E-Paper
Advertisement

భారత్‌ లో కొత్త బైక్‌ల హంగామా.. మే ఎండింగ్ లో లాంచ్ కానున్న టాప్ 5 మోడళ్లు ఇవే!

భారత్‌ లో కొత్త బైక్‌ల హంగామా.. మే ఎండింగ్ లో లాంచ్ కానున్న టాప్ 5 మోడళ్లు ఇవే!
Advertisement

భారతీయ టూ వీలర్ మార్కెట్ లోకి మే నెలాఖరులో పలు కొత్త బైక్‌ లు, స్కూటర్లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. స్పోర్ట్స్ బైక్‌ ల నుంచి క్లాసిక్ క్రూయిజర్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ల వరకు పలు సెగ్మెంట్లలో ఈ కొత్త మోడళ్లు రాబోతున్నాయి. ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఆయా కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లు, కొత్త డిజైన్లు, అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఈ బైకులను తీసుకురాబోతున్నాయి. వాటిలో టాప్ 5 మోడల్స్ ఏవి అనేది ఇప్పుడు చూద్దాం..

⦿ హీరో కరిజ్మా XMR 250

ఈ నెలలో హాట్ టాపిక్ గా మారిన మోడల్ హీరో కరిజ్మా XMR 250. హీరో కంపెనీకి కరిజ్మా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే పేరుతో 250cc సెగ్మెంట్‌ లో మరింత పవర్‌ ఫుల్ మోడల్‌ ను తీసుకురాబోతోంది. దీని ధర సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.2 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. స్పోర్ట్స్ బైక్‌ లను ఇష్టపడే యువతను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మంచి డిజైన్‌ తో పాటు మెరుగైన పనితీరు, కొత్త టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉంటాయి.

⦿ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650

Advertisement

బైక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్ బుల్లెట్ 650. క్లాసిక్ బుల్లెట్ స్టైల్‌ను అలాగే ఉంచి,  650cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ ప్లాట్‌ ఫారమ్‌ పై ఈ బైక్‌ ను తీసుకురానుంది. దీని అంచనా ధర రూ.3.4 లక్షల వరకు ఉండవచ్చు. పాత బుల్లెట్ స్టైల్‌ ను ఇష్టపడే వారికి, ఎక్కువ పవర్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ కానుంది.

⦿ ట్రయంఫ్ ట్రైడెంట్ 800

ప్రీమియం సెగ్మెంట్‌ లో ట్రయంఫ్ ట్రైడెంట్ 800పై మంచి ఆసక్తి నెలకొంది. సుమారు రూ.11.5 లక్షల ధరతో ఈ నేకెడ్ రోడ్‌ స్టర్ మార్కెట్లోకి రావొచ్చని సమాచారం. ట్రయంఫ్ ప్రత్యేకమైన ట్రిపుల్ సిలిండర్ ఇంజిన్, అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఫీచర్లు, మెరుగైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ఉండనున్నాయి. మిడ్ రేంజ్ పనితీరు బైక్‌ లను కోరుకునే వారికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది.

⦿ బజాజ్ పల్సర్ 350

Advertisement

ఇక బజాజ్ కూడా పల్సర్ శ్రేణిలో కొత్త మోడల్‌ను తీసుకురాబోతోంది. పల్సర్ 350 పేరుతో రానున్న ఈ బైక్ ధర రూ.1.65 లక్షల నుంచి రూ.1.90 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పల్సర్ బైక్‌లకు భారత మార్కెట్‌ లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మరింత పవర్, కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లతో ఈ మోడల్ యువతను ఆకట్టుకునే అవకాశముంది.

⦿  ఏథర్ EL01

ఎలక్ట్రిక్ విభాగంలో ఏథర్ కూడా కొత్త స్కూటర్‌ ను లాంచ్ చేయాలని భావిస్తోంది. అథర్ EL01 పేరుతో రానున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.95 వేల నుంచి రూ.1.05 లక్షల మధ్య ఉండొచ్చు. రోజువారీ నగర ప్రయాణాలకు అనువుగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మంచి రేంజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, లేటెస్ట్ ఫీచర్లతో రానుంది.

Read Also: పెట్రోల్ ధరల ఎఫెక్ట్.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న బజాజ్ చేతక్ EV!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×