E-Paper
Advertisement

Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ మరింత పెరగాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ మరింత పెరగాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!
Advertisement

భారత్ లో రోజు రోజుకు ఎలక్టరిక్ స్కూటర్ల వినియోగం రోజు రోజుకు మరింత పెరుగుతోంది. రోజువారీ ఆఫీసు ప్రయాణాలు మొదలుకొని కాలేజీ విద్యార్థుల వరకు, చాలా మంది వినియోగదారులు ఫ్యూయెల్ ఖర్చులను ఆదా చేసుకోవడానికి, పొల్యూషన్ లోని ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను వాడుతున్నారు. అయితే, చాలా మంది రైడర్లు పడే ఇబ్బంది రేంజ్.  ఒకే ఛార్జ్ మీద ఎక్కువ దూరం ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే, కొన్ని స్మార్ట్ రైడింగ్ టిప్స్ ద్వారా చిన్న చిన్న సర్దుబాట్లతో, తమ ఎలక్ట్రిక్ స్కూటర్ పరిధిని మరింతగా పెంచుకోవచ్చు. టెన్షన్ లేని రైడింగ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఇ-స్కూటర్‌ లో ఎలా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చో తెలుసుకుందాం..

⦿ సున్నితమైన ప్రయాణం   

మీ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ ను పెంచేందుకు తీసుకోవాల్సిన జాగ్రతల్లో ఒకటి థ్రోటిల్‌పై స్మూత్ గా ఉండటం. రఫ్ గా వెళ్లడం వల్ల బ్యాటరీ నుంచి ఎక్కువ శక్తిని తీసుకుంది. మోటారు స్మూత్ గా నడిచేలా నెమ్మదిగా వెళ్లడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది. పలు స్కూటర్లు ఎకో, నార్మల్, స్పోర్ట్  లాంటి సర్దుబాటు చేసే  రైడింగ్ మోడ్‌లతో వస్తాయి. సిటీ ట్రాఫిక్, తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు ఎకో మోడ్‌ను ఉపయోగించడం వల్ల మీ బ్యాటరీ జీవితకాలం గణనీయంగా పెరుగుతుంది.

⦿ టైర్ ప్రెజర్‌ చూసుకోవాలి!

Advertisement

స్కూటర్ పని తీరులో సరైన టైర్ ప్రెజర్ చాలా ముఖ్యం. తక్కువ ప్రెజర్ ఉన్న టైర్ల కారణంగా వేగం తగ్గుతుంది.  ఫలితంగా బ్యాటరీ త్వరగా అయిపోతుంది. అందుకే, వారానికి ఒకసారి లేదంటే ఎక్కువ దూరం ప్రయాణించే ముందు టైర్ ప్రెజర్‌ను చెక్ చేసుకోవాలి. ఒకే ఛార్జ్‌ లో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది.

⦿ లోడ్‌ను తగ్గించండి!

ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద పరిమితికి మించి లోడ్ ఉంచకూడదు. ఎక్కువ బరువు కారణంగా బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. రేంజ్ కూడా తగ్గుతుంది. పెద్ద బ్యాగులను తీసుకెళ్లడం వల్ల మోటారుపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా తక్కువ దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే, స్కూటర్ డిజైన్ పరిమితుల్లో లోడ్‌ను ఉంచడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. అదనంగా 10 నుంచి 15 కిలోలకు మించి పెరగకుండా చూసుకోవాలి.

⦿ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ ఉపయోగించండి!

Advertisement

లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇది వేగాన్ని తగ్గించేటప్పుడు ఆటోమేటిక్ గా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ వ్యవస్థ ఎక్కువ ఛార్జ్‌ లేకున్నా, కొంత ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ప్రయత్నించవచ్చు. ఈ విధానం వల్ల రైడ్ టైమ్ లో బ్యాటరీని కొద్దిగా రీఛార్జ్ అవుతుంది.

⦿ బ్యాటరీ ఛార్జింగ్ అలవాట్లు  

బ్యాటరీ హెల్దీగా ఉంటే.. ఎక్కువ రేంజ్ అందిస్తుంది. బ్యాటరీని ఎప్పుడూ సున్నాకి రాకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు ఛార్జింగ్ 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడు 100 శాతం వరకు ఛార్జ్ చేయడం ఎక్కువ దూరం ప్రయాణించడానికి మంచిది. కానీ, ప్రతి రోజూ 100 శాతం చేయడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. అదే సమయంలో బ్యాటరీ ఛార్జింగ్ అనేది వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఛార్జ్ చేయాలి.

⦿ ఛార్జ్ ఆదా చేసేలా ప్రయత్నించాలి!

వీలైనంత వరకు ఎత్తులు, ట్రాఫిక్, మలుపులు ఉన్న రోడ్లు కాకుండా చక్కగా ఉన్న రోడ్ల మీద ప్రయాణించడం వల్ల బ్యాటరీ ఛార్జింగ్ ఆదా అవుతుంది. చక్కటి రోడ్లతో పాటు తక్కువ స్టాఫ్ లు ఉండేలా చూసుకోవాలి.  చక్కటి రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడం వల్ల బ్యాటరీని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

⦿ స్కూటర్‌ను సర్వీస్ చేసి సాఫ్ట్‌ వేర్‌ ను అప్‌డేట్ చేయండి!

చక్కగా సర్వీస్ చేయించుకునే స్కూటర్ స్మూత్ గా ప్రయాణిస్తుంది. బ్రేక్‌లను తరచుగా శుభ్రం చేయడం, లూజుగా ఉన్న బోల్ట్ లను టైట్ చేయడం, మోటార్ పనితీరు మృదువుగా ఉండేలా చూసుకోవడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. సర్వీస్ సెంటర్‌ లొ సాఫ్ట్‌ వేర్ అప్ డేట్ చేయడం వల్ల  మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అవసరం లేనప్పుడు హెడ్‌ లైట్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌ లను ఆఫ్ చేయాలి.

Read Also: భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం, భారీగా తగ్గనున్న కార్ల ధరలు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×