E-Paper
Advertisement

30, 40 ఏళ్లకే గుండెపోటు.. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆ 4 ఘోరమైన తప్పులు ఇవే!

30, 40 ఏళ్లకే గుండెపోటు.. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు చేస్తున్న ఆ 4 ఘోరమైన తప్పులు ఇవే!
Advertisement

Heart Attack in Youth: ఒకప్పుడు గుండెపోట్లు కేవలం వృద్ధులలోనే ఎక్కువగా చూసేవాళ్లం. కానీ, ఈ మధ్య కాలంలో 30, 40 ఏళ్ల వయసున్న ఐటీ ఉద్యోగులు, యువ కార్పొరేట్ ప్రొఫెషనల్స్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరు అపోలో హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జయరంగనాథ్ ఎమ్ దీనికి గల ముఖ్య కారణాలను, మన లైఫ్‌స్టైల్ లోని లోపాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా వివరించారు.

ఆఫీస్ ఒత్తిడి.. మారిన జీవనశైలి:

ప్రస్తుత తరం యువత ఆఫీసుల్లో విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఖరీదైన ఆధునిక జీవనశైలిని మెయింటైన్ చేయాలనే ఆర్థిక ఆందోళనలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. రోజుకు 10 నుండి 12 గంటల పాటు కదలకుండా ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం వల్ల శారీరక శ్రమ పూర్తిగా లోపించింది. ఈ నిశ్చల జీవనం గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.

ఆన్‌లైన్ ఫుడ్.. శరీరంలో మంట:

Advertisement

పని ఒత్తిడిలో పడి చాలామంది వంట చేసుకునే సమయం లేక ఫుడ్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. నిత్యం సాల్ట్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో అంతర్గతంగా ఇన్ఫ్లమేషన్ (వాపు/మంట) పెరుగుతుంది. ఇది నిరంతర ఒత్తిడితో తోడైనప్పుడు ‘కోర్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరిగి, రక్తనాళాల లోపలి పొరను పాడుచేస్తుంది. ఫలితంగా, ఆరోగ్యంగా కనిపించే 32 ఏళ్ల యువకుడికి కూడా రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడుతున్నాయి.

Also Read: ఇక వాట్సప్ లాగిన్‌కు OTP అవసరం లేదు.. హ్యాకర్లకు షాక్ ఇచ్చిన Vi కొత్త టెక్నాలజీ!

నిద్రలేమి.. కెఫిన్‌తో గుండె అల్లకల్లోలం:

Advertisement

బ్లాకేజ్ మాత్రమే కాదు.. గుండె కొట్టుకునే వేగంలో వచ్చే తేడాలు (అరిథ్మియా) కూడా ఇప్పుడు ఎక్కువయ్యాయి. దీనిని డాక్టర్ ‘ఎలక్ట్రికల్ స్టార్మ్’ అని పిలుస్తారు. సరైన నిద్ర లేకపోవడం, విశ్రాంతి తీసుకోకపోవడం, అలసటను దూరం చేసుకోవడానికి మితిమీరి కాఫీలు లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల గుండె వేగం, రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది రక్తనాళాల్లోని ప్లాక్స్ (కొవ్వు పేరుకుపోవడం) బద్దలై, హఠాత్తుగా గుండెపోటు రావడానికి దారితీస్తుంది.

చిన్న మార్పులతో గుండెకు రక్షణ:

గుండెను కాపాడుకోవడానికి జీవితాన్ని పూర్తిగా మార్చేయాల్సిన అవసరం లేదు. చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ఆఫీసులో గంటల తరబడి కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి కాసేపు నడవాలి. నిరంతర నిద్రలేమికి స్వస్తి చెప్పి, ప్రశాంతమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆఫీస్ ప్రాజెక్ట్‌లను మేనేజ్ చేసినట్లే, మన శరీరాన్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Also Read: రూ.8,999 నుంచే స్మార్ట్‌‌ఫోన్లు.. Amazon Saleలో ఏఐ ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్లు!

Related News

చికెన్‌పాక్స్ మచ్చలతో ఇబ్బందిపడుతున్నారా? ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి టిప్స్

ఆలూ సమోసా ఇంట్లోనే ఇలా చేశారంటే.. ఇక బయట అస్సలు కొనరు!

ఓవెన్ అవసరం లేదు.. కుక్కర్‌లోనే మెత్తటి చాక్లెట్ కేక్ ఇలా తయారు చేసేయండి!

అచ్చం గుడి ప్రసాదం లాంటి రవ్వ కేసరి రావాలంటే.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు!

బ్లడ్ రిపోర్టులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? ఈ 5 ఫుడ్స్ ఈ రోజే తినడం ప్రారంభించండి

చాణక్య నీతి.. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి 7 మార్గాలు

షుగర్ అదుపులో ఉండాలంటే అన్నం ఒక్కటి మానేస్తే సరిపోతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

“మా అబ్బాయి ఏ తప్పూ చేయడు”.. కొడుకుని అతిగా గారబం చేస్తే ఎదురయ్యే సమస్యలివే!

Big Stories

Advertisement
×