E-Paper
Advertisement

ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి రాబోతున్న నిహారిక రాకాస ..స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి రాబోతున్న నిహారిక రాకాస ..స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?
Advertisement

Raakaasa OTT: మెగా డాటర్ నిహారిక నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈమె నిర్మాతగా మారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రారంభించారు అయితే మొదట్లో ఈ నిర్మాణ సంస్థ నుంచి వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వరుస సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నిహారిక తాజాగా రాకాస సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈమె తన అన్నయ్య వరుణ్ తేజ్ తో కలిసి బరి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన రాకాస..

ఇకపోతే నిహారిక ఇటీవల నిర్మాతగా వ్యవహరించిన రాకాస(Raakaasa) సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు మానస శర్మ దర్శకురాలిగా పనిచేశారు. సంగీత్ శోభన్(Sangeeth Sobhan), నయన్ సారిక (Nayan Sarika)హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో గెటప్ శ్రీను కీలక పాత్రలో కనిపించారు. హర్రర్ ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 28 రోజులకే తిరిగి డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన తెలియజేశారు.

నెట్ ఫ్లిక్స్ లోకి రాకాస…

Advertisement

ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్(Net Flix) కైవసం చేసుకున్నారు. ఈ సినిమా మే ఒకటో తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతోంది. ఈ సినిమా థియేటర్లలో ఏప్రిల్ 10వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా థియేటర్లలో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

వీరు(సంగీత్ శోభన్) అమెరికా నుంచి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఎంతో హుషారుగా ఇండియాకి వస్తాడు అయితే ఇండియా రాగానే తను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుసుకున్న వీరు ఆ పెళ్లిని ఆపాలని ప్రయత్నం చేస్తాడు. ఇందులో భాగంగానే తన స్నేహితుడు బాలు (గెటప్ శ్రీను), చిన్ననాటి స్నేహితురాలు సుబ్బలక్ష్మి (నయన్ సారిక)తో కలిసి పెళ్లి ఆపాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమయంలోనే వీరు సుబ్బలక్ష్మి ప్రేమలో పడతారు.

ఈ సమయంలోనే ఆ ఊరి సమీపంలో రాక్షస కోట నరబలి కోరడంతో అక్కడి గ్రామస్తులందరూ కలిసి ఒకరి పేరును ఖరారు చేస్తారు. మూడు సంకేతాల ఆధారంగా పేరును ఖరారు చేయడంతో వీరు కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. అలా కోటలోకి వెళ్లిన వీరు మళ్లీ తిరిగి వచ్చాడా? అతడిని కాపాడటం కోసం సుబ్బలక్ష్మి బాలు ఏం చేశారు? నిజంగానే ఆ కోటలో నరబలి కోరే రాక్షసుడు ఉన్నారా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: అఫీషియల్ శర్వానంద్ బైకర్ ఓటీటీ డేట్ లాక్…స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×