E-Paper
Advertisement

Hyundai Discounts Jan 2026: హ్యుందాయ్ జనవరి డిస్కౌంట్లు.. ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు!

Hyundai Discounts Jan 2026: హ్యుందాయ్ జనవరి డిస్కౌంట్లు.. ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష వరకు తగ్గింపు!
Advertisement

పాత స్టాక్ ను క్లియర్ చేసేందుకు హ్యుందాయ్ మోటార్స్ తన కార్ల మీద భారీగా తగ్గింపు అందిస్తోంది. క్రెటా, ఎక్స్‌టర్‌ లతో పాటు గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా,  ఐ20, వెన్యూ, వెర్నాతో పాటు అల్కాజార్‌ పై క్రేజీ డిస్కౌంట్లను అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్ బోనస్‌లతో పాటు ఎంపిక చేసిన కార్ల మీద కార్పొరేట్, ప్రభుత్వ ఆఫర్లను అందిస్తున్నాయి. మోడల్, వేరియంట్, ఇంజిన్ ను బట్టి డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి.

ఎక్స్‌ టర్ పై రూ. 98,000 వరకు..

హ్యుందాయ్ చిన్న SUV  ఎక్స్‌ టర్  అన్ని మోడళ్లతో పోల్చితే భారీగా డిస్కౌంట్లు పొందుతుంది. మొత్తం డిస్కౌంట్ ఏకంగా   రూ. 98,000 వరకు ఉంది. SX వేరియంట్లపై  రూ. 90,000 వరకు డిస్కౌంట్లను అందుకోగా, S వేరియంట్లపై రూ. 83,000 వరకు ఆఫర్లు పొందుతుంది. ఎక్స్‌ టర్ CNG వెర్షన్ వేరియంట్లు, ఎక్స్‌ ఛేంజ్, స్క్రాపేజ్ స్కీమ్స్ ఆధారంగా రూ. 63,000 వరకు  ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఎక్స్‌ టర్ టాటా పంచ్‌తో పోటీ పడుతోంది. దీని ధర రూ. 5.64 లక్షల నుంచి రూ. 9.38 లక్షల వరకు ఉంది.

i20పై రూ. 95,000 వరకు..

Advertisement

జనవరిలో i20పై రూ. 95,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.  ఎంపిక చేసిన పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై ఎక్కువ తగ్గింపు అందిస్తోంది. N లైన్ కూడా రూ. 87,000 వరకు డిస్కౌంట్లు పొందుతోంది. i20 మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్‌ కు పోటీగా ఉంది. ఈ కారు ధర రూ. 6.87 లక్షల నుంచి రూ. 11.53 లక్షల వరకు ఉంటుంది.

గ్రాండ్ i10 నియోస్‌పై రూ. 89,000 వరకు..

గ్రాండ్ i10 నియోస్‌పై ఏకంగా రూ. 89,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ తగ్గింపు పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై అందించబడుతుంది. అటు CNG వేరియంట్లపై రూ. 80,000 వరకు తగ్గింపు లభిస్తుంది. AMT వేరియంట్లపై రూ. 79,000 వరకు డిస్కౌంట్లు ఇస్తుంది కంపెనీ. బేస్ ఎరా ట్రిమ్‌పై రూ. 67,500 వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. మారుతి స్విఫ్ట్, టాటా టియాగోకు ఈ కారు పోటీ ఇస్తుంది. దీని ధర రూ. 5.66 లక్షల నుంచి రూ. 7.92 లక్షల మధ్య ఉంటుంది.

వెర్నాపై రూ. 70,000 వరకు..   

Advertisement

వెర్నాపై హ్యుందాయ్ రూ. 70,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. టర్బో పెట్రోల్, నాన్ టర్బో పెట్రోల్ వేరియంట్‌లు రెండూ కవర్ అవుతున్నాయి. మొత్తం డిస్కౌంట్ అనేది వేరియంట్, వర్తించే స్కీమ్ మీద ఆధారపడి ఉంటుంది. హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్‌ వ్యాగన్ వర్టస్‌ కు ఈ కారు పోటీ ఇస్తుంది. వెర్నా ధర రూ. 10.79 లక్షల నుంచి రూ. 17.13 లక్షల మధ్య ఉంది.

ఇతర కార్ల విషయానికి వస్తే..

ఇక హ్యుందాయ్ అల్కాజార్‌పై రూ. 65,000 వరకు తగ్గింపు లభిస్తుంది. వెన్యూపై రూ.60,000 వరకు తగ్గింపు ఇస్తుంది.  ఆరాపై రూ.58,000 వరకు తగ్గింపును అందిస్తోంది. క్రెటాపై రూ. 40,000 వరకు డిస్కౌంట్ ఇస్తుంది.

Read Also: ఓలా To సింపుల్ ఎనర్జీ.. అదిరిపోయే రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×