తరచూ లాంగ్ జర్నీస్ చేసే చాలామంది కారులోనే తమ స్మార్ట్‌ఫోన్లకు ఛార్జింగ్ పెడుతుంటారు. అయితే ఈ పద్ధతి అస్సలు మంచి కాదని చెబుతున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ జీవితకాలాన్ని చేతులారా దెబ్బతీయడే అంటున్నారు. ఈ నేపథ్యంలో కారులో ఫోన్‌‌కు ఛార్జింగ్ పెట్టడం వలన కలిగే ప్రమాదాలు ఏమిటి? ఫోన్‌ను కారులో సరైన పద్ధతిలో ఎలా ఛార్జ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కారు వేగం పెరిగితే:

జర్నీలో ఉన్నప్పుడు ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోగానే వెంటనే కారులో ఉన్న కేబుల్‌కు కనెక్ట్ చేస్తుంటాం. కానీ ఈ అలవాటు ఫోన్ బ్యాటరీకి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే.. ఇంట్లో సాకెట్ నుండి వెలువడే విద్యుత్ స్థిరంగా ఉన్నప్పటికీ, కారు విద్యుత్ భిన్నంగా ఉంటుంది. కారులోని పవర్ ఇంజిన్‌కు కనెక్ట్ చేసిన ఆల్టర్నేటర్ నుండి వస్తుంది. దీంతో ఇంజిన్ వేగాన్ని పెంచినప్పుడు లేదా హెడ్‌లైట్స్ ఆన్ చేసినప్పుడు పవర్ హెచ్చుతగ్గులకు గురవుతుందని తాజాగా ఎకోఫ్లో నివేదిక పేర్కొంది.

Advertisement

విద్యుత్ సరఫరాలో హెచ్చతగ్గులు ఉండే క్రమంలో మీ ఫోన్‌‌ను ఛార్జ్ చేస్తే.. మీ బ్యాటరీ పూర్తిగా బలహీనపడుతుంది. అలాగే ఆకస్మిక విద్యుత్ పెరుగుదల ఛార్జ్‌లో ఉన్న బ్యాటరీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు పదేపదే విద్యుత్ పెరుగుదల బ్యాటరీ వైఫల్యానికి దారితీస్తుంది.

కారు పవర్‌లో హెచ్చుతగ్గులు:

కార్లలోని USB పోర్ట్‌లు సమర్థవంతంగా ఉండవు. చాలా కార్లలో ఈ పోర్ట్‌లు ఛార్జింగ్ కోసం రూపొందించలేదు. అలాగే పవర్ అవుట్‌పుట్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం కూడా పట్టవచ్చు. ఇలా ఫోన్ ఛార్జింగ్ మోడ్‌లో ఎక్కువసేపు ఉండటం వల్ల అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. దీంతో బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది.

ఎలాంటి అడాప్టర్ కొనాలంటే?

Advertisement

ఒకవేళ మీరు ఫోన్ ఛార్జింగ్ కోసం అడాప్టర్ కొలానకుంటే.. కారు 12V సాకెట్‌లోకి సరిపోయే బ్రాండెడ్ కార్ ఛార్జర్ అడాప్టర్‌ను కొనుగోలు చేయాలి. దీని కోసం UL, CE లేదా FCC వంటి భద్రతా గుర్తులు ఉన్న ఛార్జర్‌లను ఎంచుకోవడం ఉత్తమం. ఈ గుర్తులు ఛార్జర్‌కు అదనపు శక్తి, అదనపు కరెంట్ లేదా ఓవర్ హీటింగ్ నుండి రక్షణ వ్యవస్థ ఉందని తెలియజేస్తాయి. అలాగే ప్యాకింగ్‌పై PD లేదా QC అని టెక్ట్స్ ఉంటే ఇంకా మంచిది. వీటిని వేగంగా ఛార్జింగ్ చేయడానికి తయారు చేశారు.

నాసిరకం కేబుల్స్ వద్దు:

మనం ఎంచుకునే నాసిరకం కేబుల్స్ మొత్తం ఛార్జింగ్ వ్యవస్థను నాశనం చేస్తుంది. కాబట్టి.. చౌకైన లేదా పాత కేబుల్స్ తగినంత కరెంట్‌ను నిర్వహించలేవని గుర్తుంచుకోండి. ఈ రకమైన కేబుల్స్ ఫోన్ వేడెక్కడానికి కారణమవుతుంది. దీనివల్ల ఒక్కోసారి కారులో ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే కట్ అయినట్లు కనిపించే వైర్లు ఉన్న కేబుల్‌ను ఎప్పుడూ ఉపయోగించవద్దు.

ఫోన్ ఛార్జ్ చేసే విధానం ఇది:

కారులో మీ స్మార్ట్‌ఫోన్‌కు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కారును స్టార్ట్ చేసేటప్పుడు గణనీయమైన విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ సమయంలో మీ ఫోన్‌కు తీవ్ర నష్టం కలిగించవచ్చు. కాబట్టి.. ముందుగా కారును స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఫోన్‌ను ప్లగ్ చేయండి. అలాగే ఇంజిన్‌ను ఆఫ్ చేసే ముందు మీ ఫోన్‌ను అన్‌ప్లగ్ చేయడం కూడా మర్చిపోవద్దు.

 

 

 

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×