Dhurandhar Song: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ( Bangladesh Cricket Team ) అంటే అందరికీ గుర్తుకు వచ్చేది నాగినీ ( Nagini Dance) డాన్స్. మ్యాచ్ విజయం సాధించినా, లేదా తమ క్రికెటర్లు వికెట్ తీసిన ప్లేయర్లు అందరూ నాగినీ డాన్స్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆ నాగినీ డాన్స్ కు బంగ్లాదేశ్ క్రికెటర్లు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా భారతీయ చిత్రం దూరందర్ సినిమాలోని పాటకు బంగ్లాదేశ్ అండర్ 19 క్రికెటర్లు తీన్మార్ స్టెప్పులు వేశారు. ఈ దురంధర్ సినిమాలో ( Dhurandhar Song) అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పాటకు బంగ్లాదేశ్ అండర్ 19 క్రికెట్ టీం ప్లేయర్లు (Bangladesh Under 19 Cricket Team ) చిందులు వేసి రచ్చ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మన శత్రువు కూడా ఇండియా పాట అంటే స్టెప్పులు వేయాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( ACC Mens U19 Asia Cup 2025) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటు లో ఆసియా ఖండానికి చెందిన జట్లన్నీ పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ అండర్ 19 ( Bangladesh U19 vs Sri Lanka U19, 11th Match, Group B ) జట్ల మధ్య నిన్న అంటే డిసెంబర్ 17వ తేదీన దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్ శ్రీలంక అండర్ 19 జట్టుపై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ అండర్ 19 ప్లేయర్లు ( Bangladesh Under 19 Cricket Team) ఎగిరి గంతేశారు.
ఇందులో భాగంగానే బాలీవుడ్ సినిమా దురంధర్ లోని అక్షయ్ ఖన్నా ఎంట్రీ పాటకు స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఆసియా కప్ అండర్ 19 2025 టోర్నమెంట్ లో భాగంగా గ్రూప్ బీలో బంగ్లాదేశ్ తో పాటు శ్రీలంక కూడా సెమీఫైనల్ కు క్వాలిఫై అయ్యాయి. ఇటు గ్రూప్ ఏ నుంచి టీమిండియా అండర్ 19, పాకిస్తాన్ అండర్ 19 జట్లు సెమీ ఫైనల్ కు దూసుకు వచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం సెమీ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది. అటు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!
Bangladesh Under 19 Cricket Team dances to Indian film Dhurandhar song FA9LA during Asia Cup Bangladesh Versus Srilanka match even as radical groups in Bangladesh issue threats against India. pic.twitter.com/NCrQVjCiFU
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 18, 2025