E-Paper
Advertisement

Mini Medaram Jatara: మినీ మేడారంలో కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్, అరెస్ట్ చేసిన పోలీసులు

Mini Medaram Jatara: మినీ మేడారంలో కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్, అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement

Mini Medaram Jatara: కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో జరుగుతున్న ‘మినీ మేడారం’ జాతరలో పాడి కౌశిక్ రెడ్డికి తీవ్ర అవమానం జరిగింది. సమ్మక్క, సారలమ్మను కుటుంబంతో కలిసి దర్శించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత ఆయనను కారులో ఎక్కించుకుని కరీంనగర్ తరలించారు. ఈ వివాదంపై నిర్వాహకులు, యుప్ టీవీ (YuppTV) సీఈవో ఉదయనందన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు.

పూర్తి సమాచారంలోకి వెళితే..
వీణవంక మినీ మేడారం జాతరకు దాదాపు 50 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 1976వ సంవత్సరంలో ఉదయనందన్ రెడ్డి తాతగారు పాడి సుధాకర్ రెడ్డి ఈ జాతరను ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు ఈ వేడుకలు వారి కుటుంబ పర్యవేక్షణలోనే నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతీయ పండుగ మాత్రమే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చే అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర కోసం విదేశాల్లో స్థిరపడిన తమ కుటుంబ సభ్యులంతా వీణవంకకు చేరుకుని, సొంత ఖర్చులతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని ఉదయనందన్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

అయితే ఈ జాతర నిర్వహణ విషయంలో గత కొంతకాలంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తున్నారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది కూడా జాతరను అడ్డుకోవాలని చూసిన నేపథ్యంలో, తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని ఆయన పేర్కొన్నారు. జాతరను శాంతియుతంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, ఎమ్మెల్యే ప్రోటోకాల్ పేరుతో గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ కోర్టు ఆదేశాల ప్రకారమే తమకు భద్రత కల్పించారని, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిపై ఉంటుందని గుర్తుచేశారు.

అంతేకాకుండా.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన తాత పేరును వాడుకోవడంపై ఉదయనందన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “పాడి సుధాకర్ రెడ్డి గారు మా తాత. కౌశిక్ రెడ్డి తాత పేరు రఘుపతి రెడ్డి. వారిద్దరూ అన్నదమ్ములు కూడా కాదు” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం లేదా జాతర క్రెడిట్ కోసం తన తాత పేరును వాడుకోవద్దని, ఒకవేళ భవిష్యత్తులో పాడి సుధాకర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సొంత వారసత్వాన్ని చెప్పుకోవాలి కానీ, ఇతరుల మూలాలను వాడుకోవడం అన్యాయమని హితవు పలికారు.

Advertisement

జాతర సందర్భంగా విధుల్లో ఉన్న పోలీస్ అధికారుల పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును ఉదయనందన్ రెడ్డి తప్పుబట్టారు. సాక్షాత్తు సీపీని మతం పేరుతో దూషించడం, మహిళా ఏసీపీని అనరాని మాటలు అనడం ప్రజాస్వామ్యంలో గర్హనీయమని మండిపడ్డారు. అధికార గర్వంతో అధికారులను భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, కోర్టు దిక్కరణకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

అలాగే జాతరలో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. సమ్మక్క-సారలమ్మ దేవతలు గద్దెలకు వస్తున్న సమయంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఇంటి ముందు ఆగిందని, కానీ దేవతలు రాకముందే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గద్దెపైకి వెళ్లి హడావుడి చేశారని ఆరోపించారు. వీణవంక సర్పంచ్‌ను కూడా గౌరవప్రదంగా ఆహ్వానించామని, తాము ఎవరినీ అవమానించలేదని వివరించారు. జాతర విజయవంతం అవుతుండటాన్ని కౌశిక్ రెడ్డి సహించలేక గొడవలు చేస్తున్నారని ఉదయనందన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు, కంటైనర్ ఢీ.. స్పాట్‌లో 16 మంది స్టూడెంట్స్

ఈ జాతరతో దేవాదాయ శాఖకు ఎటువంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తమ కుటుంబం 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేడుక అని నిర్వాహకులు స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా, రాజకీయాలకు అతీతంగా జాతరను జరుపుకోవాలని వారు కోరారు. చట్టం, న్యాయం తమ వైపు ఉన్నాయని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తుల సౌకర్యార్థం జాతరను ఘనంగా పూర్తి చేస్తామని ఉదయనందన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×