E-Paper
Advertisement

Tata Electric Scooter: ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ రేంజ్.. టాటా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వెనుక అసలు కథ ఇదే!

Tata Electric Scooter: ఒక్క ఛార్జ్ తో 200 కి.మీ రేంజ్.. టాటా బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ వెనుక అసలు కథ ఇదే!
Advertisement

Fact Check: ఇండియాలో టాటా కంపెనీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వినియోగదారులకు మన్నికైన వాహనాలను అందించే సంస్థగా దశాబ్దాలుగా పేరు సంపాదించుకుంది. ఇప్పటి వరకు వరకు ఈ కంపెనీ టూవీలర్స్ తయారీపై దృష్టి పెట్టలేదు. ఒకవేళ బైక్స్, స్కూటర్స్ తయారు చేస్తే, టాటా కార్ల మాదిరిగానే బైక్స్ విభాగంలోనూ మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది. కానీ, ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేస్తున్నట్లు కనిపించలేదు.

గత కొంతకాలంగా ఊహాగానాలు

గత కొంతకాలంగా టాటా మోటర్స్ టూవీర్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సరసమైన ధరల్లో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైకులను తీసుకురావాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా 125cc బైక్స్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, రోజువారీ ప్రయాణీకులను లక్ష్యంగా చేసుకుని ఈ బైక్స్ రూపొందించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ బైక్ ను టాటా క్లాసిక్ పేరుతో తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 2026 ఎండింగ్ లో లేదంటే 2027 ప్రారంభంలో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ బైక్ ను టాటా క్లాసిక్ 110, 120 మోడల్స్ లో తీసుకురావాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. 125 cc ఇంజిన్ తో రానున్న ఈ బైక్స్ ఏకంగా లీటర్ కు 90 కిలో మీటర్ల మైలేజీ వచ్చేలా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. స్మార్ట్ డిజిటల్ మీటర్, స్టైలిష్ డిజైన్ లాంటి ఆకర్షణలతో రానున్నట్లు తెలుస్తోంది. వీటి ధర కూడా సుమారు రూ. 40,000- 70,000 వరకు ఉంటుందని భావిస్తున్నారు.

ఎలక్ట్రిక్ బైక్స్ పైనా ఊహాగానాలు

Advertisement

ప్రస్తుతం మార్కెట్లోకి ఎక్కువగా ఎలక్ట్రిక్ బైక్స్ , స్కూటర్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో టాటా మోటార్స్ కూడా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులు, మహిళలకు ఉపయోగపడేలా బడ్జెట్ స్కూటర్ ను తీసుకురాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చూడ్డానికి స్టైలిష్ గా ఉండటంతో పాటు ఒక్క ఛార్జ్ పై ఏకంగా 200 కి.మీ వరకు రేంజ్ అందించనున్నట్లు కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాస్తున్నాయి.

Read Also: ఐకానిక్ RX100 వచ్చేస్తోంది సరికొత్తగా.. లాంచింగ్ ఎప్పుడంటే?

నిజంగానే టాటా మోటార్స్ మోటార్ సైకిల్స్ విభాగంలోకి వస్తుందా?

Advertisement

టాటా మోటార్స్ ప్రస్తుతం కార్లు, కమర్షియల్ వెహికిల్స్ తో బాగా పాపులర అయ్యింది. కానీ, బైక్ మార్కెట్లోకి వస్తుందా? లేదా? అనేది తెలియదు.  ఈ బైకులు నిజంగా లాంచ్ అవుతాయా? లేదా? అనే విషయంలో కచ్చితమైన సమాచారం లేదు. టాటా బైక్స్, స్కూటర్ల గురించి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలు మాత్రమే. ఇప్పటి వరకు టాటా మోటార్స్  టూవీలర్స్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. టాటా కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలు కేవలం ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. నిజంగానే టాటా మోటార్స్ టూవీలర్ రంగంలోకి అడుగు పెడితే ప్రస్తుతం ఉన్న కంపెనీలకు గట్టి పోటీ తప్పదని చెప్పుకోవచ్చు.

Read Also: దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న క్రేజీ యమహా బైక్స్.. లైనప్ చూస్తే అదిరిపోవాల్సిందే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×