E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీలోకి ఈ వారం కొత్త సినిమాలు.. హర్రర్ థ్రిల్లర్ల నుంచి కామెడీ వరకు చూడాల్సినవి ఇవే

OTT Movie : ఓటీటీలోకి ఈ వారం కొత్త సినిమాలు.. హర్రర్ థ్రిల్లర్ల నుంచి కామెడీ వరకు చూడాల్సినవి ఇవే
Advertisement

OTT Movie : ఓటీటీలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు, థియేటర్లలో దుమ్ములేపిన దమ్మున్న సినిమాలు వస్తున్నాయి. రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నుండి ప్రణవ్ మోహన్‌లాల్ ‘డైస్ ఇరే’ లాంటి సినిమాలు, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు మిమ్మల్ని కదలనీయకుండా చేస్తాయి.
ఈ సినిమాలను వీకెండ్ లో ఫ్యామిలీతో చూసి, మరచిపోలేని అనుభూతిని పొందండి. ఇవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి ? వాటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

‘డైస్ ఐరే’ (Dies Irae)

ఈ మలయాళ సైకలాజికల్ హారర్ చిత్రంలో ఒక యంగ్ మ్యాన్ ఇంట్లో పేరానామల్ యాక్టివిటీస్‌ ని ఎదుర్కొంటాడు. తన మాజీ ప్రియురాలు కని ఆత్మహత్య చేసుకుని మరణించిన తర్వాత అతని జీవితం భయంకరమైన గందరగోళంలో పడుతుంది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్ లో ప్రణవ్ మోహన్‌లాల్, షైన్ టామ్ చాకో, సుష్మితా భట్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2025డిసెంబర్ 5 నుంచి Jio hotstar లో మలయాళం, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ డబ్బింగ్ తో అందుబాటులో ఉంటుంది.

‘స్టీఫన్’ (Stephen)

Advertisement

సీరియల్ కిల్లర్ మైస్టరీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ థీమ్స్ తో వచ్చిన ఈ తమిళ సినిమా, థ్రిల్లర్ ఫ్యాన్స్ కి బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. గోమతి శంకర్, మైఖేల్ తంగడురై, స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా మిథున్ బాలాజీ డైరెక్షన్ లో రూపొందింది. ఈ సినిమా 2025 డిసెంబర్ 5నుంచి Netflixలో తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. .

‘పరియా’ (Pariah)

2024లో విడుదలైన ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఒక ఒంటరి వ్యక్తి తాను పెంచుకున్న వీధి కుక్కపిల్ల తప్పిపోయిన తర్వాత పెద్ద ఎత్తున కుక్కల ఇల్లెగల్ డాగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లోకి ఎంటర్ అవుతాడు. ఆతరువాత రివెంజ్ థీమ్‌ తో వయలెన్స్ గట్టిగానే ఉంటుంది. విక్రమ్ చటర్జీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకి తథాగత ముఖర్జీ దర్శకత్వం వహించారు. 2025 డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది.

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre-Wedding Show)

Advertisement

ఈ స్టోరీ ఒక గ్రామీణ ఫోటోగ్రాఫర్ ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తుండగా మెమరీ కార్డ్ మిస్ అవుతుంది. దీంతో అతని జీవితం గందరగోళంలో పడుతుంది. దాని నుంచి మొదలయ్యే కామెడీ కన్ఫ్యూషన్‌లు, ఫ్యామిలీ డ్రామా, రియల్ లైఫ్ ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతుంది. థిరువీర్, టిను శ్రావ్య లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందింది. ఈ మూవీ 2025 డిసెంబర్ 5 నుంచి ZEE5 లో అందుబాటులో ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ సినిమా, వీకెండ్‌లో రిలాక్స్ అయ్యేందుకు పెరఫక్ట్ గా ఉంటుంది.

‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend)

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ 2025లో రష్మిక మందన్న, ధీక్షిత్ శెట్టి జంటగా నటించిన తెలుగు చిత్రం.
ఈ కథ టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకున్న ఒక యంగ్ గర్ల్ చుట్టూ తిరుగుతుంది. ఎమోషనల్ స్ట్రగుల్స్, హార్ట్‌టచింగ్ క్లైమాక్స్‌తో నడిచే ఈ సినిమా రిలేషన్‌షిప్ డ్రామా లవర్స్‌కు బాగా సూట్ అవుతుంది. ఈ సినిమా 2025డిసెంబర్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

 

Read Also : ఇదేం ఫ్యామిలీ భయ్యా ఇలా ఉంది… ఇంటికొచ్చిన కోడలిపై ఒక్కొక్కరూ… మామూలు స్టోరీ కాదు

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×