E-Paper
Advertisement

ఈవీ రంగంలోకి జాగ్వార్ ఎంట్రీ, మే 12న తొలి సూపర్ మోడల్ ఆవిష్కరణ!

ఈవీ రంగంలోకి జాగ్వార్ ఎంట్రీ, మే 12న తొలి సూపర్ మోడల్ ఆవిష్కరణ!

Jaguar Type 00 Name Reveal: బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు, తన తొలి ఎలక్ట్రిక్ గ్రాండ్ టూరర్ కారుకు సంబంధించిన కీలక ప్రకటన చేసేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ‘టైప్ 00’ అనే కోడ్‌ నేమ్‌ తో రెడీ అవుతున్న ఈ కారుకు అసలు పేరును మే 12న వెల్లడించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవల పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించిన జాగ్వార్‌ కు ఇదో కీలక ఎంట్రీ కాబోతోంది.

పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం

2024 చివర్లో జాగ్వార్ తన బ్రాండ్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం చేస్తూ రీబ్రాండింగ్ చేసింది. ఆ నిర్ణయం కొంత వివాదాస్పదంగా మారినప్పటికీ, కంపెనీ భవిష్యత్తు వ్యూహంలో ఇదో కీలక అడుగుగా నిలిచింది.  ఇప్పుడు ఈ టైప్ 00 మోడల్.. జాగ్వార్ విడుదల చేసే తొలి ఎలక్ట్రిక్ వాహనంగా నిలవనుంది. ఈ కొత్త కారు జాగ్వార్ రూపొందించిన ప్రత్యేక ఎలక్ట్రిక్ ప్లాట్‌ ఫారమ్ జాగ్వార్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ ఫామ్ పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించబడింది. పర్ఫార్మెన్స్, రేంజ్, ఛార్జింగ్ స్పీడ్ లాంటి అంశాల్లో మరింత అడ్వాన్స్ డ్ గా ఉండబోతోంది.

ఒకే ఛార్జ్ తో 700 కి.మీ ప్రయాణం

టైప్ 00లో శక్తివంతమైన ట్రిపుల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 1,000 హార్స్‌ పవర్ కంటే ఎక్కువ పవర్, సుమారు 1,300Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇదో హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ GT కారుగా అర్థం అవుతోంది. రేంజ్ విషయంలో కూడా ఇది ఆకట్టుకుంటుంది. ఒకే ఛార్జ్‌ తో దాదాపు 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.

కేవలం 15 నిమిషా ఛార్జ్ తో 300 కి.మీ ప్రయాణం

ఛార్జింగ్ పరంగా కూడా ఈ కారు వేగంగా పని చేస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే దాదాపు 321 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి సరిపడే ఛార్జ్ అవుతుంది. సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా చేస్తుంది. ఈ కారులో ఎయిర్ సస్పెన్షన్, ట్విన్ వాల్వ్ యాక్టివ్ డాంపర్లు లాంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఇవి డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత సౌకర్యవంతంగా మార్చుతాయి.

ఆకట్టుకునేలా డిజైన్

ఇప్పటికే బయటకు వచ్చిన టెస్ట్ కార్ల ఫోటోలను పరిశీలిస్తే, టైప్ 00 డిజైన్ విషయంలో కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. దీని ముందు భాగంలో పొడవైన బోనెట్, వెనుక భాగంలో కాంపాక్ట్ స్టైల్, సింపుల్ ఫ్రంట్ ఫేషియా, స్లోపింగ్ రూఫ్‌ లైన్ లాంటి డిజైన్ కనిపిస్తోంది. ఇవి కాన్సెప్ట్ మోడల్‌ కు చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే, కాన్సెప్ట్ వెర్షన్ 2 డోర్లుగా ఉండగా, ప్రొడక్షన్ మోడల్ మాత్రం 4 డోర్ల గ్రాండ్ టూరర్ రూపంలో రానుంది. ఈ కారు 2027 చివరిలో లేదంటే 2028 ప్రారంభం మధ్యలో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు.

Read Also: భారత్‌ లో బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్!

Related News

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

Big Stories

×