E-Paper
Advertisement

Honda Dio 125 X-Edition: హోండా డియో 125 X-ఎడిషన్ లాంచ్, ఫీచర్లు అదుర్స్ అంతే!

Honda Dio 125 X-Edition: హోండా డియో 125 X-ఎడిషన్ లాంచ్, ఫీచర్లు అదుర్స్ అంతే!
Advertisement

Honda Dio 125 X-Edition Scooter Unveiled: ఆటో మోబైల్ దిగ్గజం హోండా నుంచి మరో అదిరిపోయే స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. డియో 125 X-ఎడిషన్ పేరుతో  కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఈ వేరియంట్‌  కొత్త కలర్ స్కీమ్స్ తో అందుబాటులోకి రానున్నాయి. ఈ కలర్స్ స్కూటర్‌కు మరింత షార్ప్ లుక్ ను అందిస్తున్నాయి. ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

కొత్త కలర్ వేరియంట్స్

ఈ స్కూటర్ పెర్ల్ సైరన్ బ్లూ, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్ స్కీమ్స్ లో అందుబాటులోకి రానుంది. ఇది ఫంకీ లివరీలతో కూడిన డ్యూయల్ టోన్ డార్క్ బ్లూ, గ్రే కలర్ స్కీమ్ ను కలిగి ఉంటుంది. రెడ్ కలర్ పెయింట్ చేయబడిన రిమ్‌లు బాడీ కలర్ కు ఆపోజిట్ లో ఆకట్టుకుంటున్నాయి. చూపరులు బాగా ఆకట్టుకుంటాయి. కొత్త పెయింట్ స్కీమ్ అదుర్స్ అనిపిస్తుంది.  డియో 125  స్పోర్టీ లుక్‌ను మరింత పెంచుతుంది.

డియో 125 X-ఎడిషన్ ఫీచర్లు

Advertisement

డియో 125 X-ఎడిషన్  కాస్మెటిక్ ఛేంజెస్ తో పాటు ఫీచర్ల పరంగా హోండా డియో 125 H స్మార్ట్ లాగానే ఉంటుంది. ఇందులో కాల్, SMS అలర్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్ కోసం స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీతో TFT కన్సోల్‌ను కలిగి ఉంటుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్‌ ను ఛార్జ్ చేసుకోవడానికి USB C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. 190 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫోర్కులు, 171 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.

డియో 125 X-ఎడిషన్ ఇంజిన్ గురించి..

డియో 125 X-ఎడిషన్ H స్మార్ట్ మాదిరిగానే 123.92cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 8.19bhp పవర్, 10.5Nm ఉత్పత్తి చేస్తుంది. త్వరలోనే ఈ స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. డియో 125 X-ఎడిషన్ ఇంచుమించు  50 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని భావిస్తున్నారు. 5.3 లీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: స్కోడా కైలాక్ సరికొత్త రికార్డు, 50 వేల యూనిట్ల మార్క్ క్రాస్!

డియో 125 X-ఎడిషన్ ధర ఎంత అంటే?

డియో 125 X-ఎడిషన్ ధర సుమారు రూ. 93,000 నుంచి రూ. 93,500 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. ఆన్ రోడ్ ధర మరికాస్త ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ఏ స్కూటర్లతో పోటీ పడుతుందంటే?

డియో 125 X-ఎడిషన్.. TVS NTORQ 125, యమహా రేజెడ్ఆర్ 125 ఫై హైబ్రిడ్, సుజుకి అవెనిస్ 125, హీరో జూమ్ 125, అప్రిలియా SR 125 లాంటి స్కూటర్లతో పోటీ పడనుంది.

Read Also: వెస్పా 946 హార్స్ ఎడిషన్ లాంచ్, లుక్ చూస్తే మతిపోతోంది బ్రో!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×