E-Paper
Advertisement

ఆహా ఏం అమ్మకాలు భయ్యా.. ఈవీ సేల్స్ లో పంచ్, విండ్సర్ రికార్డ్!

ఆహా ఏం అమ్మకాలు భయ్యా.. ఈవీ సేల్స్ లో పంచ్, విండ్సర్ రికార్డ్!
Advertisement

EV Sales Boom in India: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఈవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని మోడళ్ల అమ్మకాలు తక్కువగా నమోదైనప్పటికీ, ప్రముఖ ఎలక్ట్రిక్ SUVలు మాత్రం అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా ఎంజీ విండ్సర్ EV, టాటా పంచ్ EV, మారుతి సుజుకి e-విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ లాంటి కార్లు 100 శాతానికి పైగా అమ్మకాల పెరుగుదలను నమోదు చేసి మార్కెట్‌ లో హాట్ టాపిక్‌ గా మారాయి.

⦿ MG విండ్సర్ EV

MG విండ్సర్ EV మార్చి నెలలో ఈ కారు 4,530 యూనిట్లు అమ్ముడై అత్యధికంగా అమ్మకాలు జరుపుకున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. గత నెలతో పోలిస్తే దాదాపు 74% వృద్ధి నమోదు చేసింది. ఈ కారు 38 kWh నుండి 52.9 kWh వరకు బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 332 నుండి 449 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.  సుమారు 134 bhp పవర్ సామర్థ్యం ఉండటంతో పాటు, విశాలమైన క్యాబిన్, ఆధునిక ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

⦿ టాటా పంచ్ EV

Advertisement

ఇక టాటా పంచ్ EV విషయానికి వస్తే, ఇది కూడా భారీ వృద్ధిని సాధించింది. మార్చిలో 2,871 యూనిట్లు అమ్ముడవగా,  గత నెలతో పోలిస్తే 171% పెరుగుదల నమోదు చేసింది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ లో ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు 40 kWh వరకు బ్యాటరీ ఆప్షన్‌తో వస్తుంది. దీని రేంజ్ సుమారు 350 కిలోమీటర్లు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, 127 bhp పవర్ దీన్ని మరింత పాపులర్ మోడల్ గా మార్చేశాయి.

⦿ మారుతి సుజుకి e-విటారా

మారుతి సుజుకి e-విటారా కూడా మంచి డిమాండ్‌ను సంపాదించింది. మార్చిలో 2,254 యూనిట్లు అమ్ముడై, 159% వృద్ధిని నమోదు చేసింది. ఈ SUVలో 61 kWh బ్యాటరీ ఉండి, ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. 172 bhp పవర్‌తో పాటు మంచి సేఫ్టీ ఫీచర్లు ఉండటం వల్ల దీన్ని చాలామంది ఇష్టపడుతున్నారు.

⦿ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్

Advertisement

ఈ కారు కూడా మార్కెట్లోకి అడుగుపెట్టిన వెంటనే మంచి స్పందన అందుకుంది. మార్చి నెలలో 600 యూనిట్లు అమ్ముడవడంతో పాటు, గత ఏడాదితో పోలిస్తే 116% వృద్ధి నమోదు చేసింది. ఈ కారు 51.4 kWh బ్యాటరీతో 510 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. 169 bhp పవర్, ప్రీమియం ఫీచర్లు స్టైలిష్ SUVగా నిలబెడుతున్నాయి.

మొత్తంగా భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. మంచి రేంజ్, తక్కువ రన్నింగ్ ఖర్చు, ఆధునిక ఫీచర్లు వినియోగదారులను EVల వైపు మరింత ఆకర్షిస్తున్నాయి. మున్ముందు ఈ ట్రెండ్ మరింత వేగంగా పెరిగే అవకాశముంది.

Read Also: తక్కువ ధరలో క్రేజీ కార్లు.. రూ. 5 లక్షల్లో టాప్ మోడల్స్ ఇవే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×