E-Paper
Advertisement

ఒకటి కాదు రెండు కాదు.. మార్కెట్ ను షేక్ చేయబోతున్న10 క్రేజీ బైక్స్!

ఒకటి కాదు రెండు కాదు.. మార్కెట్ ను షేక్ చేయబోతున్న10 క్రేజీ బైక్స్!
Advertisement

Top Bikes Launching in India May 2026: మేలో బైక్ మార్కెట్ కు మరింత జోష్ రానుంది. స్పోర్ట్స్, అడ్వెంచర్, క్రూయిజర్ సెగ్మెంట్లలో కొత్త మోడల్స్ విడుదల కాబోతున్నాయి. పలు టాప్ బ్రాండ్స్ వీటిని లాంచ్ చేబోతున్నాయి. యూత్ నుంచి మొదలుకొని ప్రీమియం రైడర్ల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఈ బైక్‌లను డిజైన్ చేస్తున్నారు. స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ ఇంజిన్, కొత్త టెక్నాలజీతో కలిపి మార్కెట్లో తమంటూ ఓ గుర్తింపు తెచ్చుకోబోతున్నాయి. వాటిలో కొన్ని టాప్ మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ హీరో కరిజ్మా XMR 250

ప్రస్తుతం భారత్ లో హీరో కరిజ్మా XMR 250పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ బైక్ మే చివర్లో మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. స్టైలిష్ డిజైన్‌తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ మోడల్ ధర సుమారు రూ.2 లక్షల నుంచి రూ. 2.2 లక్షల మధ్య ఉంటుంది. యంగ్ రైడర్లను ఆకట్టుకునేలా కంపెనీ దీన్ని రూపొందిస్తోంది.

⦿ యెజ్డీ రోడ్‌కింగ్

Advertisement

యెజ్డీ రోడ్‌ కింగ్ క్లాసిక్ స్టైల్‌ తో పాటు ఆధునిక ఫీచర్లను కలిపి తయారు చేస్తున్నారు. దీని ధర రూ. 2.20 లక్షల నుంచి రూ. 2.29 లక్షల వరకు ఉంటుంది. క్రూయిజర్ బైక్‌ లను ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్‌ కానుంది.

⦿ KTM RC 350, 390 SMC R

స్పోర్ట్స్ బైక్ లను ఇష్టపడే వారికి KTM RC 350, 390 SMC R మోడళ్లు నచ్చుతాయి. ఈ బైక్‌ లు స్పీడ్, కంట్రోల్, రేసింగ్ ఫీల్ కోసం రూపొందించారు. వీటి ధరలు సుమారు రూ. 2.9 లక్షల నుంచి రూ. 3.6 లక్షల వరకు ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయంలో KTM బ్రాండ్ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

⦿ ట్రయంఫ్ ట్రైడెంట్ 800

Advertisement

ప్రీమియం సెగ్మెంట్‌ లో ట్రయంఫ్ ట్రైడెంట్ 800 ఒకటి కానుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 11.5 లక్షలు ఉంటుందని  భావిస్తున్నారు. పవర్ ఫుల్ ఇంజిన్‌ తో పాటు ప్రీమియం ఫీచర్లు ఈ మోడల్ ఆకట్టుకుంటాయి.

⦿ బజాజ్ పల్సర్ NS150

బడ్జెట్ సెగ్మెంట్‌లో బజాజ్ పల్సర్ NS150 రానుంది. సుమారు రూ. 1.22 లక్షల ధరతో ఇది మార్కెట్లోకి రానుంది.  రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ బైక్, యువతను ఆకట్టుకోనుంది.

⦿ నార్టన్ V4

ఇక నార్టన్ V4 పూర్తిగా ప్రీమియం రేంజ్‌ లో వస్తుంది. దీని ధర రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుంది. హై ఎండ్ పనితీరు, లగ్జరీ ఫీచర్లతో ఈ బైక్ ఆకట్టుకుంటుంది.

ఇవే కాకుండా  మరికొన్ని మోడళ్లు కూడా త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.  ఏప్రిలియా టువారెగ్ 457 విడుదల ఈ నెలలోనే విడుదల కానుంది. దీని ధర రూ. 4.5 లక్షల నుంచి రూ. 4.8 లక్షల మధ్య ఉంటుంది. అటు బ్రిక్స్‌ టన్ క్రాస్‌ ఫైర్ 500 స్టోర్ కూడా విడుదలకు రెడీ అవుతోంది. జూన్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. క్లాసిక్ డిజైన్‌తో పాటు పవర్ ఫుల్ ఇంజిన్ తో ఆకట్టుకోనుంది. దీని ధర సుమారు రూ. 2.8 లక్షల నుంచి రూ.3.4 లక్షల మధ్య ఉంటుంది.

Read Also: మతిపోగొట్టే రేంజ్.. సూపర్ లుక్.. మేలో రిలీజయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×