E-Paper
Advertisement

టాటా vs మహీంద్రా.. 2026లో లాంచ్ కాబోయే టాప్ SUVలు ఇవే!

టాటా vs మహీంద్రా.. 2026లో లాంచ్ కాబోయే టాప్ SUVలు ఇవే!
Advertisement

Top Upcoming SUVs in India 2026: ఈ ఏడాది భారతీయ ఆటో మార్కెట్‌ మరో లెవల్ కు చేరబోతోంది. గతంతో పోల్చితే మరింత విస్తరించబోతోంది. ముఖ్యంగా టాటా మోటార్స్, మహీంద్రా లాంటి కంపెనీలు కొత్త SUVలు, EVలు, అప్‌ డేట్ అయిన మోడళ్లను పెద్ద సంఖ్యలో లాంచ్ చేయబోతున్నాయి. ఈ వాహనాల పనితీరు, టెక్నాలజీ, ఫీచర్ల పరంగా వినియోగదారులను ఆకట్టుకోబోతున్నాయి.

టాటా మోటార్స్ నుంచి లాంచ్ కాబోయే మోడల్స్

⦿ సియెర్రా EV:  టాటా మోటార్స్ నుంచి సియెర్రా EV ముందుగా విడుదల కాబోతోంది. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ లైనప్‌ లో మంచి స్థానాన్ని దక్కించుకోనుంది. కర్వ్ EV, హారియర్ EV మధ్యలో ఉండే ఈ SUV, మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ లో పోటీ పడుతుంది. డిజైన్ పరంగా ఇది ప్రత్యేకంగా కనిపించేలా తయారు చేస్తున్నారు. లోపల ట్రిపుల్ స్క్రీన్ సెటప్, ప్రీమియం ఆడియో, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. సుమారు 600 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా.

Advertisement

⦿ టాటా సఫారీ EV: మూడు వరుసల సీట్లతో వచ్చే ఈ SUV కుటుంబ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పెద్ద బ్యాటరీ ఆప్షన్లతో వస్తుందని, మంచి రేంజ్ ఇవ్వనుంది.

⦿ అవిన్యా: టాటా మరో కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ బ్రాండ్ అవిన్యాను విడుదల చేయబోతోంది. ఇందులో భాగంగా వచ్చే అవినయ SUV లగ్జరీ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తుంది. పెద్ద బ్యాటరీలు, ఫాస్ట్ ఛార్జింగ్, విస్తృతమైన క్యాబిన్ స్పేస్ చాలా అనుకూలంగా ఉంటుంది. ధర కూడా ప్రీమియం రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా నుంచి లాంచ్ కాబోయే మోడల్స్

Advertisement

⦿ స్కార్పియో-N ఫేస్‌లిఫ్ట్: మహీంద్రా నుంచి వచ్చే క్రేజీ మోడల్ ఇది.  బయట డిజైన్‌ లో స్వల్ప మార్పులు, లోపల కొత్త ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. పనోరమిక్ సన్‌ రూఫ్, పెద్ద టచ్‌ స్క్రీన్, ADAS లాంటి ఆధునిక సాంకేతికతలను చేర్చే అవకాశం ఉంది. అయితే ఇంజన్ పరంగా పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. స్కార్పియో క్లాసిక్ కూడా అప్‌డేట్ అవుతోంది. దీనిలో డిజైన్ మరింత మోడర్న్ గా మారే అవకాశం ఉంది. క్యాబిన్‌ లో సౌకర్యాలు పెరగనున్నాయి. ఇదే సమయంలో, మహీంద్రా థార్ కూడా మరో అప్‌డేట్‌కు సిద్ధమవుతోంది. కొత్త డిజైన్ ఎలిమెంట్స్, మెరుగైన ఫీచర్లతో ఇది మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.

ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో మహీంద్రా BE6, XEV 9e మోడళ్లకు కొత్త 70kWh బ్యాటరీ ఆప్షన్ ఇవ్వనున్నారు. ఇది వినియోగదారులకు సరసమైన ధరలో మంచి రేంజ్ అందించే మిడ్ రేంజ్ SUVగా నిలువనుంది. మొత్తంగా 2026లో టాటా, మహీంద్రా కంపెనీలు కొత్త టెక్నాలజీ, మెరుగైన డిజైన్, అధునాతన ఫీచర్లతో SUV మార్కెట్‌ లో గట్టిగా పోటీ పడబోతున్నాయి.

Read Also: మారుతి To టాటా.. FY26 అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 10 మోడళ్లు ఇవే!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×