E-Paper
Advertisement

హోండా NX500 ఇ-క్లచ్ వచ్చేసింది, క్లచ్ పట్టకుండానే గేర్లు మార్చేయొచ్చు!

హోండా NX500 ఇ-క్లచ్ వచ్చేసింది, క్లచ్ పట్టకుండానే గేర్లు మార్చేయొచ్చు!
Advertisement

Honda NX500 E-Clutch Launched in India: హోండా భారత మార్కెట్లోకి  కొత్త అడ్వెంచర్ బైక్ ను విడుదల చేసింది. హోండా NX500 ఇ క్లచ్ పేరుతో పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ. 7.44 లక్షలుగా నిర్ణయించింది. ముఖ్యంగా ఈ బైక్‌లో ప్రత్యేక ఇ-క్లచ్ టెక్నాలజీని అందించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

క్లచ్ పట్టకుండానే గేర్ మార్చుకునే అవకాశం

సాధారణంగా బైక్ నడిపేటప్పుడు గేర్ మార్చాలంటే క్లచ్ లివర్‌ ను ఉపయోగించాలి. కానీ, ఈ కొత్త ఇ క్లచ్ సిస్టమ్‌ తో క్లచ్‌ ను చేతితో ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. గేర్ పెడల్‌ ను మాత్రం రైడర్ సాధారణంగానే ఉపయోగించాలి. అంటే గేర్ మార్పులు మరింత ఈజీ కానున్నాయి. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో రైడర్లకు సౌకర్యంగా ఉంటుంది. అయితే, రైడర్‌ కావాలంటే మాన్యువల్‌ గా కూడా క్లచ్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ బైక్‌ లో సాధారణ క్లచ్ లివర్‌ ను కూడా కొనసాగించారు. హోండా రూపొందించిన ఈ సిస్టమ్ చాలా కాంపాక్ట్‌ గా ఉండటంతో బైక్ బరువు కేవలం 3 కిలోలు మాత్రమే పెరిగింది. NX500 మొత్తం బరువు ఇప్పుడు 199 కిలోలకు చేరింది.

ఇంజిన్ పరంగా నో ఛేంజెస్!

Advertisement

ఈ బైక్ కు ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో ఇప్పటికే ఉన్న 471cc ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 47hp పవర్, 43Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌ బాక్స్ జత చేశారు. సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థ కూడా మునుపటి మోడల్‌ లాగే ఉంది. ముందు భాగంలో USD ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. అలాగే ముందు భాగంలో ట్విన్ డిస్క్  బ్రేక్‌ లు, వెనుక భాగంలో సింగిల్ డిస్క్ బ్రేక్ అందించారు. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది.

డిజైన్ లోనూ చిన్న మార్పులు

డిజైన్ విషయానికి వస్తే, ఈ బైక్‌ లో పెద్ద మార్పులు కనిపించవు. అడ్వెంచర్ టూరింగ్‌ కు అనుకూలంగా ఉండే స్టైలింగ్ అలాగే కొనసాగింది. ఇందులో 5 అంగుళాల TFT డిస్‌ ప్లే, సింపుల్ స్విచ్ గేర్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.  లేటెస్ట్ స్పోర్ట్స్ బైక్‌ లలో కనిపించే రైడింగ్ మోడ్‌ ఫీచర్లు ఇందులో లేవు. హోండా ఇటీవల CB650R,  CBR650R మోడళ్లలో కూడా ఇ క్లచ్ టెక్నాలజీని అందించింది. ఇప్పుడు అదే టెక్నాలజీని NX500లోకి తీసుకువచ్చింది.

ధర ఎంత అంటే?

Advertisement

ధర విషయానికి వస్తే, ఈ ఇ క్లచ్ వెర్షన్ సాధారణ NX500 కంటే రూ. 1.11 లక్షలు ఎక్కువ. అందుకే కొంతమంది దీన్ని ఖరీదైన ఆప్షన్‌ గా భావించవచ్చు. మార్కెట్లో దీనికి పోటీగా BMW F 450 GS, కవాసకీ వెర్సిస్  650 ఉన్నాయి. ఈ బైక్ తెలుపు, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దేశ వ్యాప్తంగా హోండా బిగ్‌ వింగ్ షోరూమ్‌ లలో బుకింగ్‌ లు  ప్రారంభమయ్యాయి.

Read Also: కియా కేరెన్స్ క్లావిస్ వచ్చేసింది, ధర జస్ట్ రూ. 12 లక్షలే!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×