E-Paper
Advertisement

పాత పెట్రోల్ స్కూటర్‌ను ఈవీగా మార్చుకోవచ్చు, ఎలాగో తెలుసా?

పాత పెట్రోల్ స్కూటర్‌ను ఈవీగా మార్చుకోవచ్చు, ఎలాగో తెలుసా?
Advertisement

Petrol to Electric Bike Conversion: ఈ రోజుల్లో చాలా మంది పెట్రో వాహనాలకు గుడ్ బై చెప్పి, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రో ధరల పెంపుతో పాటు కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో చాలా మంది ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తమ పాత బైక్ లేదంటే స్కూటర్‌ ను ఎలక్ట్రిక్‌ గా మార్చుకోవాలని  ఆలోచిస్తున్నారు. ఇలా మార్చుకోవడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యం అయితే, ఖర్చు ఎంత అవుతుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

పెట్రో స్కూటర్ ను ఎలక్ట్రిక్ గా ఎలా మార్చుతారంటే?

పెట్రో స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చడాన్ని టెక్నికల్ గా ఎలక్ట్రిక్ కన్వర్షన్ లేదంటే రెట్రోఫిట్టింగ్ అంటారు. అంటే, ఆ బైక్ లో ఉన్న పెట్రోల్ ఇంజిన్‌ ను తీసేసి, దాని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్‌ ను ఫిట్ చేస్తారు. ఈ ఛేంజెస్ తర్వాత స్కూటర్ పూర్తిగా  పవర్ తో నడుస్తుంది. ఈ బైక్ ను ఇంట్లోనే మొబైల్ మాదిరిగా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పెట్రోల్ అవసరం ఉండదు, సౌండ్ పొల్యూషన్ కూడా ఉండదు. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా భారీగా తగ్గిపోతాయి.

ఏ స్కూటర్లకు బాగా సెట్ అవుతుందంటే?

Advertisement

పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ గా మార్పు చేసుకోవాలంటే, సాధారణంగా 100cc నుంచి 125cc స్కూటర్లకు బాగా సెట్ అవుతుంది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్, హీరో స్ప్లెండర్ లాంటి వెహికల్స్ ఈజీగా ఎలక్ట్రిక్‌గా మార్చుకోవచ్చు. బైక్‌లను కూడా మార్చవచ్చు. అయితే, స్కూటర్లను మరింత ఈజీగా మార్చే అవకాశం ఉంటుంది.

నమ్మకమైన వర్క్ షాప్ ను సెలెక్ట్ చేసుకోవాలి!

ఎలక్ట్రిక్ కన్వర్షన్ అనేది నమ్మకమైన వర్క్‌ షాప్‌ లో చేయించాలి. ఎందుకంటే, ఏమాత్రం అటు ఇటు చేసినా, వాహం మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ముందుగా పెట్రోల్ వెహికల్ లోని పెట్రోల్ ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, ఎగ్జాస్ట్ లాంటి భాగాలను తొలగిస్తారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ మోటార్, లిథియం అయాన్ బ్యాటరీ, కంట్రోలర్, వైరింగ్, థ్రాటిల్ లాంటి పార్ట్స్ ను బిగిస్తారు. చివరగా స్కూటర్ ను టెస్ట్ చేస్తారు.

ఖర్చు ఎంత అవుతుంది?

Advertisement

పెట్రోల్ బైక్ ను ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేందుకు ఎంచుకునే కన్వర్షన్  కిట్‌ మీద ఆధారపడి ఉంటుంది. బేసిక్ కిట్ ధర రూ.16,000 నుంచి రూ. 25,000 వరకు ఉంటుంది. మంచి క్వాలిటీ ఉన్న కిట్ రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటుంది. ప్రీమియం కిట్లు రూ. 60,000 నుంచి రూ. 90,000 వరకు ఉండవచ్చు. ఫిట్టింగ్, GST, RTO ఛార్జీలు కలిపి మొత్తం ఖర్చు సాధారణంగారూ. 35,000 నుంచి రూ. 70,000 వరకు అవుతుంది. ఇలా కన్వర్ట్ చేసిన బైక్స్ ఒకే ఛార్జ్ తో 80 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ టైమ్ 3 నుంచి 6 గంటలు పడుతుంది.

ఆర్టీఓ డాక్యుమెంటేషన్ తప్పనిసరి!

పెట్రోల్ స్కూటర్.. ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్చుకున్న తర్వాత కచ్చితంగా RTOలో ఆఫీస్ కు వెళ్లాలి.  పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్‌గా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ ప్రక్రియకు సుమారు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం  ఉంటుంది.

Read Also: టయోటా To నిస్సాన్.. ఏప్రిల్ లో లాంచ్ కాబోయే ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×