E-Paper
Advertisement

సింహాచలం అప్పన్న చందనోత్సవం సందడి..టికెట్ల విక్రయంలో గందరగోళం, భక్తులు తీవ్ర ఆగ్రహం

సింహాచలం అప్పన్న చందనోత్సవం సందడి..టికెట్ల విక్రయంలో గందరగోళం, భక్తులు తీవ్ర ఆగ్రహం
Advertisement

Simhachalam Chandanotsavam: సింహాచలంలో అప్పన్న చందనోత్సవం సందడి మొదలైంది. చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకుని మహా వేడుకను దేవస్థానం శాస్త్రోక్తంగా చేస్తోంది. చందనోత్సవం మాట ఏమోగానీ టికెట్ల విక్రయాలలో గందరగోళం పరిస్థితి నెలకొంది. దీంతో అప్పన్న భక్తులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి.

సింహాచలం అప్పన్న చందనోత్సవం సందడి

Advertisement

సింహాచలం అప్పన్న చందనోత్సవం సందడి మొదలైంది. ప్రతీ ఏటా చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తోంది. ఏడాది పొడవునా స్వామి గంధపు పూతతో సింహాచలం అప్పన్న భక్తులకు దర్శనమిస్తారు. ఒక్కసారి మాత్రమే స్వామి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎగబడతారు.

సింహాచలం అప్పన్న చందనోత్సవం టికెట్ల విక్రయాలలో గందరగోళం ఏర్పడింది. రూ.300, 1000 టికెట్ల కోసం భక్తులు బ్యాంకుల వద్ద ఉదయం 6 గంటల నుండి పడిగాపులు కాసినా నిరాశ ఎదురైంది. కేవలం 10 నిమిషాల్లో టికెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఆప్‌లైన్ టికెట్లను విక్రయించినట్టు బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

టికెట్ల విక్రయంలో గందరగోళం, భక్తులు తీవ్ర కష్టాలు

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దర్శనం టిక్కెట్లు విక్రయిస్తామని ప్రకటన చేసింది. దీంతో బ్యాంకు దగ్గర బోర్డులు చూసి ఆందోళన చెందుతున్నారు భక్తులు. చందనోత్సవం టికెట్ల అమ్మకాల్లో బ్యాంకు సిబ్బంది విరుద్ధంగా వ్యవహారిస్తున్నారన్న వాదన సైతం లేకపోలేదు.

టికెట్ల విక్రయాల విషయంలో బ్యాంకు వ్యవహారంపై సింహాచలం దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు భక్తులు. కొన్ని నిమిషాల్లో టికెట్లు అమ్మకాలు పూర్తికావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఆన్ లైన్‌లో టికెట్ల అమ్మకాలకు సర్వర్ల సమస్యగా మారింది. దీంతో బ్యాంకుల వద్ద బారులు తీరారు భక్తులు.

ALSO READ: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్.. రికార్డు స్థాయికి చేరుతున్న ఎండలు!

గతేడాది చందనోత్సవం సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు చనిపోయిన విషయం తెల్సిందే. టికెట్ల అమ్మకాల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. స్వామి నిజరూప దర్శన భాగ్యం కల్పించాలని కోరుతున్నారు భక్తులు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×