E-Paper
Advertisement

మెదక్ జిల్లాలో శిశు విక్రయం కలకలం

మెదక్ జిల్లాలో శిశు విక్రయం కలకలం
Advertisement

Child Trafficking: స్వేచ్ఛ బ్యూరో: శిశు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. ఆడ శిశువును 3 లక్షలకు అమ్మిన తల్లి తండ్రులు కూల్చరం మండలం పోతిరెడ్డిపల్లి తాండకు చెందిన దంపతులు తమ 4 వ శిశువును అమ్ముకున్నారనే విషయం మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇట్టి విచారణలో కన్న తల్లి తండ్రులు తమ పాపను 3 లక్షలకు అమ్ముకున్నారని నిర్దారించుకుని సంబంధిత పోలీస్ స్టేషన్‌లో తగు చర్యల కొరకై ఫిర్యాదు చేయడం జరిగినది.

3 లక్షలకు..

పోలీసుల విచారణలో భాగంగా కూల్చరం మండలం పోతిరెడ్డిపల్లి తాండకు చెందిన దంపతులకు ఇదివరకే 3 సంతానం ఉండగా తేదీ 27.3.2026 నాడు మెదక్ లోని MCH Hospital లో ఆడ పాప జన్మించడం జరిగినది. పాపను దంపతులిద్దరూ 3 లక్షలకు కొంత మంది మధ్యవర్తుల ద్వారా అల్లినగర్, ములుగు మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన దంపతులకు విక్రయించడం జరిగినది. దీంతో ఈ విషయంపై పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పాపను తీసుకువచ్చి మహిళా శిశు సంక్షేమ అధికారులకు అప్పగించారు.

Advertisement

Also read: గోల్డ్ మార్కెట్‌లో ‘భారత్ బాంబ్’.. ఒక్క ఏడాది కొనుగోళ్లు ఆపేస్తే.. ప్రపంచం తలకిందులేనా?

చట్ట ప్రాకారం..

అధికారులు సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు పాపను తదుపరి సంరక్షణ నిమిత్తం సంగారెడ్డి లోని శిశుగృహ కు తరలించి ఆశ్రయం కల్పించారు. జిల్లాలో అక్రమ దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేస్తూ, ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవలంటే ప్రభుత్వ నియమ నిభందనల ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Also read: సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడితే జైలుకు రావాల్సిందే: సీవీ ఆనంద్ వార్నింగ్!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×