E-Paper
Advertisement

జీప్ కార్లపై బంపర్ ఆఫర్లు.. కంపాస్, మెరిడియన్‌పై లక్షల్లో డిస్కౌంట్లు!

జీప్ కార్లపై బంపర్ ఆఫర్లు.. కంపాస్, మెరిడియన్‌పై లక్షల్లో డిస్కౌంట్లు!
Advertisement

Jeep India  Special Discounts: జీప్ కార్లను కొనాలని భావిస్తున్న వారికి జూన్ 2026లో కంపెనీ అధిరపోయే ఆఫర్లు అందిస్తోంది. కంపెనీ ఈ నెలలో పాపులర్ SUV మోడళ్లైన కంపాస్, మెరిడియన్‌ పై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. కొన్ని వేరియంట్లపై రూ.1.65 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. అయితే, జీప్ వ్రాంగ్లర్‌పై ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేవు. 2026 గ్రాండ్ చెరోకీ స్టాక్ ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.

జీప్ మెరిడియన్ పై భారీగా డిస్కౌంట్లు

ఈ నెలలో ఎక్కువ బెనిఫిట్స్ జీప్ మెరిడియన్ మీద అందుబాటులో ఉన్నాయి. కంపెనీ మెరిడియన్‌ పై మొత్తం రూ.1.65 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ముఖ్యంగా MY24 మోడళ్లపై ఎంపిక చేసిన కస్టమర్లకు కార్పొరేట్ బెనిఫిట్స్ రూపంలో రూ.1.3 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. అదనంగా డాక్టర్లు, లీజింగ్ కంపెనీలకు ప్రత్యేకంగా మరో రూ.30,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది.

జీప్ మెరిడియన్ గురించి..

Advertisement

జీప్ మెరిడియన్ ప్రస్తుతం బ్రాండ్‌ కు చెందిన ప్రీమియం మూడు వరుసల SUVగా మార్కెట్లో ఉంది. ఇందులో 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఈ ఇంజిన్ 170 హెచ్‌పీ పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలుదారులు 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్స్ ను పొందే అవకాశం ఉంటుంది. కొన్ని హై ఎండ్ వేరియంట్లలో 4×4 డ్రైవ్ సిస్టమ్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం మెరిడియన్ ధరలు రూ.23.33 లక్షల నుంచి రూ.37.82 లక్షల వరకు ఉన్నాయి.

జీప్ కంపాస్‌పైనా భారీ ఆఫర్లు

మరోవైపు జీప్ కంపాస్‌ పై కూడా కంపెనీ భారీ ఆఫర్లు అందిస్తోంది. జూన్ నెలలో కంపాస్‌ పై మొత్తం రూ.1.5 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో కార్పొరేట్ కస్టమర్లకు రూ.1.10 లక్షల వరకు ప్రత్యేక బెనిఫిట్స్ ఉన్నాయి. డాక్టర్లు, లీజింగ్ కంపెనీలు అదనంగా రూ.15,000 వరకు ప్రత్యేక డిస్కౌంట్ పొందవచ్చు.

జీప్ కంపాస్ గురించి..

Advertisement

కంపాస్ కూడా మెరిడియన్‌ లో ఉన్న అదే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ ను ఉపయోగిస్తుంది. 170 హెచ్‌పీ పవర్‌ తో వచ్చే ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో 4×4 సిస్టమ్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం జీప్ కంపాస్ ధరలు రూ.17.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.30.70 లక్షల వరకు ఉన్నాయి.

జీప్ SUVలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్లు మంచి ఆదాను అందిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులు, వైద్యులు, లీజింగ్ సంస్థలకు అదనపు ప్రయోజనాలు ఉండటం వల్ల మొత్తం డిస్కౌంట్ మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్ 2026లో జీప్ మెరిడియన్, కంపాస్‌ పై ప్రకటించిన ఈ ప్రత్యేక ఆఫర్లు బ్రాండ్ అమ్మకాలను పెంచేందుకు ఉపయోగపడే అవకాశముంది. ప్రీమియం SUV కొనాలని చూస్తున్న వినియోగదారులు ఈ నెలలో డీలర్‌ షిప్‌ లను సందర్శిస్తే మంచి డీల్ పొందే అవకాశం ఉంది.

Read Also: కొత్త టాటా టియాగో కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×