E-Paper
Advertisement

BSNL బంపరాఫర్.. ఫ్రీ సిమ్, కాల్స్, రోజూ 2GB డేటా.. మే 31 వరకే ఛాన్స్

BSNL బంపరాఫర్.. ఫ్రీ సిమ్, కాల్స్, రోజూ 2GB డేటా.. మే 31 వరకే ఛాన్స్
Advertisement

BSNL Free SIM: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL).. మొబైల్ వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. పైసా తీసుకోకుండా ఉచితంగా కొత్త సిమ్ కార్డులను అందజేస్తోంది. కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ లోకి మారాలని భావిస్తున్న వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అని వెల్లడించింది. మే 31వ తేదీ లోపు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఫ్రీ సిమ్ ఆఫర్ కు సంబంధించి పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ఉచిత సిమ్ కార్డ్ ఆఫర్

సాధారణంగా ఏ నెట్ వర్క్ సిమ్ తీసుకోవాలన్న కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అది కాకుండా రీఛార్జ్ ప్లాన్ కోసం అదనంగా మరికొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇదేమి లేకుండా బీఎస్ఎన్ఎల్ ఉచితంగానే కొత్త సిమ్ ఆఫర్ చేస్తోంది. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా మే 31లోపు ఎలాంటి డబ్బు చెల్లించకుండానే ఉచితంగా సిమ్ తీసుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించింది. ఇందుకోసం సమీపంలోని BSNL కస్టమర్ కేర్ సెంటర్ (CSC) లేదా రిటైలర్ షాపులను సంప్రదించవచ్చని సూచించింది.

ఫ్రీ కాల్స్, రోజూ 2GB డేటా..

Advertisement

ఫ్రీ సిమ్ తో పాటు 30రోజుల పాటు అదనపు ప్రయోజనాలను సైతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద నెల రోజుల పాటు దేశంలో ఏ నెట్ వర్క్ కైనా కాల్ చేసుకోని అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు సైతం కస్టమర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతీ రోజూ 2GB డేటా సైతం యూజర్ పొందొచ్చు. 30 రోజుల కాలానికి మెుత్తం 60GB డేటా కస్టమర్లకు లభించనుంది.

Advertisement

Also Read: వాషింగ్ మిషన్ ఒక గంట పనిచేస్తే.. ఎంత కరెంటు బిల్లు వస్తుందో తెలుసా?

సిమ్ ఎలా పొందాలి?

బీఎస్ఎన్ఎల్ సిమ్ ను ఫ్రీగా పొందేందుకు కొన్ని డాక్యుమెంట్లను సంబంధిత వ్యక్తులకు అందజేయాల్సి ఉంటుంది. వినియోగదారులు తమ ఆధార్ కార్డ్ లేదా మరే ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును ఐడీ ప్రూఫ్ (ID Proof) గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను ఫ్రీ సిమ్ కోసం సమర్పించాలి. బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తైన వెంటనే బీఎస్ఎన్ఎల్ వర్గాలు సూచించిన నిర్దిష్ట సయమానికి సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. అప్పటి నుంచి 30 రోజుల పాటు ఫ్రీ కాల్స్, డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఇతర నెట్‌వర్క్‌ల నుండి బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయ్యేవారికి సైతం ఈ ఆఫర్ వర్తించనుండటం విశేషం.

Also Read: AC Side Effects: అతిగా ఏసీలో ఉంటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే.. ఏ క్షణమైనా..!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×