E-Paper
Advertisement

రూ.50 లక్షల్లో బెస్ట్ SUVలు.. ఈ టాప్ 5 మోడల్స్ మిస్ అవ్వకండి!

రూ.50 లక్షల్లో బెస్ట్ SUVలు.. ఈ టాప్ 5 మోడల్స్ మిస్ అవ్వకండి!
Advertisement

Top 5 SUVs Under Rs.50 Lakh in India: దేశీ కారు మార్కెట్ లో పలు లగ్జరీ SUV కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ. 50 లక్షల లోపు ఫుల్ సైజ్ SUV సెగ్మెంట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కేటగిరీలో కొనుగోలు దారులు కేవలం స్టైల్ మాత్రమే కాదు, పవర్, కంఫర్ట్, టెక్నాలజీని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లాడర్ ఫ్రేమ్ SUVలతో పాటు లేటెస్ట్ మోనోకోక్ మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కుటుంబ ప్రయాణాలు, హైవే డ్రైవింగ్, ఆఫ్ రోడింగ్ అవసరాలకు అనుకూలమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా రూ. 50 లక్షల్లోపు బెస్ట్ SUV కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ జీప్ మెరిడియన్: రూ. 23.33 లక్షల నుంచి..

జీప్ మెరిడియన్ ప్రీమియం ఫీల్‌ ను అందిస్తుంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో మంచి పవర్ ఇస్తుంది. అంతేకాకుండా, టచ్‌ స్క్రీన్, డిజిటల్ డిస్ప్లే, సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్లతో సౌకర్యవంతంగా ఉంటుంది. భద్రత పరంగా కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి.

⦿ స్కోడా కోడియాక్: రూ. 39.99 లక్షల నుంచి

Advertisement

స్కోడా కోడియాక్ 7-సీటర్ ప్రీమియం SUVగా మంచి పేరు తెచ్చుకుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మంచి పనితీరు ఇస్తుంది. ఇందులో పెద్ద టచ్‌ స్క్రీన్, మసాజ్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్ లాంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.AWD సిస్టమ్ వల్ల అన్ని రోడ్లపై సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

⦿ వోక్స్‌ వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్: రూ. రూ. 46.99 లక్షలు

స్పోర్టీ డిజైన్, మంచి పనితీరుతో ఆకట్టుకుంటుంది. ఇది కూడా 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో వస్తుంది. వేగంగా యాక్సిలరేషన్ ఇస్తుంది. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, హెడ్స్ అప్ డిస్ప్లే, ప్రీమియం సౌండ్ సిస్టమ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ADAS వంటి టెక్నాలజీ కూడా ఉంది.

⦿ టయోటా ఫార్చ్యూనర్: రూ. 34.76 లక్షల నుంచి

Advertisement

ఈ కారు భారత మార్కెట్లో మంచి ఆదరణ దక్కించుకుంది. బలమైన నిర్మాణం, విశ్వసనీయత కారణంగా ఎంతో మంది దీన్ని ఇష్టపడతారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉండటంతో పాటు 4×4 వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఆఫ్ రోడింగ్‌ కు కూడా బాగా సరిపోతుంది. లోపల అవసరమైన అన్ని ఫీచర్లు ఉన్నాయి.

⦿  ఎంజీ మెజెస్టర్: రూ. 45 లక్షలు

ఈ కొత్త SUV కూడా త్వరలో ఈ సెగ్మెంట్‌లోకి రానుంది. ఈ కారు గ్లోస్టర్ కంటే పెద్దది. మరింత ప్రీమియంగా ఉండేలా రూపొందిస్తున్నారు. 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్‌ తో పవర్ ఫుల్ గా ఉంటుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, మసాజ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ లాంటి లగ్జరీ ఫీచర్లు అందులో ఉంటాయి. ఆఫ్ రోడింగ్ కోసం 4WD ఆప్షన్ కూడా ఉంటుంది.

Read Also:

కారు మెయింటెనెన్స్ లో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే, మీ కారు ఔట్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×