E-Paper
Advertisement

హోండా SP125 స్పెషల్ ఎడిషన్‌ కు గుడ్‌ బై.. వెబ్‌ సైట్ నుంచి మాయం!

హోండా SP125 స్పెషల్ ఎడిషన్‌ కు గుడ్‌ బై.. వెబ్‌ సైట్ నుంచి మాయం!
Advertisement

Honda SP125 25th Anniversary Edition: హోండా నుంచి మరో ముఖ్యమైన మోడల్ ఔట్ అయ్యింది. SP125 25వ వార్షికోత్సవ ఎడిషన్ ను వెబ్‌ సైట్ నుంచి తొలగించింది. దీంతో ఈ ప్రత్యేక ఎడిషన్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై హోండా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

25వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిషన్ విడుదల

భారత మార్కెట్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హోండా ఈ స్పెషల్ ఎడిషన్‌ ను విడుదల చేసింది. అప్పట్లో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,02,516గా నిర్ణయించింది. సాధారణ SP125తో పోలిస్తే ఈ మోడల్‌ కు కొన్ని ప్రత్యేకమైన డిజైన్ మార్పులు చేసి మరింత ఆకట్టుకునేలా తీసుకొచ్చారు. ఈ స్పెషల్ ఎడిషన్‌ లో ముందు భాగంలో ప్రత్యేక 25వ వార్షికోత్సవ స్టిక్కర్ ఇచ్చారు. అలాగే ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌ పై బ్రౌన్, గ్రే రంగుల గ్రాఫిక్స్ యాడ్ చేశారు.  వీటితో బైక్‌ కు కొత్త లుక్ వచ్చింది. పైరైట్ బ్రౌన్ కలర్ అల్లాయ్ వీల్స్ ను కూడా యాడ్ చేసింది  ఇవి బైక్‌ కు మరింత ప్రీమియం లుక్ అందించాయి.

మెకానికల్ గా నో ఛేంజెస్

Advertisement

డిజైన్‌లో కొన్ని మార్పులు తప్పితే, మెకానికల్ పరంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ లో ఎలాంటి మార్పులు చేయలేదు.  సాధారణ SP125 DLX వేరియంట్లో ఉన్న అదే ఇంజిన్, ఫీచర్లతోనే అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్‌ లో 123.94cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 10.7 bhp పవర్, 10.9 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిటీ ప్రయాణాలకు అనువైన పనితీరుతో పాటు మంచి మైలేజీ కూడా అందించేలా దీనిని రూపొందించారు. టెక్నాలజీ పరంగా కూడా SP125 మంచి ఫీచర్లను అందిస్తుంది. ఇందులో 4.2 అంగుళాల TFT డిస్‌ ప్లే ఉంటుంది. ఇది స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. దీంతో టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్, SMS నోటిఫికేషన్లు లాంటి ఫీచర్లను రైడర్ ఈజీగా ఉపయోగించుకోవచ్చు.

హోండా ఈ 25వ వార్షికోత్సవ ఎడిషన్‌ను యాక్టివా 110, యాక్టివా 125 ప్రత్యేక ఎడిషన్లతో కలిసి విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం SP125 యానివర్సరీ ఎడిషన్ మాత్రమే వెబ్‌ సైట్ నుంచి రిమూవ్ చేసింది. మరోవైపు యాక్టివా 110, యాక్టివా 125 25వ వార్షికోత్సవ ఎడిషన్లు మాత్రం ఇంకా కంపెనీ అధికారిక వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉన్నాయి. SP125 యానివర్సరీ ఎడిషన్‌ ను వెబ్‌ సైట్ నుంచి తొలగించడం వల్ల ఈ మోడల్‌ ను పూర్తిగా నిలిపివేసినట్లు భావిస్తున్నారు. భవిష్యత్తులో దీనికి బదులుగా కొత్త స్పెషల్ ఎడిషన్, అప్‌ డేటెడ్ మోడల్‌ ను హోండా తీసుకువస్తుందా? అనే అంశంపై ఇంకా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Read Also: పల్సర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. N125 ఉత్పత్తి నిలిపివేత!

Related News

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×