E-Paper
Advertisement

New Year 2026 Telugu Movies: కొత్త ఫ్లాప్ సినిమాలతో మొదలైన కొత్త సంవత్సరం..

New Year 2026 Telugu Movies: కొత్త ఫ్లాప్ సినిమాలతో మొదలైన కొత్త సంవత్సరం..
Advertisement

Upcoming Sankranti Releases 2026: ఎట్టకేలకు 2026 వచ్చేసింది. కొత్త సంవత్సరం అంటేనే కొత్త సినిమాల హడావిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి టాలీవుడ్‌కు కొత్త ఏడాది మాత్రం అంతగా కలిసిరాలేదు. న్యూ ఇయర్ వీకెండ్‌లో రిలీజైన సినిమాలు ఒక్కటంటే ఒక్కటీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. చెప్పాలంటే 2026 ప్రారంభం టాలీవుడ్‌కు పూర్తిగా నిరాశగా మారింది.

2026 ఇంత దారుణంగా ఉందేంటి..

నందు హీరోగా వచ్చిన ‘సైక్ సిద్ధార్థ’ సినిమాపై మొదట మంచి అంచనాలే ఉన్నాయి. సురేష్ బాబు, రానా దగ్గుబాటి లాంటి పెద్ద పేర్లు ఈ సినిమాకు బ్యాక్ చేయడంతో కాస్త బజ్ కూడా క్రియేట్ అయ్యింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓపెనింగ్స్ బాగా తక్కువగా వచ్చాయి. పైగా వర్డ్ ఆఫ్ మౌత్ కూడా నెగటివ్‌గా మారడంతో సినిమా ముందుకు సాగడం కష్టమయ్యింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఖర్చులైనా రికవర్ అవుతాయా లేదా అనే డౌట్‌ ఉంది.

Advertisement

ఇక న్యూ ఇయర్ వీకెండ్‌లో వచ్చిన మధం, వన వీర, 45 లాంటి సినిమాలు కూడా పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి. ఎలాంటి బజ్ లేకుండా థియేటర్లలోకి వచ్చి నిశ్శబ్దంగానే వెళ్లిపోయాయి కూడా. ఆడియన్స్ అసలు ఈ సినిమాల వైపు చూసినట్టే లేదు. పండుగ టైమ్ కాకపోయినా కనీసం ఓ మోస్తరు రెస్పాన్స్ కూడా లేకపోవడం ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది.

ఒకే ఒక్క హోప్ ఇచ్చిన సినిమా..

ఈ వీకెండ్‌లో కొంత ఊరట ఇచ్చింది మాత్రం ఆది సాయికుమార్ ‘శంభాల’ సినిమా. పెద్ద ఓపెనింగ్స్ కాకపోయినా వీకెండ్‌లో డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కనీసం థియేటర్లలో జనాలు కనిపించారు అనిపించేలా చేసింది. మిగతా పాత రిలీజులు మాత్రం బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా తగ్గిపోయాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన ‘ధురంధర్’ సినిమా మాత్రం సిటీల్లో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు కలెక్షన్స్ సాధించింది. కానీ అవతార్, అనకొండ లాంటి సినిమాలకు అసలు ఆడియన్స్ రాలేదు. మొత్తం మీద చూస్తే… న్యూ ఇయర్ వీకెండ్ టాలీవుడ్‌కు డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు.

Advertisement

ఇప్పుడు అందరి చూపూ సంక్రాంతి సినిమాల మీదే. ఎందుకంటే సంక్రాంతి అంటేనే థియేటర్లకు పండగ వాతావరణం వచ్చేస్తుంది. ఈసారి లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. జనవరి 9న ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘ది రాజా సాబ్’ మీద భారీ అంచనాలున్నాయి. హారర్, కామెడీ, ఫాంటసీ మిక్స్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అదే రోజున విజయ్ నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా ‘జన నాయకుడు’ కూడా రిలీజ్ అవుతోంది.

జనవరి 12న చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రానుంది. ఇది పక్కా ఫెస్టివల్ ఎంటర్టైనర్ అని టాక్. జనవరి 13న రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో మాస్ మహారాజ్ మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
జనవరి 14న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ తో నవ్వుల పండుగ తీసుకురాబోతున్నారు. జనవరి 15న శర్వానంద్ హీరోగా ‘నారి నారి నడుమ మురారి’ విడుదల కానుంది. ఈ సినిమాకూ మంచి బజ్ ఉంది. మొత్తానికి 2026కి వచ్చిన డిజాస్టర్ స్టార్ట్‌ను ఈ సంక్రాంతి సినిమాలు మార్చుతాయా? థియేటర్లు మళ్లీ కళకళలాడతాయా? అన్నది చూడాలి.

ALSO READ: Nayanthara: ఏకంగా నయనతార విషయంలో ఫిట్టింగ్ పెట్టేసిన బాలకృష్ణ..!

Related News

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

Big Stories

Advertisement
×