E-Paper
Advertisement

Harley Davidson X440T: హ్యార్లీ డేవిడ్సన్ నుంచి సరికొత్త బైక్, క్లాసిక్ రెట్రో లుక్‌ తో పిచ్చెక్కిస్తోందిగా!

Harley Davidson X440T: హ్యార్లీ డేవిడ్సన్ నుంచి సరికొత్త బైక్, క్లాసిక్ రెట్రో లుక్‌ తో పిచ్చెక్కిస్తోందిగా!
Advertisement

Harley Davidson X440T Launch: హ్యార్లీ డేవిడ్సన్ కంపెనీ మరో క్రేజీ బైక్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది.  X440 సిరీస్‌ లో భాగంగా X440T అనే కొత్త, స్పోర్టీ వేరియంట్ ను విడుదల చేయబోతోంది. ప్రీమియం లుక్, ఇంప్రూవ్డ్ ఫీచర్స్‌ తో బైక్ లవర్స్ ముందుకు రానుంది. Hero MotoCorpతో కలిసి డెవలప్ చేసిన ఈ బైక్.. ఇండియాలో డిసెంబర్ 6కి లాంచ్ కానుంది. ఇది క్రూజర్ స్టైల్‌ లో ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కాంపిటీటర్ కాబోతోంది. X440T స్పెసిఫికేషన్స్ ఇంకా ఫుల్‌గా రివీల్ కాలేదు. కానీ, ఇది స్టాండర్డ్ X440తో దాదాపు సమానమైనది ఫీచర్లను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది.

హ్యార్లీ డేవిడ్సన్ X440T స్పెసిఫికేషన్స్

X440Tలో మెయిన్ ఎంజిన్, బ్రేక్స్ సహా పలు స్పెసిఫికేషన్లు X440తో సమానంగా ఉంటాయి.  440cc సింగిల్ సిలిండర్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ (BS6 Phase 2) ఇంజిన్ తో రానుంది. 27 bhp, 6000 rpm పవర్ ను అందిస్తుంది. 38 Nm, 4000 rpm టార్క్ ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్ ను కలిగి ఉంటుంది.  లీటర్ కు మైలేజ్ 32-35 కిలో మీటర్లు రానుంది. ఫ్యూయల్ ట్యాంక్ స్టోరేజ్ 13.5 లీటర్స్ ఉంటుంది. సీట్ హైట్ 805 mmతో కంఫర్టబుల్ రైడర్ పొజిషన్ ను కలిగి ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్170 mmగా ఉంటుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 320 mm డిస్క్, రియర్ 240mm డిస్క్ ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే.. ఫ్రంట్ KYB USD 43mm  ఫోర్క్స్, రియర్ ట్విన్ షాక్స్ ఉంటాయి.

హ్యార్లీ డేవిడ్సన్ X440T  ఫీచర్స్

Advertisement

⦿ డిజైన్ & స్టైలింగ్: క్లాసిక్ రెట్రో లుక్‌తో టర్టల్ ట్యాంక్, వైడ్ హ్యాండిల్‌బార్స్ ఉంటాయి. X440Tలో మరింత స్పోర్టీ స్టాన్స్, బార్ ఎండ్ మిర్రర్స్, మస్కులర్ స్టైలింగ్ ఉంటుంది. LED హెడ్‌ ల్యాంప్, LED టైల్‌ లైట్, ఇండికేటర్స్ ఉంటాయి.

⦿ సేఫ్టీ: కార్నరింగ్ రైడర్ సేఫ్టీ, స్విచబుల్ డ్యూయల్-చానల్ ABS. లీన్ యాంగిల్ 36 డిగ్రీల వరకు ఉంటుంది.

Advertisement

⦿ టెక్నాలజీ: 3.5-ఇంచ్ TFT డిస్‌ ప్లే, గేర్ ఇండికేటర్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీకి అనుగుణంగా ఉంటుంది. రైడ్ బై వైర్ థ్రాటిల్, రైడింగ్ మోడ్స్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్. USB 2A క్విక్ చార్జ్ అవకాశం ఉంటుంది.

⦿ పర్ఫార్మెన్స్: లో మిడ్ రేంజ్ టార్క్ వల్ల సిటీ,  హైవే రైడింగ్‌ కు అనుగుణంగా ఉంటుంది. 100-120 kmph దగ్గర స్మూత్ క్రూజింగ్, ఎంజిన్ బ్రేకింగ్ సిస్టమ్ బాగుంది.

హ్యార్లీ డేవిడ్సన్ X440T ధర ఎంత అంటే?

⦿  ఎక్స్ షోరూమ్ ధర: ఇండియాలో X440Tకి రూ.2.90 లక్షల – రూ. 3.10 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ ఆన్ రోడ్ ధర: రూ. రూ.3.20-3.50 లక్షలు వరకు (ఇన్సూరెన్స్, RTO ఇన్‌క్లూడ్) ఉంటుంది.

⦿ కలర్స్: బ్లాక్, రెడ్, సిల్వర్ సహా 7 కలర్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానుంది.

Read Also: వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650, ధర కూడా తక్కువేనండోయ్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×