Ram Pothineni: పదవ తరగతి , ఇంటర్మీడియట్ ప్రథమ , ద్వితీయ ఫలితాలు విద్యార్థులకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే పదవ తరగతి రిజల్ట్స్ వచ్చే సమయంలో లేదా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చే సమయంలో విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారు అని కొంతమంది నిబంధనలు కూడా చెబుతున్నారు.. నిజానికి మార్కులు రావేమో అని భయపడి ముందుగానే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ తర్వాత వారికి వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఆ బాధ వర్ణనాతీతం.. మరికొంతమంది మార్కులు తక్కువగా వచ్చాయని.. మరి కొంతమంది ఫెయిల్ అయ్యామని ఇలా తనువు చాలిస్తున్న విషయం తెలిసిందే.
అందుకే ఫలితాలు వెలువడే ముందు, వచ్చిన తర్వాత ప్రముఖులు , విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. మార్పులే జీవితం కాదు అని , ఒకసారి తప్పితే మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు అనే భరోసా ఇస్తున్నారు.. అయితే విద్యార్థులు మాత్రం ఫెయిల్ అయితే ఎక్కడ ఇంట్లో తల్లిదండ్రులు తిడతారేమో.. సమాజంలో అవమానాలు ఎదుర్కోవాలేమో అనే ఆలోచనతో ఇలా తనువు చాలించడానికి సిద్ధమవుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది . ఇకపోతే మొన్న తెలంగాణలో నేడు ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మరొకసారి గతంలో రామ్ పోతినేని ఇంటర్ విద్యార్థులను, వారి మార్కులను ఉద్దేశించి చేసిన పోస్ట్ మళ్ళీ వైరల్ గా మారింది.
ఇకపోతే ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రామ్ పోతినేని గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది. ఆయన తన ట్వీట్ ద్వారా..” ఇంటర్ మార్కులే జీవితం కాదు.. నేను ఇంటర్ కూడా పూర్తి చేయలేదు. మీరు సాధించబోయే గొప్ప విజయాల ముందు ఇదొక చిన్న విషయం మాత్రమే. అందుకే ఫెయిల్ అయ్యామని బాధపడకుండా లైట్ తీసుకోండి ” అంటూ రామ్ విద్యార్థులలో ధైర్యం నింపారు. మార్కులే భవిష్యత్తును నిర్ణయించవని.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది” అంటూ ఆయన విద్యార్థులకు సూచించారు.ఇక ప్రస్తుతం రామ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read:గాయపడ్డ మెగా హీరో.. నేడే సర్జరీ!
స్రవంతి రవి కిషోర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. ఇటీవల ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కథ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను అందుకోలేక పోయింది ఈ సినిమా. దీంతో ఆయన వ్యక్తిగత జీవిత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా .. తన పెళ్లిపై ఊహించని కామెంట్లు చేశారు. “ఏకాంతం నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఎవరైనా నా జీవితంలోకి వస్తే వారితో గడపడానికి కూడా నేను సిద్ధమే.. ఎవరూ రాకపోయినా ఒంటరిగా మరింత సంతోషంగా ఉండగలను” అంటూ రామ్ తెలిపారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక దర్శకుడితో రామ్ తన కొత్త ప్రాజెక్టును రూపొందించడానికి సిద్ధమైనట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.