E-Paper
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ బిగ్ ప్లాన్స్.. ఈ ఏడాదిలో ఏకంగా 5 కొత్త బైక్‌లు వచ్చేస్తున్నాయ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బిగ్ ప్లాన్స్.. ఈ ఏడాదిలో ఏకంగా 5 కొత్త బైక్‌లు వచ్చేస్తున్నాయ్!
Advertisement

Upcoming Royal Enfield Bikes 2026: కొనుగోలుదారులకు రాయల్ ఎన్‌ ఫీల్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నైకి చెందిన ఈ ప్రముఖ కంపెనీ భారత మార్కెట్‌ లో పలు కొత్త బైక్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ లాంచ్‌లలో 650cc, 750cc ఇంజన్‌లతో వచ్చే మోడళ్లతో పాటు ఒక ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉంది. కొత్త టెక్నాలజీ, మెరుగైన పనితీరు, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌లు మార్కెట్‌ లో సత్తా చాటబోతున్నాయి. ఇంతకీ ఆ 5 మోడల్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ ఫ్లయింగ్ ఫ్లీ S6

రాయల్ ఎన్‌ ఫీల్డ్  మొదటగా ఫ్లయింగ్ ఫ్లీ S6 అనే ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ బైక్ ను విడుదల చేయనుంది. ఇది సిటీ ప్రయాణంతో పాటు తేలికపాటి ఆఫ్ రోడింగ్‌ కు సరిపడేలా డిజైన్ చేస్తున్నారు. పెద్ద చక్రాలు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ లాంటి ఫీచర్లు దీనిలో ఉండనున్నాయి. ఆధునిక ఎలక్ట్రానిక్స్, ట్రాక్షన్ కంట్రోల్, ABS లాంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉంటాయి. దీని ధర సుమారు రూ. 3 నుంచి 4 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

⦿ బుల్లెట్ 650

Advertisement

ఆ తర్వాత బుల్లెట్ 650 రాబోతోంది. క్లాసిక్ లుక్‌ను ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది. ప్రస్తుతం ఉన్న బుల్లెట్ డిజైన్‌ను కొనసాగిస్తూ, పెద్ద 650cc ఇంజన్‌ను జోడించనున్నారు. ఈ ఇంజన్ మంచి పవర్, టార్క్‌ ను ఇస్తుంది. పాత స్టైల్‌ తో కొత్త పనితీరును కలిపిన ఈ బైక్ ధర సుమారు రూ. 3.5 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

⦿ హిమాలయన్ 750

అడ్వెంచర్ బైక్‌లలో ఆసక్తి ఉన్నవారికి హిమాలయన్ 750 బాగా నచ్చుతుంది. ఇది పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారవుతూ, పెద్ద 750cc ఇంజన్‌ తో రానుంది. ఈ బైక్ సుదూర ప్రయాణాలు, కఠినమైన ఆఫ్ రోడింగ్‌ కు అనుకూలంగా రూపొందిస్తున్నారు. మెరుగైన సస్పెన్షన్, బలమైన ఛాసిస్‌ తో ఇది ఫ్లాగ్‌ షిప్ మోడల్‌ గా నిలుస్తుంది. దీని ధర రూ. 4- 4.5 లక్షల మధ్య ఉంటుంది.

⦿ కాంటినెంటల్ GT-R 750

Advertisement

ఇక కాంటినెంటల్ GT-R 750 అనే కేఫ్ రేసర్ కూడా రానుంది. ఇది స్పోర్టీ లుక్‌తో పాటు మంచి పనితీరు అందిస్తుంది. కొత్త డిజైన్, డ్యూయల్ డిస్క్ బ్రేకులు, మెరుగైన కంట్రోల్‌తో ఈ బైక్ యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇదే 750cc ఇంజన్‌తో రానున్న ఈ మోడల్ ధర కూడా రూ. 4 లక్షల పరిధిలో ఉండవచ్చు.

⦿ ఇంటర్‌సెప్టర్ 750 రోడ్‌స్టర్

చివరిగా ఇంటర్‌సెప్టర్ 750 రోడ్‌స్టర్ బైక్ కూడా మార్కెట్లోకి రానుంది. ఇది సింపుల్ డిజైన్‌తో పాటు మంచి కంఫర్ట్, పనితీరును అందిస్తుంది. అదే 750cc ఇంజన్‌ను ఉపయోగిస్తూ, మెరుగైన బ్రేకింగ్, సస్పెన్షన్ సిస్టమ్‌ తో వస్తుంది. దీని ధర సుమారు రూ. 3.8 నుండి 4.3 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Read Also: మారుతి To టాటా.. FY26 అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 10 మోడళ్లు ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×