E-Paper
Advertisement

Kishan Reddy: సమస్యకు పరిష్కారం.. ఇందన కొరత పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: సమస్యకు పరిష్కారం.. ఇందన కొరత పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Advertisement

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఎదురువుతున్న పరిస్థితులను అందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కవాడిగూడ సీజీవో టవర్స్ లో శనివారం తెలంగాణలో పెట్రోల్, డీజిల్, సీఎన్ జీ, ఎల్ పీజీ సరఫరా, లభ్యత ప్రస్తుత పరిస్థితులపై కిషన్ రెడ్డి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, డీలర్స్ అసోసియేషన్స్‌తో సమీక్​ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో చమురు నిక్షేపాలు తక్కువ ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ పై ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని చెప్పారు. పెట్రోల్ వాడకాన్ని తగ్గించేందుకు ఈవీ వాహనాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలిపారు.

లాక్ డౌన్..

తెలంగాణలో ఒక్క డీజిల్ ట్రైన్ లేదన్నారు. మొత్తం ఎలక్ట్రికల్ ట్రైన్స్ గా మార్చినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతునన దుష్పచారం వల్లే వంటగది వరకు ఆందోళన వచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విషయంలో ఎవరూ టెన్షన్ పడొద్దని స్పష్టంచేశారు. దేశంలో తగిన నిల్వలు ఉన్నాయన్నారు. ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ డిమాండ్ లో తెలంగాణ ముందుందన్నారు. సరఫరాలో ప్రభుత్వం కన్నా డిస్ట్రిబ్యూటర్స్ కీలకమని కిషన్ రెడ్డి వెల్లడించారు. లాక్ డౌన్ వేసే ప్రసక్తే లేదని, ప్రస్తుత పరిస్థితులకు లాక్ డౌన్ కు సంబంధం లేదన్నారు. భారత్ తప్ప ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెట్రోల్ , డీజిల్ రేట్లు పెరిగాయని, భారత్ మెరుగైన సిచ్యుయేషన్ లో ఉందన్నారు. అనేక దేశాలు ట్యాక్స్ పెంచితే భారత ప్రభుత్వం టాక్స్ తగ్గించి ఆయిల్ కంపెనీలపై భారం తగ్గించిందని పేర్కొన్నారు. అనుకోకుండా వచ్చిన క్రైసిస్ వల్ల రెండు, మూడ్రోజులు సమస్య ఎదురైంది వాస్తవమేనని కేంద్రమంత్రి తెలిపారు. ఎల్పీజీ కోసం డిపోలు, డీలర్ల వద్దకు ఎవరూ వెళ్లొద్దని సూచించారు.

Advertisement

Also Read: BRS Walkout: కళ్యాణ లక్ష్మి ఫోటోలతో నిరసన.. బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్!

ఎన్నికల తర్వాత..

గతంలో మాదిరిగానే బుక్ చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ పొదుపుగా వాడాలని కేంద్ర మంత్రి సూచించారు. అందరికీ క్రెడిట్ సిస్టమ్ లేదని, పెద్ద డీలర్స్ కు మాత్రమే క్రెడిట్ ఉందన్నారు. ఇప్పుడు కూడా డీలర్లకు 3 రోజుల క్రెడిట్ ఇస్తున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయని అపోజిషన్ ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. సీఎన్జీకి కొరత లేదని, సాధారణంగా సీఎన్జీ ఫిల్లింగ్ కు సమయం పడుతుందని, అందుకే వెహికిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. వదంతులు సృష్టించే వారిపై సీఎం యాక్షన్ తీసుకోవాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పై దేశంలో ఎక్కడాలేని రేట్ తెలంగాణలో ఉందని, తెలంగాణలో అత్యధిక వ్యాట్ ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ డీజిల్, పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించలేదని కేంద్ర మంత్రి నిలదీశారు. అనవసరంగా బుక్ చేసుకోవడంతో కొరత రావొద్దని ఎల్పీజీ రేట్లు పెంచినట్లు తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ 60 రోజుల వరకు సరిపడ నిల్వలు ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Also Read: Sports Meet: కేటీఆర్‌కు మంత్రి వాకిటి శ్రీహరి కౌంటర్.. ఎమన్నారంటే..?

Related News

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×